← Back to news

SV యూనివర్సిటీలో చిరుతపులి కలకలం

By DK· 12 Jun 2026· Dishadaily· తిరుపతి
SV యూనివర్సిటీలో చిరుతపులి కలకలం

AP: తిరుపతి SV యూనివర్సిటీలోని చొప్పల రత్నం బిల్డింగ్, ఐ బ్లాక్, జీ బ్లాక్ మధ్య చిరుతపులి తిరుగుతున్నట్టు సిబ్బంది గుర్తించారు. ఇటీవల కాలంలో యూనివర్సిటీ పరిసర ప్రాంతాలలో చిరుతల సంచారం కామన్ అయిపోయింది. వెటర్నరీ యూనివర్సిటీ, వేద విశ్వవిద్యాలయం పరిసరాలు, సిబ్బంది క్వార్టర్స్‌లో చిరుతపులులు తిరుగుతూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆహారం కోసం వచ్చే కుక్కలను అనుసరిస్తూ వస్తున్నాయని అధికారులు గుర్తించారు. అధికారులు ఎప్పటికప్పుడు వాటి కదలికలను పరిశీలిస్తూ బోన్లు ఏర్పాటు చేసి నిర్భందిస్తున్నారు.

More in AP