Latest

ఫ్యూచర్‌సిటీలో 37 గ్రామాలు విలీనం
TG· 11 Jun 2026

ఫ్యూచర్‌సిటీలో 37 గ్రామాలు విలీనం

TG: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (FCDA) భవనాన్ని CM రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఫ్యూచర్‌సిటీలో తమ గ్రామాలను కలపాలంటూ పలువురు ప్లకార్డులు ప్రదర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించారు. ప్రజలు రిక్వెస్ట్ చేస్తూ తీసుకొచ్చిన పత్రాలపై సంతకం చేసి 37 గ్రామాలను ఫ్యూచర్‌సిటీలో కలపాలని అధికారులను ఆదేశించారు. మహేశ్వరం మండలంలో 28 గ్రామాలు, కందుకూరులోని 9 గ్రామాలు కలిపి 37 గ్రామాలు ఫ్యూచర్‌సిటీలో భాగం కానున్నాయి.

ఇల్లాళ్లే 'దేశ నిర్మాతలు': సుప్రీంకోర్టు  సెన్సేషనల్  కామెంట్‌ !
News· 11 Jun 2026

ఇల్లాళ్లే 'దేశ నిర్మాతలు': సుప్రీంకోర్టు సెన్సేషనల్ కామెంట్‌ !

గృహిణుల శ్రమపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అద్భుతమైన వ్యాఖ్యలు చేసింది. కుటుంబంలో, సమాజంలో మహిళలు రోల్ అమూల్యమైనదని, వెలకట్టలేనిదని పేర్కొంది. ఇల్లాళ్లని కేవలం హోం మేకర్స్ అని కాకుండా 'Nation Builders' (దేశ నిర్మాతలు) గా గుర్తించాలని, వారి నెలవారీ పని విలువ కనీసం రూ. 30,000 తో సమానమని స్పష్టం చేసింది. మహిళల ఆర్థిక, సామాజిక గౌరవాన్ని పెంచేలా ఈకామెంట్స్ నిలిచాయి.

ఇండియాలోకి ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయా?
Technology· 11 Jun 2026

ఇండియాలోకి ప్లాస్టిక్ నోట్లు రాబోతున్నాయా?

భారత్‌లో కాగితపు నోట్లకు బదులుగా ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను ప్రవేశపెట్టడంపై రిజర్వ్ బ్యాంక్ (RBI) మళ్లీ కసరత్తు చేస్తోంది. పేపర్ నోట్ల ప్రింటింగ్ కోసం ఏటా సుమారు రూ.5,000 నుండి 6,000 కోట్లు ఖర్చవుతుండడం, అవి త్వరగా పాడైపోతుండడంతో ఈ ప్లాన్ రెడీ చేశారు. ఈ ప్లాస్టిక్ నోట్ల వల్ల నకిలీ నోట్ల బెడద తగ్గడమే కాకుండా, ఏటీఎంలలో వచ్చే సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చని ఆర్బీఐ భావిస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

హుండీ డబ్బుపై పూజారులకు హక్కు లేదు!
Politics· 11 Jun 2026

హుండీ డబ్బుపై పూజారులకు హక్కు లేదు!

దేవాలయాల్లోని హుండీ ఆదాయంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భక్తులు భక్తితో హుండీలో వేసే డబ్బుపై పూజారులకు ఎలాంటి హక్కు లేదని, ఆ సొమ్ము అంతా ఆలయానికే చెందుతుందని స్పష్టం చేసింది. మతం అనేది సంపద పెంచుకోవడానికి ముసుగు కాకూడదని కోర్టు పేర్కొంది. పూజారులు కేవలం పూజలు చేయడానికేనని, ఆలయ ఆదాయంలో వాటా అడగలేరని తేల్చి చెప్పింది. శ్రీరంగం రంగనాథస్వామి టెంపుల్ వివాదంపై కోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది.

అది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపితమే: మహేష్ గౌడ్
Politics· 11 Jun 2026

అది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపితమే: మహేష్ గౌడ్

TG: మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను ఏకపక్షంగా తిరస్కరించడంపై TPCC అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ స్పందించారు. బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఫైరయ్యారు. మధ్యప్రదేశ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి తన పరిధికి మించి వ్యవహరించారని విమర్శించారు. ఓ ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును, నోటీసులను సాకుగా చూపి నామినేషన్‌ను రిజెక్ట్ చేయడం రాజకీయ ప్రేరేపితమేనని ఆరోపించారు.

హౌసింగ్ సొసైటీలకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్!
Legal· 11 Jun 2026

హౌసింగ్ సొసైటీలకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్!

అపార్ట్‌మెంట్ హౌసింగ్ సొసైటీలు, క్లబ్‌లు తమ మెంబర్స్ నుండి వసూలు చేసే మెయింటెనెన్స్ చార్జీలపై ఎలాంటి GST కట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సొసైటీ అంటేనే మెంబర్స్ అందరూ కలిసి ఉంటరు కాబట్టి, మన సొంత డబ్బుపై మనమే ట్యాక్స్ కట్టడం ఏంటని కోర్టు స్పష్టం చేసింది. గతంలో కట్టిన GSTని కూడా వెనక్కి తీసుకోవచ్చు. కానీ, బయటి వ్యక్తులకు ఏవైనా సర్వీసెస్ ఇస్తే మాత్రం GST కట్టాల్సిందే.

OU పరీక్షల మూల్యాంకనంపై విద్యార్థులు ఫైర్
Education· 11 Jun 2026

OU పరీక్షల మూల్యాంకనంపై విద్యార్థులు ఫైర్

TG: : ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల మూల్యాంకనంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన LLB సెమిస్టర్ ఫలితాల్లో పెద్దసంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ కావడం, అనంతరం రీవాల్యుయేషన్‌లో వారిలో ఎక్కువమంది పాస్ కావడంతో పేపర్ ఎవల్యూషన్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల సమాచారం ప్రకారం LLB సెమిస్టర్ పరీక్షల్లో సుమారు 1,500 మంది ఫెయిలయ్యారు. వీరిలో గత సెమిస్టర్లలో మంచి మార్కులు సాధించిన వారు కూడా ఉండటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదట ఫెయిలైనవారికి రీవాల్యుయేషన్ అనంతరం ఫస్ట్ గ్రేడ్ మార్కులు వచ్చాయి.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షాక్.. అసలు ఇతను ఏం మాట్లాడాడు?▶
Politics· 11 Jun 2026

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షాక్.. అసలు ఇతను ఏం మాట్లాడాడు?

డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ రాజకీయాలపై సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ మాటల్లోని నిలకడ లేకపోవడం గురించి ఈ వీడియోలో ఒక అతను క్లియర్ గా మాట్లాడాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ. అభిమానులు ఆవేశపడకుండా, ఓపికగా తమ నాయకుడి మాటల్లోని మార్పులను గమనించాలని కోరుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్‌కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియా ఫుల్ ట్రెండ్ అవుతోంది. Credits: Figuring Out by Jay youtube channel

మీ లైఫ్ స్టైలే మీ  బాడీని షేప్ చేస్తుందా?
Politics· 11 Jun 2026

మీ లైఫ్ స్టైలే మీ బాడీని షేప్ చేస్తుందా?

ఊబకాయం పెరగడానికి డిఎన్ఏని బ్లేమ్ చేయడం తగదు అంటున్నాయి మెడికల్ రిసెర్చ్ రిపోర్టులు. టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బులు వంటి వాటికి జీన్స్ ఒక కారణం కావొచ్చు, కానీ అవే పూర్తిగా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అని కూడా చెప్పలేం. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ, యాక్టివ్ లైఫ్‌స్టైల్ పాటిస్తే మీ జెనెటిక్ ప్రొఫైల్ ఎలాంటిదైనా సరే, ఊబకాయాన్ని సులభంగా కంట్రోల్ చేయవచ్చంటున్నాయి రిసెర్చ్ లు.. కాబట్టి మీ బద్ధకానికి ఫుల్ స్టాప్ పెట్టేసి.. హుషారుగా మారిపోండి.అద్భుతమైన బాడీ షేప్ మీ సొంతం.

పార్టీ మీటింగ్ లో కుర్చీలతో కొట్టుకున్న TDP కార్యకర్తలు!▶
Politics· 11 Jun 2026

పార్టీ మీటింగ్ లో కుర్చీలతో కొట్టుకున్న TDP కార్యకర్తలు!

అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో TDP కార్యకర్తలు కుర్చీలతో కొట్టుకున్నారు. మండల TDP ప్రెసిడెంట్ ప్రత్తిపాటి ఉమామహేశ్వరి మిగతా లీడర్లకు, కార్యకర్తలకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సీక్రెట్‌గా ఒక మీటింగ్ పెట్టారు. దీనిపై స్థానిక లీడర్స్ ఆమెను ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది. మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటూ దాడులు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

జీన్స్ కి ఒబేసిటీకి సంబంధం ఉందా?
Health· 11 Jun 2026

జీన్స్ కి ఒబేసిటీకి సంబంధం ఉందా?

జీన్స్ (Genetic makeup) వల్లనే లావవుతున్నామనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని తాజా రిసెర్చ్ లు చెబుతున్నాయి. ఊబకాయానికి ప్రత్యేకంగా ఎలాంటి Obesity Gene బాధ్యత వహించదు. వంశపారంపర్యంగా వచ్చే జన్యువులు మీ బరువును శాశ్వతంగా నిర్ణయించలేవు. సరైన ఆహారపు అలవాట్లు, యాక్టివ్ లైఫ్ స్టైల్, శారీరక శ్రమ ద్వారా మీ జన్యుపరమైన మార్పులను సైతం అధిగమించి బరువును ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. మీ ఫిట్‌నెస్ మీ చేతుల్లోనే ఉందనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం.

YS జగన్: మేమూ కాక్రోచెస్‌మే!▶
Politics· 11 Jun 2026

YS జగన్: మేమూ కాక్రోచెస్‌మే!

YCP అధినేత YS జగన్ ప్రెస్‌మీట్‌లో CM చంద్రబాబుని టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. “గుర్తుపెట్టుకో చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్‌లో మేమూ కాక్రోచెస్‌మే! మమ్మల్ని ఇబ్బంది పెడితే కాక్రోచెస్ లేస్తాయి జాగ్రత్త” అంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఇది Gen Z టైమ్ అని, ఆల్ఫా జనరేషన్ కూడా వచ్చేసిందని చెప్పారు. జగన్ గారు చేసిన ఈ 'కాక్రోచ్' కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్ DEO ఆఫీస్‌ ముట్టడి.. ఉద్రిక్తత
Education· 11 Jun 2026

హైదరాబాద్ DEO ఆఫీస్‌ ముట్టడి.. ఉద్రిక్తత

TG: పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ABVP ఆధ్వర్యంలో హైదరాబాద్ DEO ఆఫీస్‌ను ముట్టడించారు. ర్యాలీగా వచ్చిన ఏబీవీపీ నాయకులు అబిడ్స్‌లోని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముందు బైఠాయించారు. అధికారులు స్పదించకపోవడంతో ఆఫీస్‌ లోపలికి వెళ్లేందుకు యత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకుంది. ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలని, గవర్నమెంట్ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఖాళీ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ రాజాలిద్దరిదీ అపూర్వ సహోదర బంధం !
Cinema· 11 Jun 2026

ఈ రాజాలిద్దరిదీ అపూర్వ సహోదర బంధం !

భారతీ రాజా, ఇళయ రాజాలది అపూర్వ స్నేహ బంధం.. అది చాలా ఆత్మీయ బంధం.. ఒకరిలో ఒకరు మమేకమైపోయే బంధం. ఇళయరాజా మద్రాస్ వచ్చిన కొత్తలో రూమ్ లేక ఇబ్బంది పడుతుంటే భారతీ రాజా ఏకంగా ఒక ఔట్ హౌస్ అద్దెకు తీసుకుని అందులో ఇళయ రాజాను ఉంచాడు. ఇళయ రాజా మ్యూజికల్ అక్విప్ మెంట్ ను జాగ్రత్త చేసుకోడానికి తన సొంత రూమ్ లో కొంత ప్లేస్ ఇచ్చాడు. అంతేకాదు ఇద్దరూ ఒకే ప్లేట్ లో తిన్నారు ఒకే మంచంలో పడుకున్నారు కూడా. వారి మధ్య కేవలం ప్రొఫెషనల్ రిలేషనే కాదు.. అంతకుమించిన అనుబంధం ఉంది. మొదట్లో తిండి కష్టాల నుంచి సినిమా కష్టాల వరకూ చాలానే ఉన్నాయ్ ఇద్దరి మధ్యా!

కంటెంట్ క్రియేటర్ అవ్వాలా? ఈ స్కిల్స్ నేర్చుకోండి!
Technology· 11 Jun 2026

కంటెంట్ క్రియేటర్ అవ్వాలా? ఈ స్కిల్స్ నేర్చుకోండి!

ప్రస్తుతం డిజిటల్ యుగంలో కంటెంట్ క్రియేషన్ అనేది ఒక ప్రొఫెషనల్ కెరీర్ ఆప్షన్. ఇందులో సక్సెస్ అవ్వాలంటే కేవలం ఐడియాస్ ఉంటే సరిపోదు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు వీడియో ఎడిటింగ్, ఫొటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైనింగ్ లాంటి టెక్నికల్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దీనికోసం డిజిటల్ మార్కెటింగ్ లేదా కంటెంట్ రైటింగ్ లాంటి కోర్సెస్ బాగా యూజ్ అవుతాయి. సొంతంగా యూట్యూబ్ ఛానల్ లేదా ఇన్‌స్టా పేజ్ స్టార్ట్ చేసి, రెగ్యులర్‌గా కంటెంట్ పోస్ట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. Note: ఇందులోని సమాచారం అవగాహన కోసం మాత్రమే.

వెయిట్ లాస్  మందులతో ఫుడ్ బిల్స్‌కు బ్రేక్!
Health· 11 Jun 2026

వెయిట్ లాస్ మందులతో ఫుడ్ బిల్స్‌కు బ్రేక్!

యూత్‌లో ఇప్పుడు Weight-Loss Drugs వాడకం తెగ పెరిగిపోతోంది. బ్రిటన్‌లో ఈ మందుల ఎఫెక్ట్‌తో జనాలు జంక్ ఫుడ్, స్నాక్స్ తినడం బాగా తగ్గించేశారు. దీనివల్ల అక్కడ ఏకంగా $1 Billion (సుమారు 8,300 కోట్ల రూపాయలు) విలువైన ఫుడ్ బిల్స్ మిగిలాయని ఓ సర్వేలో తేలింది. ఫిట్‌నెస్ క్రేజ్‌తో ఫుడ్ ఇండస్ట్రీ మార్కెట్ కూడా మారిపోతుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది!

20 ఏళ్లుగా ఫీవరే రాలేదు: బండి సంజయ్▶
TG· 11 Jun 2026

20 ఏళ్లుగా ఫీవరే రాలేదు: బండి సంజయ్

కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రోగ్రామ్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. PM మోదీ గారిని ఇన్స్పిరేషన్‌గా తీసుకుని తాను లాస్ట్ 20 ఇయర్స్ నుండి అసలు ఫీవర్ లేకుండా హెల్తీగా ఉన్నానని చెప్పారు. కానీ, మొన్న హైదరాబాద్‌లో మిల్క్ తాగిన తర్వాత తనకు ఫీవర్ వచ్చి, మూడు రోజులు బెడ్ మీద ఉండిపోవాల్సి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న కల్తీ పాల గురించే ఆయన ఈ కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

అనుమానం తో స్తంభానికి కట్టేసి గుండు కొట్టించారు!
Crime· 11 Jun 2026

అనుమానం తో స్తంభానికి కట్టేసి గుండు కొట్టించారు!

పంజాబ్‌లోని లుధియానాలో ఒక వ్యక్తి దొంగతనం చేశాడనే అనుమానంతో జనాలు అతనిపై దారుణంగా అటాక్ చేశారు. కాళ్లు, చేతులు కట్టేసి, గుండు కొట్టించి, కనుబొమ్మలు కూడా తీసేశారు. అంతటితో ఆగకుండా ‘నేను దొంగను’ అని రాసి ఉన్న బోర్డును అతని చేతిలో పెట్టి వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో, వాళ్లు జూన్ 10న కేసు ఫైల్ చేశారు, దాడి చేసిన వాళ్లను పట్టుకునేందుకు పోలీసులు ట్రై చేస్తున్నారు.

నందుర్బార్ మహిళల నీటి కష్టం తీరింది!
India· 11 Jun 2026

నందుర్బార్ మహిళల నీటి కష్టం తీరింది!

మహారాష్ట్రలోని నందుర్బార్ గిరిజన ప్రాంత మహిళల దశాబ్దాల నీటి కష్టాలపై 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' కథనానికి అధికారులు స్పందించారు. సుదూర ప్రాంతాల నుండి తలపై భారీ బరువుతో నీళ్లు మోయడం వల్ల అక్కడి మహిళలు తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడ్డారు. ఈ వార్తతో కదిలిన యంత్రాంగం వెంటనే గ్రామాలకు వాటర్ ట్యాంకర్లను పంపింది. 'ఇన్నాళ్లకు మా ఊరికి ట్యాంకర్ రావడం కలలా ఉందంటూ' స్థానిక మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

'మిర్జాపూర్ ది మూవీ' అనౌన్స్‌మెంట్!
Cinema· 11 Jun 2026

'మిర్జాపూర్ ది మూవీ' అనౌన్స్‌మెంట్!

పాపులర్ వెబ్ సిరీస్ 'మిర్జాపూర్' ఇప్పుడు వెండితెరపై రూపంలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ వంటి స్టార్ కాస్టింగ్ యాక్ట్ చేస్తున్నారు. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం మేకర్స్ ఈ యాక్షన్ డ్రామాను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ మల్టీస్టారర్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా పెరిగాయి.

AP లిక్కర్ స్కామ్.. మాజీ మంత్రి అరెస్ట్!
AP· 11 Jun 2026

AP లిక్కర్ స్కామ్.. మాజీ మంత్రి అరెస్ట్!

AP లిక్కర్ స్కామ్ కేసులో ED అధికారులు స్పీడ్ పెంచారు. ఈ స్కామ్‌లో మాజీ మంత్రి, YCP లీడర్ కారుమూరి నాగేశ్వరరావును హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఆయన ఇంట్లో ED అరెస్ట్ చేసింది. ఈరోజు మార్నింగ్ సిటీలో పది చోట్ల ఒకేసారి ED రైడ్స్ జరిగాయి. ఈ కేసులో మెయిన్ నిందితుడు రాజ్ కసిరెడ్డిని కూడా అరెస్ట్ చేసి ED ఆఫీస్‌కి తీసుకెళ్లారు. ఈ లిక్కర్ స్కామ్ విచారణ ఇప్పుడు AP, తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.