← Back to news

'మా ఆయన బతికే ఉంటారని అనుకున్నా'

By DK· 12 Jun 2026· Eenadu· విశాఖపట్నం జిల్లా
'మా ఆయన బతికే ఉంటారని అనుకున్నా'

AP: ఒమన్ తీరంలో నౌకపై జరిగిన దాడిలో మృతి చెందిన మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేశ్ భార్య భార్గవి కన్నీరుమున్నీరయ్యారు. మా ఆయన గల్లంతైన సమాచారం అందినప్పటికీ ఆయన బతికే ఉంటారని భరోసాతో ఉన్నానన్నారు. దాడి జరిగినప్పుడు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకొని ఉంటారని అనుకున్నా కానీ ఆ తర్వాత కొన్ని గంటల్లోనే మరణ వార్త వినాల్సి వచ్చిందని భార్గవి తెలిపారు. విశాఖపట్నం శ్రీహరిపురంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన సురే‌శ్‌కు భార్య భార్గవితో పాటు ఇద్దరు కుమారులున్నారు.

More in World