Latest

OUలో కొత్త సాఫ్ట్‌వేర్..  PHD స్కాలర్స్‌కు షాక్
Education· 12 Jun 2026

OUలో కొత్త సాఫ్ట్‌వేర్.. PHD స్కాలర్స్‌కు షాక్

TG: ఉస్మానియా యూనివర్సిటీలో PHD స్కాలర్స్ AI సాయంతో పరిశోధనలు పూర్తిగా చేయకుండానే ప్రాజెక్టు రిపోర్ట్స్ సమర్పిస్తున్నట్లు OU అధికారులు గుర్తించారు. సరికొత్త AI చెకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏఐ ద్వారా పరిశోధన పూర్తిచేసి రికార్డులు సమర్పించిన విద్యార్థులకు PHD సీటు రాకుండా చేస్తామని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. పీహెచ్‌డీ స్కాలర్లు చాట్‌జీపీటీ, జెమిని సహా ఇతర AI టూల్స్ ఉపయోగించి పరిశోధన పత్రాలను సమర్పిస్తున్నారని గుర్తించారు. స్పెషల్ సాఫ్ట్‌వేర్‌తో టెస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఫెమినిజానికి చెక్- మహిళల కోసం  చైనాలో సేఫ్ సెంటర్లు
News· 12 Jun 2026

ఫెమినిజానికి చెక్- మహిళల కోసం చైనాలో సేఫ్ సెంటర్లు

చైనాలో ఫెమినిజం పై ప్రభుత్వం కఠిన నిబంధనలు విధిస్తూ, పాతకాలపు విధానాలను ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో ‘చెంగ్డూ’ నగరంలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాలు ( బుక్ పాయింట్లు, కేఫ్‌లు) మహిళలు తమ అభిప్రాయాలు చెప్పుకోడానికి సేఫ్ సెంటర్లుగా మారాయి. అక్కడ వారు ఎలాంటి భయం లేకుండా తమ భావాలను ఎక్స్ ఛేంజ్ చేసుకుంటూ, సమానత్వం కోసం చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వ ఆంక్షలు పెరుగుతున్నా, ఈ సెంటర్ లు మహిళా చైతన్యానికి నిలయాలుగా నిలుస్తున్నాయి.

'మా ఆయన బతికే ఉంటారని అనుకున్నా'
World· 12 Jun 2026

'మా ఆయన బతికే ఉంటారని అనుకున్నా'

AP: ఒమన్ తీరంలో నౌకపై జరిగిన దాడిలో మృతి చెందిన మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేశ్ భార్య భార్గవి కన్నీరుమున్నీరయ్యారు. మా ఆయన గల్లంతైన సమాచారం అందినప్పటికీ ఆయన బతికే ఉంటారని భరోసాతో ఉన్నానన్నారు. దాడి జరిగినప్పుడు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకొని ఉంటారని అనుకున్నా కానీ ఆ తర్వాత కొన్ని గంటల్లోనే మరణ వార్త వినాల్సి వచ్చిందని భార్గవి తెలిపారు. విశాఖపట్నం శ్రీహరిపురంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన సురే‌శ్‌కు భార్య భార్గవితో పాటు ఇద్దరు కుమారులున్నారు.

ఆ పార్టీకి TRS పేరును కేటాయించొద్దు: BRS
Politics· 12 Jun 2026

ఆ పార్టీకి TRS పేరును కేటాయించొద్దు: BRS

TG: మాజీ MLC కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ పేరుపై రాజకీయంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. TRS పేరును ఆ కొత్త పార్టీకి కేటాయించవద్దని BRSతోపాటు పలువురు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) అనే పేరుతో తమ పార్టీ దశాబ్దాలపాటు తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉందని BRS నేతలు గుర్తుచేశారు. కాబట్టి టీఆర్‌ఎస్‌ పేరును మరో పార్టీకి కేటాయించవద్దని కోరారు. కవిత స్థాపించిన TRS పార్టీ పేరు రిజిస్ట్రేషన్‌పై ఎలక్షన్ కమిషన్‌కు ఇప్పటివరకు దాదాపు 700కుపైగా అభ్యంతరాలు అందాయి.

అమరావతిలో బెడ్‌ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్
Education· 12 Jun 2026

అమరావతిలో బెడ్‌ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్

AP: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ బెడ్‌ఫోర్డ్ విద్యా సంస్థ అమరావతిలో తమ స్కూల్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. 470 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ స్కూల్‌కు ప్రస్తుతం బెడ్‌ఫోర్డ్‌లో, భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం మొహాలిలో మాత్రమే క్యాంపస్‌లు ఉన్నాయి. ఇప్పుడు అమరావతిలో మూడో క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. ఈ స్కూల్‌కు సీఆర్డీఏ తుళ్లూరు సమీపంలో 8 ఎకరాల స్థలం కేటాయించింది. హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీతో కలిసి ఈ స్కూల్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇది అమరావతికి వస్తున్న తొలి విదేశీ విద్యా సంస్థ.

HYDలో టెస్లా కారు తొలి షోరూం
TG· 12 Jun 2026

HYDలో టెస్లా కారు తొలి షోరూం

TG: ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా హైదరాబాద్‌లో తొలి షోరూం ఈ నెల 17న ప్రారంభం కానుంది. నగరంలోని ప్రముఖ వాణిజ్య ప్రాంతంలో ఏర్పాటు చేసే ఈ షోరూం ద్వారా టెస్లా తన అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. టెస్లా కార్లపై ఆసక్తి ఉన్న వినియోగదారులు ప్రత్యక్షంగా వాహనాలను పరిశీలించే అవకాశం పొందనున్నారు. ఈ షోరూం ప్రారంభంతో హైదరాబాద్ ఆటోమొబైల్ రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకోనుంది. హైటెక్ సిటీలో ఈ షోరూం ప్రారంభం కానుంది.

డేటా సెంటర్లకు నో అంటున్న అమెరికా రాష్ట్రాలు
World· 12 Jun 2026

డేటా సెంటర్లకు నో అంటున్న అమెరికా రాష్ట్రాలు

డేటా సెంటర్లంటే వద్దు బాబోయ్ అంటున్నాయి అమెరికాలోని 16 స్టేట్స్. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఇద్దరూ దీనిమీద ఉద్యమిస్తున్నారు. డేటా సెంటర్స్ చాలా పెద్ద మొత్తంలో పవర్ వినియోగిస్తాయి. దాంతో లోకల్ గ్రిడ్లు సప్లయ్ లో ఫెయిల్ అవుతు న్నాయి. అలాగే పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలను వెదజల్లుతాయి.దీని వల్ల పర్యావరణం దెబ్బ తింటుంది. గ్రీన్ హౌస్ వాయువులు తగ్గించాలన్న గ్లోబల్ టార్గెట్ ను రీచ్ కాలేము. అందుకే ఒకప్పుడు ఇన్వెస్ట్ మెంట్లకు, ఉద్యోగాలకు ఆశపడి ఈ సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించిన రాష్ట్రాలే ఇప్పుడు వద్దు వద్దంటున్నాయి.

మేడిన్ ఇండియా సి-295 ఫస్ట్  టెస్ట్  జర్నీ సక్సెస్
Technology· 11 Jun 2026

మేడిన్ ఇండియా సి-295 ఫస్ట్ టెస్ట్ జర్నీ సక్సెస్

భారత రక్షణ, విమానయాన రంగంలో సరికొత్త మైలురాయి నమోదైంది. 'మేడిన్ ఇండియా' C-295 విమానం తన తొలి టెస్టును విజయవంతంగా పూర్తి చేసింది. గుజరాత్లోని వడోదర ఫైనల్ అసెంబ్లీ లైన్ నుండి టేకాఫ్ తీసుకున్న ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. భారతదేశంలో ఎయిర్బస్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న 40 విమానాల్లో ఇదే మొదటిది. ఈ సక్సెస్ సాధించిన టీమ్ ని భారత వై మానిక దళం(IAF) ప్రత్యేకంగా అభినందించింది.

సీపీఎం  నేతలపై వైసీపీ ప్రభుత్వ కేసులు కొట్టేసిన కోర్టు
Politics· 11 Jun 2026

సీపీఎం నేతలపై వైసీపీ ప్రభుత్వ కేసులు కొట్టేసిన కోర్టు

ధరల పెరుగుదల , పెట్రోల్ ,డీజిల్ రేట్ల పెంపుదలకు వ్యతిరేకంగా 2021,జూన్ 16న సీపీఎం నేతలపై పెట్టిన అక్రమ కేసులను కోర్టు కొట్టేసింది. అక్రమ కేసులు తొలగిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం మాట తప్పింది. విజయవాడ గవర్నర్ పేట దగ్గర వారు చేసిన శాంతియుత ఆందోళనను అప్పట్లో పోలీసులు అడ్డుకుని అక్రమ కేసులు బనాయించారు,ప్రజాసమస్యలపై పోరాడే తమపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమని, ప్రజలు, సామాన్యుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని సీపీఎం నేతలు సీ.హెచ్. బాబూరావు, కాశీనాథ్ తదితరులు చెప్పారు.

స్కూళ్లలో పీరియడ్స్ టైమ్‌లో ఇక నో ప్రాబ్లమ్స్!
Health· 11 Jun 2026

స్కూళ్లలో పీరియడ్స్ టైమ్‌లో ఇక నో ప్రాబ్లమ్స్!

మహిళల మెన్‌స్ట్రువల్ హెల్త్ (ఋతుక్రమ ఆరోగ్యం) ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ రూలింగ్ సరిగ్గా ఇంప్లిమెంట్ అయితే, స్కూల్స్ మధ్యలోనే మానేసే గర్ల్స్ కౌంట్ చాలా తగ్గుతుంది. ఇకపై ప్రతి స్కూల్లో గర్ల్స్ కోసం పక్కాగా టాయిలెట్స్, మెన్‌స్ట్రువల్ ప్రొడక్ట్స్ (ప్యాడ్స్) అరేంజ్ చేయడంతో పాటు అవేర్‌నెస్ సెషన్స్ పెట్టాలని కోర్టు స్పష్టం చేసింది.

పూణేలో అభిజీత్ దిప్కే, సోనమ్ వాంగ్చుక్ ఎంట్రీ!
Politics· 11 Jun 2026

పూణేలో అభిజీత్ దిప్కే, సోనమ్ వాంగ్చుక్ ఎంట్రీ!

ఎగ్జామ్స్ లీకేజీలపై కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పూణే యూనివర్సిటీలో ప్రొటెస్ట్ స్టార్ట్ చేసింది. ఈ నిరసనకు CJP ఫౌండర్ అభిజీత్ దిప్కేతో పాటు సోనమ్ వాంగ్చుక్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా ఎడ్యుకేషన్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మినిస్టర్ రిజైన్ చేసేవరకు ఈ మూవ్‌మెంట్ ఆపేది లేదని, నెక్స్ట్ లక్నో, బెంగళూరు, హైదరాబాద్ లలో కూడా ప్రొటెస్ట్స్ చేస్తామని CJP అఫీషియల్ పేజీలో అనౌన్స్ చేశారు.

దీదీ పై శతృఘ్న సిన్హా సెన్సేషనల్ స్టేట్ మెంట్ !
Politics· 11 Jun 2026

దీదీ పై శతృఘ్న సిన్హా సెన్సేషనల్ స్టేట్ మెంట్ !

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న స్పెక్యులేషన్స్ ని టీఎంసీ ఎంపీ, నటుడు శతృఘ్న సిన్హా తిప్పి కొట్టారు. తాను రెబల్స్ గ్రూపులో ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన మమతా బెనర్జీని తాను ఎప్పటికీ వీడనని, 'దీదీ'తోనే తన ప్రయాణమని స్పష్టం చేశారు. మోదీని కేవలం స్పోర్టివ్ స్పిరిట్ తోనే కంగ్రాట్యులేట్ చేశానని, దానికి ఎలాంటి పొలిటికల్ ఇంపార్టెన్స్ లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

AP నిరుద్యోగులకు గుడ్ న్యూస్!
Health· 11 Jun 2026

AP నిరుద్యోగులకు గుడ్ న్యూస్!

AP హెల్త్ డిపార్ట్‌మెంట్ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ బేసిస్‌లో 419 స్టాఫ్ నర్స్ పోస్టులతో పాటు, మరో 110 ఫార్మసిస్ట్, మల్టీ రిహాబిలిటేషన్ జాబ్స్ భర్తీ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు జూన్ 13 నుండి జూన్ 30 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వాళ్లకు గవర్నమెంట్ హాస్పిటల్స్, టౌన్ హెల్త్ సెంటర్లలో పోస్టింగ్స్ ఇస్తారు. మరిన్ని వివరాల కోసం అఫీషియల్ వెబ్‌సైట్ చెక్ చేసుకోండి.

బరి నుంచి  మీనాక్షీ  ఔట్- ఎంపీలో బీజేపి క్లీన్ స్వీప్
Politics· 11 Jun 2026

బరి నుంచి మీనాక్షీ ఔట్- ఎంపీలో బీజేపి క్లీన్ స్వీప్

మధ్యప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి మీనాక్షీ నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురికావడంతో.. ఎలాంటి పోటీ లేకుండానే బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. బీజేపీ అభ్యర్థులు రజనీష్ అగర్వాల్, తరుణ్ చుగ్, మహేష్ కేవత్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ధృవీకరించింది. నామినేషన్‌ తిరస్కరణపై కాంగ్రెస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, విచారణ వాయిదా పడటంతో బీజేపీ విజయం ఖాయమైంది. దీంతో హోరాహోరీగా సాగుతుందనుకున్న పోరు కాస్తా.. ఏకపక్ష ముగింపుగా మారింది.

స్టీల్ ప్లాంట్ లో ఆ పార్ట్ అంత వీక్ గా ఉందా?
AP· 11 Jun 2026

స్టీల్ ప్లాంట్ లో ఆ పార్ట్ అంత వీక్ గా ఉందా?

విశాఖ స్టీల్ ప్లాంట్లో యాక్సిడెంట్ కి కారణం ల్యాడాల్ అనే ఒక పరికరం.. ల్యాడాల్ అంటే ద్రవ ఉక్కును తరలించడానికి వాడే ఒక ఇనుప పాత్ర లాంటిది. ఇది రెండు లేయర్స్ గా ఉంటుంది. బయటి పొర మొత్తం కంప్లీట్ ఉక్కుతో చేస్తే లోపలి రెండో పొర రిఫ్రాక్టరీ ఇటుకలతో తయారు చేస్తారు. ఇవి కొన్ని కెమికల్స్ తో తయారవుతాయి. ఇవి కొంత కాలం తర్వాత అరిగిపోతాయి. వాటికి మళ్లీ కొత్త లైనింగ్ వేయాల్సి ఉంటుంది. ఈ పాడైపోయిన వాటినే ఇంకా స్ట్రీల్ ప్లాంట్ వాడటం ప్రమాదానికి కారణం. బెయిలవుట్ ని ఎంప్లాయీస్ ని బలవంతంగా పంపేయడానికి వాడుతూ ఎక్విప్ మెంట్ పై శ్రద్ధ పెట్టకపోడమే అసలు రీజన్..

రీయంబర్స్‌మెంట్ రాలేదని సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాల
Education· 11 Jun 2026

రీయంబర్స్‌మెంట్ రాలేదని సర్టిఫికెట్లు ఇవ్వని కళాశాల

TG: నాగర్‌కర్నూలు జిల్లా పదర మండలం ఊడిమిళ్ల విలేజ్‌కు చెందిన పాపమ్మ, బయన్న దంపతులు తన కుమార్తె ఎస్తేరమ్మ ఉన్నత విద్యను అభ్యసించేందుకు తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడ్డారు. ఐటీడీఏ నుంచి రూ.50వేల ఆర్థిక సహాయం అందడంతో మిర్యాలగూడలోని మీనా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ (సీఎస్ఈ) పూర్తిచేసింది. తదుపరి విద్యను కొనసాగించేందుకు ఒరిజినల్ సర్టిఫికెట్లు అవసరమవడంతో కళాశాల యాజమాన్యాన్ని సంప్రదించారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయంబర్స్‌మెంట్ రాలేదని, అది వచ్చిన తర్వాతే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పినట్లు ఎస్తేరమ్మ తెలిపింది.

సుప్రీంకోర్టు: ఇంట్లో ఉండే మహిళలు ‘నేషన్ బిల్డర్స్’!
Legal· 11 Jun 2026

సుప్రీంకోర్టు: ఇంట్లో ఉండే మహిళలు ‘నేషన్ బిల్డర్స్’!

ఇంట్లో ఉండే మహిళలు (హోమ్‌మేకర్స్) దేశాన్ని నిర్మించే ‘నేషన్ బిల్డర్స్’ అని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పొద్దున నుంచి రాత్రి దాకా హోమ్‌మేకర్స్ చేసే ఉచిత సేవలకు ఎంతో విలువ ఉందని కోర్టు పేర్కొంది. రోడ్డు ప్రమాదాల్లో వారు చనిపోతే.. వారి కుటుంబానికి ఇచ్చే నష్టపరిహారం కోసం వారి శ్రమ విలువను కనీసం నెలకు రూ.30,000గా లెక్కించాలని స్పష్టం చేసింది. వారి కష్టాన్ని తక్కువ చేసి చూడకూడదని చెప్తూ. ఇలాంటి కేసులను ఏడాదిలోపే తేల్చాలని కోర్టు ఆదేశించింది.

బైండోవర్ ఉల్లంఘించడంతో జైలుశిక్ష
Crime· 11 Jun 2026

బైండోవర్ ఉల్లంఘించడంతో జైలుశిక్ష

TG: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దూరాజిపల్లి గ్రామంలోని తెళ్లబండ కాలనీకి చెందిన రాపాణి శ్రీనుపై ఓ గొడవ కేసులో చివ్వెంల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సత్ప్రవర్తనతో మెలుగుతానని మండల మేజిస్ట్రేట్ వద్ద రూ.3లక్షల పూచీకత్తుతో బైండోవర్ చేసుకున్నాడు. అయితే శ్రీను బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి తిరిగి నేరానికి పాల్పడ్డాడు. ఈ మేరకు చివ్వెంల పోలీసులు మరో కేసు నమోదు చేసి అతడిని మండల న్యాయవాది ముందు హాజరుపరిచారు. పూచీకత్తు మొత్తం రూ.3లక్షల జరిమానా విధించగా, చెల్లించలేకపోవడంతో తహశీల్దార్ ఉత్తర్వుల మేరకు 45రోజులు జైలుకు తరలించారు.

ఆస్తి నాది.. కాపురం CM బాబుది!
Politics· 11 Jun 2026

ఆస్తి నాది.. కాపురం CM బాబుది!

CM చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ఇల్లు తనదేనని జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేశ్ ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. ప్రభుత్వం ఆ ఇంటిని లీజ్ (రెంట్) అగ్రిమెంట్ ద్వారా తీసుకున్నట్లు పేర్కొన్నారు. అఫిడవిట్ ప్రకారం లింగమనేని, ఆయన భార్య పేరిట మొత్తం రూ.213 కోట్ల ఆస్తులు ఉన్నాయి. బాబు ఉంటున్న ఇల్లు తనదేనంటూ ఆయన చూపించిన ఆధారాలు ఇప్పుడు AP రాజకీయాల్లో, సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

పోస్టాఫీసులు ఇక 'హ్యాంగౌట్ హబ్స్'!
India· 11 Jun 2026

పోస్టాఫీసులు ఇక 'హ్యాంగౌట్ హబ్స్'!

ఇండియా పోస్ట్ (India Post) రూపురేఖలు మారిపోతున్నాయి. కేవలం ఉత్తరాలు, కొరియర్లు, లాజిస్టిక్స్ సర్వీసులకే లిమిట్ కాకుండా .. ఆధునిక కాలానికి అనుగుణంగా సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తోంది. యువతను ఆకట్టుకునేలా పోస్టాఫీసులను 'Hangout Hubs' (హ్యాంగౌట్ హబ్స్) గా మార్చడమే టార్గెట్ గా సరికొత్త అడుగులు వేస్తోంది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, నేటి తరం అవసరాలకు తగ్గట్టుగా సేవలందిస్తూ తనకంటూ ఒక సరికొత్త 'స్టాంప్' వేసేందుకు ఇండియా పోస్ట్ సిద్ధమైంది.

ఫ్యూచర్‌సిటీలో 37 గ్రామాలు విలీనం
TG· 11 Jun 2026

ఫ్యూచర్‌సిటీలో 37 గ్రామాలు విలీనం

TG: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (FCDA) భవనాన్ని CM రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఫ్యూచర్‌సిటీలో తమ గ్రామాలను కలపాలంటూ పలువురు ప్లకార్డులు ప్రదర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించారు. ప్రజలు రిక్వెస్ట్ చేస్తూ తీసుకొచ్చిన పత్రాలపై సంతకం చేసి 37 గ్రామాలను ఫ్యూచర్‌సిటీలో కలపాలని అధికారులను ఆదేశించారు. మహేశ్వరం మండలంలో 28 గ్రామాలు, కందుకూరులోని 9 గ్రామాలు కలిపి 37 గ్రామాలు ఫ్యూచర్‌సిటీలో భాగం కానున్నాయి.