పోస్టాఫీసులు ఇక 'హ్యాంగౌట్ హబ్స్'!

ఇండియా పోస్ట్ (India Post) రూపురేఖలు మారిపోతున్నాయి. కేవలం ఉత్తరాలు, కొరియర్లు, లాజిస్టిక్స్ సర్వీసులకే లిమిట్ కాకుండా .. ఆధునిక కాలానికి అనుగుణంగా సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తోంది. యువతను ఆకట్టుకునేలా పోస్టాఫీసులను 'Hangout Hubs' (హ్యాంగౌట్ హబ్స్) గా మార్చడమే టార్గెట్ గా సరికొత్త అడుగులు వేస్తోంది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, నేటి తరం అవసరాలకు తగ్గట్టుగా సేవలందిస్తూ తనకంటూ ఒక సరికొత్త 'స్టాంప్' వేసేందుకు ఇండియా పోస్ట్ సిద్ధమైంది.


