ఖైదీలకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్‌న్యూస్

TG: ఖైదీలకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ ఫార్మెషన్ డే సందర్భంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 92మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టింది. చాలాకాలంగా జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీల ప్రవర్తన, వయస్సు, ఆరోగ్య పరిస్థితులు, జైలులో వారి ప్రవర్తనా తీరు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఖైదీలను విడుదల చేయనున్నారు. 86మంది పురుషులు, ఆరుగురు మహిళా ఖైదీలు ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించి 12ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మానవతా దృక్పథంతో స్టేట్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ డిసిషన్ పట్ల ఖైదీల కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తంచేశారు.



