Latest

అపార్ట్‌మెంట్‌లో ఎగిసిపడ్డ మంటలు
TG: ఉప్పల్ భగాయత్ ప్రాంతంలోని రాయల్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్‌మెంట్ ఫోర్త్ ఫ్లోర్‌లోని ఓ ఫ్లాట్‌లో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బెడ్‌రూమ్‌లో ఉన్న బెడ్, ACతో పాటు ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు చెలరేగడంతో అపార్ట్‌మెంట్‌లోని ఇతర ఫ్లాట్ల నివాసితులు టెన్షన్ పడ్డారు. ఘటన సమయంలో ఫ్లాట్‌లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

SV యూనివర్సిటీలో చిరుతపులి కలకలం
AP: తిరుపతి SV యూనివర్సిటీలోని చొప్పల రత్నం బిల్డింగ్, ఐ బ్లాక్, జీ బ్లాక్ మధ్య చిరుతపులి తిరుగుతున్నట్టు సిబ్బంది గుర్తించారు. ఇటీవల కాలంలో యూనివర్సిటీ పరిసర ప్రాంతాలలో చిరుతల సంచారం కామన్ అయిపోయింది. వెటర్నరీ యూనివర్సిటీ, వేద విశ్వవిద్యాలయం పరిసరాలు, సిబ్బంది క్వార్టర్స్‌లో చిరుతపులులు తిరుగుతూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆహారం కోసం వచ్చే కుక్కలను అనుసరిస్తూ వస్తున్నాయని అధికారులు గుర్తించారు. అధికారులు ఎప్పటికప్పుడు వాటి కదలికలను పరిశీలిస్తూ బోన్లు ఏర్పాటు చేసి నిర్భందిస్తున్నారు.

రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ?
ఫేమస్ కొరియోగ్రాఫర్, యాక్టర్ రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీపై ఒక వీడియో రిలీజ్ చేశారు. అది చూసి ఫ్యాన్స్ ఇచ్చే అడ్వైస్ బట్టే తన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని చెప్పారు. ఒకవేళ వాళ్ళు ‘నో’ చెప్తే పాలిటిక్స్‌లోకి రానని, ఎప్పటిలాగే సోషల్ సర్వీస్ చేసుకుంటానని స్పష్టం చేశారు. ఒకవేళ ‘యస్’ అని గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం, ఎవరితో కలిసి జర్నీ స్టార్ట్ చేస్తానో త్వరలోనే అనౌన్స్ చేస్తానంటూ లారెన్స్ ఫ్యాన్స్ బ్లెస్సింగ్స్ కోరారు.

'క్లీన్ రికార్డ్ ఉన్న నేతను అడ్డుకోవడం దుర్మార్గం'
TG: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైరయ్యారు. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని కుట్రపూరితంగా వ్యవహరించిదన్నారు. ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, కోర్టుల్లో ఎలాంటి వివాదాలు పెండింగ్‌లో లేవన్నారు. క్లీన్ రికార్డ్ ఉన్న నేతను అడ్డుకోవడం దుర్మార్గం అని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దొరకని పాప జాడ.. కుక్కకు GPS ట్రాకర్
AP: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా దొరకలేదు. ఈ నెల 6న మిస్సైన చిన్నారి కోసం దాదాపు 500 మంది పోలీసులు అడవిని జల్లెడ పడుతున్నా ప్రయోజనం దక్కట్లేదు. ఈ కేసులో పెంపుడు కుక్క కీలకంగా మారడంతో పోలీసులు పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి పోలీసులు GPS ట్రాకర్ అమర్చారు.

తప్పుడు లెక్కలు సృష్టించి.. 3.61 కోట్లు స్వాహా
AP: అనంతపురం జిల్లాలో నిర్వహించిన ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరిగాయి. జిల్లాలోని 31 మండలాల పరిధిలో చేయని పనులకు బిల్లులు చెల్లించడం, తప్పుడు పేర్లు నమోదు చేయడం, పనికి రాకున్నా మరొకరి పేర్లతో కూలి వేతనాలు చెల్లించడం, వంటి అనేక రూపాల్లో నిధుల దుర్వినియోగం జరిగినట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది జరిగిన ఉపాధి పనుల్లో రూ. 3.61 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు గుర్తించారు. ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ తదితరులు అక్రమాలకు పాల్పడిన వారిలో ఉన్నారు. రికవరీ కోసం విజిలెన్స్ అధికారులు చర్యలు చేపట్టారు.

సముద్రంలో రెస్య్కూ కి మానవ రహిత సీ డ్రోన్స్ !
డ్రోన్ బోట్ చరిత్ర సృష్టించింది.హోర్ముజ్ జలసంధి సమీపంలో కూలిపోయిన అపాచీ హెలికాప్టర్ సిబ్బందిని అమెరికా నౌకాదళం 'సరోనిక్ కోర్సెయిర్' అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డ్రోన్ బోట్ ద్వారా సేఫ్ గా ఒడ్డుకు చేర్చింది. . సైనిక చరిత్రలో ఒక మానవరహిత నౌక సముద్రంలో సిబ్బందిని రక్షించడం ఇదే మొదటిసారి. 140 కి.మీ వేగంతో దూసుకెళ్లే ఈ అధునాతన సీ-డ్రోన్‌ను టెక్సాస్‌కు చెందిన సరోనిక్ టెక్నాలజీస్ రూపొందించింది.

డీలిమిటేషన్.. TGలో 26 MPలు , APలో 38 MPలు
దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని ఆర్థిక సలహా మండలి కీలక ప్రతిపాదనలు చేసింది. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్‌లను మూడేసి నియోజకవర్గాలుగా, చేవెళ్లను రెండుగా విభజించనున్నారు. APలో రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నంలను మూడుగా, మచిలీపట్నం నియోజకవర్గాన్ని 2గా చేయనున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణలో లోక్‌సభ సీట్లు 17 నుంచి 26కు, ఆంధ్రప్రదేశ్‌లో 25 నుంచి 38కు పెరగనున్నాయి.

దేశంలో ఇక 824 MP స్థానాలు
దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని ఆర్థిక సలహా మండలి కీలక ప్రతిపాదనలు చేసింది. దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 824కు పెంచాలని, ప్రస్తుతమున్న 543లో 373 నియోజకవర్గాలను యథాతథంగా ఉంచి, 59 స్థానాలను 2గా, 111 స్థానాలను 3 నియోజకవర్గాలుగా విభజించాలని సూచించింది. మొత్తంగా 170 స్థానాలను విభజిస్తేచాలని సూచించింది. ఇందుకోసం పట్టణ, ఎస్సీ, ఎస్టీ, మహిళల జనాభా, భాషా సమీకరణాలు, భాషా వైవిధ్యం, గత లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపాదించింది.

OUలో కొత్త సాఫ్ట్‌వేర్.. PHD స్కాలర్స్‌కు షాక్
TG: ఉస్మానియా యూనివర్సిటీలో PHD స్కాలర్స్ AI సాయంతో పరిశోధనలు పూర్తిగా చేయకుండానే ప్రాజెక్టు రిపోర్ట్స్ సమర్పిస్తున్నట్లు OU అధికారులు గుర్తించారు. సరికొత్త AI చెకింగ్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏఐ ద్వారా పరిశోధన పూర్తిచేసి రికార్డులు సమర్పించిన విద్యార్థులకు PHD సీటు రాకుండా చేస్తామని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. పీహెచ్‌డీ స్కాలర్లు చాట్‌జీపీటీ, జెమిని సహా ఇతర AI టూల్స్ ఉపయోగించి పరిశోధన పత్రాలను సమర్పిస్తున్నారని గుర్తించారు. స్పెషల్ సాఫ్ట్‌వేర్‌తో టెస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఫెమినిజానికి చెక్- మహిళల కోసం చైనాలో సేఫ్ సెంటర్లు
చైనాలో ఫెమినిజం పై ప్రభుత్వం కఠిన నిబంధనలు విధిస్తూ, పాతకాలపు విధానాలను ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో ‘చెంగ్డూ’ నగరంలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాలు ( బుక్ పాయింట్లు, కేఫ్‌లు) మహిళలు తమ అభిప్రాయాలు చెప్పుకోడానికి సేఫ్ సెంటర్లుగా మారాయి. అక్కడ వారు ఎలాంటి భయం లేకుండా తమ భావాలను ఎక్స్ ఛేంజ్ చేసుకుంటూ, సమానత్వం కోసం చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వ ఆంక్షలు పెరుగుతున్నా, ఈ సెంటర్ లు మహిళా చైతన్యానికి నిలయాలుగా నిలుస్తున్నాయి.

'మా ఆయన బతికే ఉంటారని అనుకున్నా'
AP: ఒమన్ తీరంలో నౌకపై జరిగిన దాడిలో మృతి చెందిన మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేశ్ భార్య భార్గవి కన్నీరుమున్నీరయ్యారు. మా ఆయన గల్లంతైన సమాచారం అందినప్పటికీ ఆయన బతికే ఉంటారని భరోసాతో ఉన్నానన్నారు. దాడి జరిగినప్పుడు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకొని ఉంటారని అనుకున్నా కానీ ఆ తర్వాత కొన్ని గంటల్లోనే మరణ వార్త వినాల్సి వచ్చిందని భార్గవి తెలిపారు. విశాఖపట్నం శ్రీహరిపురంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన సురేశ్‌కు భార్య భార్గవితో పాటు ఇద్దరు కుమారులున్నారు.

ఆ పార్టీకి TRS పేరును కేటాయించొద్దు: BRS
TG: మాజీ MLC కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ పేరుపై రాజకీయంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. TRS పేరును ఆ కొత్త పార్టీకి కేటాయించవద్దని BRSతోపాటు పలువురు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) అనే పేరుతో తమ పార్టీ దశాబ్దాలపాటు తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉందని BRS నేతలు గుర్తుచేశారు. కాబట్టి టీఆర్‌ఎస్ పేరును మరో పార్టీకి కేటాయించవద్దని కోరారు. కవిత స్థాపించిన TRS పార్టీ పేరు రిజిస్ట్రేషన్‌పై ఎలక్షన్ కమిషన్‌కు ఇప్పటివరకు దాదాపు 700కుపైగా అభ్యంతరాలు అందాయి.

అమరావతిలో బెడ్‌ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్
AP: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ బెడ్‌ఫోర్డ్ విద్యా సంస్థ అమరావతిలో తమ స్కూల్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. 470 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ స్కూల్‌కు ప్రస్తుతం బెడ్‌ఫోర్డ్‌లో, భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం మొహాలిలో మాత్రమే క్యాంపస్‌లు ఉన్నాయి. ఇప్పుడు అమరావతిలో మూడో క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. ఈ స్కూల్‌కు సీఆర్డీఏ తుళ్లూరు సమీపంలో 8 ఎకరాల స్థలం కేటాయించింది. హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీతో కలిసి ఈ స్కూల్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇది అమరావతికి వస్తున్న తొలి విదేశీ విద్యా సంస్థ.

HYDలో టెస్లా కారు తొలి షోరూం
TG: ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా హైదరాబాద్‌లో తొలి షోరూం ఈ నెల 17న ప్రారంభం కానుంది. నగరంలోని ప్రముఖ వాణిజ్య ప్రాంతంలో ఏర్పాటు చేసే ఈ షోరూం ద్వారా టెస్లా తన అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. టెస్లా కార్లపై ఆసక్తి ఉన్న వినియోగదారులు ప్రత్యక్షంగా వాహనాలను పరిశీలించే అవకాశం పొందనున్నారు. ఈ షోరూం ప్రారంభంతో హైదరాబాద్ ఆటోమొబైల్ రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకోనుంది. హైటెక్ సిటీలో ఈ షోరూం ప్రారంభం కానుంది.

డేటా సెంటర్లకు నో అంటున్న అమెరికా రాష్ట్రాలు
డేటా సెంటర్లంటే వద్దు బాబోయ్ అంటున్నాయి అమెరికాలోని 16 స్టేట్స్. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఇద్దరూ దీనిమీద ఉద్యమిస్తున్నారు. డేటా సెంటర్స్ చాలా పెద్ద మొత్తంలో పవర్ వినియోగిస్తాయి. దాంతో లోకల్ గ్రిడ్లు సప్లయ్ లో ఫెయిల్ అవుతు న్నాయి. అలాగే పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలను వెదజల్లుతాయి.దీని వల్ల పర్యావరణం దెబ్బ తింటుంది. గ్రీన్ హౌస్ వాయువులు తగ్గించాలన్న గ్లోబల్ టార్గెట్ ను రీచ్ కాలేము. అందుకే ఒకప్పుడు ఇన్వెస్ట్ మెంట్లకు, ఉద్యోగాలకు ఆశపడి ఈ సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించిన రాష్ట్రాలే ఇప్పుడు వద్దు వద్దంటున్నాయి.

మేడిన్ ఇండియా సి-295 ఫస్ట్ టెస్ట్ జర్నీ సక్సెస్
భారత రక్షణ, విమానయాన రంగంలో సరికొత్త మైలురాయి నమోదైంది. 'మేడిన్ ఇండియా' C-295 విమానం తన తొలి టెస్టును విజయవంతంగా పూర్తి చేసింది. గుజరాత్లోని వడోదర ఫైనల్ అసెంబ్లీ లైన్ నుండి టేకాఫ్ తీసుకున్న ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. భారతదేశంలో ఎయిర్బస్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న 40 విమానాల్లో ఇదే మొదటిది. ఈ సక్సెస్ సాధించిన టీమ్ ని భారత వై మానిక దళం(IAF) ప్రత్యేకంగా అభినందించింది.

సీపీఎం నేతలపై వైసీపీ ప్రభుత్వ కేసులు కొట్టేసిన కోర్టు
ధరల పెరుగుదల , పెట్రోల్ ,డీజిల్ రేట్ల పెంపుదలకు వ్యతిరేకంగా 2021,జూన్ 16న సీపీఎం నేతలపై పెట్టిన అక్రమ కేసులను కోర్టు కొట్టేసింది. అక్రమ కేసులు తొలగిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం మాట తప్పింది. విజయవాడ గవర్నర్ పేట దగ్గర వారు చేసిన శాంతియుత ఆందోళనను అప్పట్లో పోలీసులు అడ్డుకుని అక్రమ కేసులు బనాయించారు,ప్రజాసమస్యలపై పోరాడే తమపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమని, ప్రజలు, సామాన్యుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని సీపీఎం నేతలు సీ.హెచ్. బాబూరావు, కాశీనాథ్ తదితరులు చెప్పారు.

స్కూళ్లలో పీరియడ్స్ టైమ్‌లో ఇక నో ప్రాబ్లమ్స్!
మహిళల మెన్‌స్ట్రువల్ హెల్త్ (ఋతుక్రమ ఆరోగ్యం) ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ రూలింగ్ సరిగ్గా ఇంప్లిమెంట్ అయితే, స్కూల్స్ మధ్యలోనే మానేసే గర్ల్స్ కౌంట్ చాలా తగ్గుతుంది. ఇకపై ప్రతి స్కూల్లో గర్ల్స్ కోసం పక్కాగా టాయిలెట్స్, మెన్‌స్ట్రువల్ ప్రొడక్ట్స్ (ప్యాడ్స్) అరేంజ్ చేయడంతో పాటు అవేర్‌నెస్ సెషన్స్ పెట్టాలని కోర్టు స్పష్టం చేసింది.

పూణేలో అభిజీత్ దిప్కే, సోనమ్ వాంగ్చుక్ ఎంట్రీ!
ఎగ్జామ్స్ లీకేజీలపై కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పూణే యూనివర్సిటీలో ప్రొటెస్ట్ స్టార్ట్ చేసింది. ఈ నిరసనకు CJP ఫౌండర్ అభిజీత్ దిప్కేతో పాటు సోనమ్ వాంగ్చుక్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా ఎడ్యుకేషన్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మినిస్టర్ రిజైన్ చేసేవరకు ఈ మూవ్‌మెంట్ ఆపేది లేదని, నెక్స్ట్ లక్నో, బెంగళూరు, హైదరాబాద్ లలో కూడా ప్రొటెస్ట్స్ చేస్తామని CJP అఫీషియల్ పేజీలో అనౌన్స్ చేశారు.

దీదీ పై శతృఘ్న సిన్హా సెన్సేషనల్ స్టేట్ మెంట్ !
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న స్పెక్యులేషన్స్ ని టీఎంసీ ఎంపీ, నటుడు శతృఘ్న సిన్హా తిప్పి కొట్టారు. తాను రెబల్స్ గ్రూపులో ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన మమతా బెనర్జీని తాను ఎప్పటికీ వీడనని, 'దీదీ'తోనే తన ప్రయాణమని స్పష్టం చేశారు. మోదీని కేవలం స్పోర్టివ్ స్పిరిట్ తోనే కంగ్రాట్యులేట్ చేశానని, దానికి ఎలాంటి పొలిటికల్ ఇంపార్టెన్స్ లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.