Latest

ఓబీసీ కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా? సుప్రీం ఘాటు కామెంట్లు
రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యా, ఆర్థికాభివృద్ధి సాధించిన వెనుకబడిన తరగతుల (OBC) కుటుంబాల పిల్లలకు రిజర్వేషన్లు కొనసాగించాలా అని ప్రశ్నించింది. ఐఏఎస్ అధికారుల పిల్లలకు మళ్లీ రిజర్వేషన్లు ఎందుకని, దీనివల్ల సామాజిక మార్పు రాదని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. కర్ణాటకలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల సంతానమైన ఒక అభ్యర్థిని 'క్రీమీలేయర్' కింద రిజర్వేషన్లకు అనర్హుడిగా ప్రకటించడాన్ని కోర్టు సమర్థించింది.ఒకే కుటుంబం తరతరాలుగా రిజర్వేషన్లు వాడుకుంటే, వెనుకబడిన వర్గాల్లోని నిజమైన పేదలకు ఎప్పటికీ న్యాయం జరగదని కోర్టు అభిప్రాయపడింది.

ఆయిల్ సప్లై బంద్.. గ్లోబల్ మార్కెట్‌కి 'రెడ్ జోన్' వార్నింగ్!
అమెరికా-ఇరాన్ యుద్ధం వల్ల గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ సప్లై దారుణంగా దెబ్బతింది. మెయిన్ రూట్ అయిన హోర్ముజ్ జలసంధి క్లోస్ అవ్వడంతో.. డైలీ 13 నుండి 14 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ సప్లై ఆగిపోయిందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) చీఫ్ ఫాతిహ్ బిరోల్ చెప్పారు. ఎమర్జెన్సీ ఆయిల్ నిల్వలు కూడా పూర్తిగా అయిపోవడంతో ఆయిల్ మార్కెట్ త్వరలోనే డేంజరస్ 'రెడ్ జోన్' లోకి వెళ్తుందని, దీనివల్ల రేట్లు విపరీతంగా పెరిగి గ్లోబల్ ఎకానమీ క్రైసిస్‌లో పడుతుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

ఎలన్ మస్క్ వెనక వెయిట్రెస్ చైనా నిఘా వర్గమా?
బీజింగ్‌లో జరిగిన అధికారిక విందులో ఎలన్ మస్క్ వెనుక నిలబడిన సర్వర్ (వెయిట్రెస్), చైనా మిలిటరీకి చెందిన ఒక ఉన్నతాధికారి అని స్వతంత్ర బ్లాగర్ జెన్నిఫర్ జెంగ్ ఆరోపించారు. అమెరికా ప్రతినిధి బృందంపై నిఘా ఉంచేందుకు చైనా ఈ వ్యూహం పన్నిందని ఆమె పేర్కొన్నారు. గతంలో కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక కూడా చైనా ప్రమేయం ఉందంటూ జెంగ్ వివాదాస్పద ఆరోపణలు చేశారు.
అమ్మాయిని వెనక నుండి సీక్రెట్‌గా ఫోటోలు తీస్తూ దొరికాడు!
ఒక రైల్వే స్టేషన్‌లో shocking ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి నిల్చొని ఉండగా.. వెనక నుండి ఆమెకు తెలియకుండా ఒక ఓల్డ్ పర్సన్ మొబైల్‌లో తప్పుగా ఫోటోలు తీస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఆ విషయం కనిపెట్టిన ఆ అమ్మాయి.. వెంటనే అతడిని గట్టిగా నిలదీసి అందరి ముందు కొట్టింది. స్పాట్‌లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ కూడా అక్కడికి వచ్చి, ఆ ఓల్డ్ పర్సన్ చేసిన పనికి అందరి ముందే కొట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ అతని ఏజ్ ఏంటి అతను చేసే పని ఏంటి అంటూ సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు.
మున్సిపల్ ఆఫీస్ లో ప్రొటెస్ట్ చేసిన బొద్దింక!
సోషల్ మీడియాలో ఒక హిలేరియస్ వీడియో వైరల్ అవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్‌కి ఒక పర్సన్ Cockroach గెటప్ తో వచ్చి అందరినీ షాక్ చేశాడు. అక్కడ యమునా నదిలోకి డర్టీ డ్రైనేజీ వాటర్ కలవడంపై. ఆ పర్సన్ ఇలా వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాడు. ఆఫీస్‌లో అతను బొద్దింక గెటప్ లో తిరుగుతుంటే అక్కడున్న వాళ్లంతా చూసి నవ్వుకుంటూ స్టన్ అయిపోయారు. ప్రెసెంట్ ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

BJP, congress లను దాటేసిన 'కాక్‌రోచ్ పార్టీ'!
సోషల్ మీడియాలో ఒక మైండ్ బ్లోయింగ్ రికార్డ్ క్రియేట్ అయింది. నిరుద్యోగులపై సుప్రీం కోర్ట్ సీజేఐ (CJI) చేసిన కామెంట్స్‌కి కౌంటర్‌గా అభిజిత్ అనే వ్యక్తి స్టార్ట్ చేసిన satirical పేజ్ 'కాక్‌రోచ్ జనతా పార్టీ' (CJParty) ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు క్రియేట్ చేసింది. జస్ట్ 4 డేస్ లోనే ఈ పేజ్ 20M కి పైగా ఫాలోవర్స్‌ని సంపాదించింది. ప్రెసెంట్ BJP బిజెపికి 8.7M, కాంగ్రెస్‌కి 13.3M ఫాలోవర్స్ ఉంటే.. ఈ పేజ్ ఆ పార్టీస్ ని దాటేసి టాప్‌లోకి వెళ్ళింది.
బ్లడ్ తో ఉన్న బ్యూటీ క్వీన్ వీడియో వైరల్!
ఫ్రాన్స్‌లో జరిగిన కేన్స్ ఫెస్టివల్ లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. లాస్ట్ ఇయర్ మిస్ వెనెజువెలా టైటిల్ గెలిచిన ఆండ్రియా అనే మోడల్‌పై.. ఆమె పర్సనల్ స్టైలిస్ట్ లగూనా ఒక హోటల్ రూమ్‌లో దారుణంగా అటాక్ చేశాడు. ఫేస్ మొత్తం బ్లడ్ తో ఉన్న ఆండ్రియా వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆ రూమ్‌లో సౌండ్స్ విన్న హోటల్ స్టాఫ్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో.. వాళ్లు వచ్చి ఆ స్టైలిస్ట్‌ను పట్టుకున్నారు. ప్రెసెంట్ ఆండ్రియా ప్రాణాలకేం ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు.
ఢిల్లీలో బిగ్ రూల్! బక్రీద్‌కి ఆవులు, ఒంటెల బలిపై కంప్లీట్ బ్యాన్!
బక్రీద్ పండగ ముందు ఢిల్లీ గవర్నమెంట్ ఒక బిగ్ డెసిషన్ తీసుకుంది. బక్రీద్ రోజు ఆవులు, దూడలు, ఒంటెలు అలాగే చట్టప్రకారం బ్యాన్ చేసిన ఏ ఆనిమల్ ని అయినా సరే బలి ఇవ్వకూడదని ఢిల్లీ మినిస్టర్ కపిల్ మిశ్రా సీరియస్ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ రూల్స్ బ్రేక్ చేసి ఎవరైనా ఆనిమల్స్ ని బలి ఇస్తే. వాళ్లపై సీరియస్‌గా కేసులు పెడతామని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ డెసిషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్ డిబేట్‌కి దారితీస్తోంది.

PCC ప్రెసిడెంట్‌పై 'బిగ్ టీవీ' అటాక్! వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక ఇంట్రెస్టింగ్ వార్ నడుస్తోంది. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌ను టార్గెట్ చేస్తూ 'బిగ్ టీవీ' వరుసగా నెగెటివ్ స్టోరీలు వేయడం హాట్ టాపిక్‌గా మారింది. గాంధీ భవన్‌ని పట్టించుకోవట్లేదని, అక్కడ కుక్కలు తిరుగుతున్నాయని, కానీ మహేష్ గౌడ్ ఇల్లు మాత్రం లగ్జరీగా ఉందంటూ రిపోర్ట్స్ ఇచ్చారు. అయితే దీని వెనుక CM రేవంత్ రెడ్డి హ్యాండ్ ఉందా అని పార్టీలో డౌట్స్ వస్తున్నాయి.
అర్ధరాత్రి హాస్టల్‌లో అమ్మాయిలపై అటాక్!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక గర్ల్స్ హాస్టల్‌లో ఉండే ఇద్దరు అమ్మాయిలను శుభమ్ అనే పర్సన్ టార్చర్ పెట్టడంతో. వాళ్లు పోలీసులకు కంప్లైంట్ చేసి అరెస్ట్ చేయించారు. దాంతో కక్ష పెంచుకున్న శుభమ్.. మే 17న బెయిల్‌పై బయటకు వచ్చాడు. అదే రోజు నైట్ ఫుల్‌గా ఆల్కహాల్ తాగి, ఆ అమ్మాయిల హాస్టల్ రూమ్‌లోకి వెళ్ళి దారుణంగా కొట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కి వచ్చి అతడిని మళ్లీ అరెస్ట్ చేశారు.

లోన్ రికవరీ ఏజెంట్ల టార్చర్‌కి RBI చెక్!
రికవరీ ఏజెంట్ల వేధింపులకు ఎండ్ కార్డ్ వేస్తూ RBI కొన్ని రూల్స్ తెచ్చింది. ఇకపై సర్టిఫైడ్ ఏజెంట్లు మాత్రమే రికవరీకి రావాలి. అది కూడా మార్నింగ్ 8 నుండి ఈవెనింగ్ 7 లోపే కాల్స్ లేదా విజిట్స్ చేయాలి. కస్టమర్ ఇంటికెళ్లే వన్ డే ముందే ఇన్ఫార్మ్ చేయాలి. ఫోన్ లోని పర్సనల్ డేటా, ఫోటోలు యాక్సెస్ చేయడం, రిలేటివ్స్‌ని ఇబ్బంది పెట్టడం కంప్లీట్‌గా బ్యాన్. రూల్స్ బ్రేక్ చేసి ఫోన్ లాక్ చేస్తే.. గంటకు 250 రూపాయలు బ్యాంకే కస్టమర్‌కి ఫైన్ కట్టాలి. అంటే ఏజెంట్ తప్పు చేస్తే బ్యాంకే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది.

స్టూడెంట్ ఫేస్ పై 20,000 తేనెటీగలు!
వరల్డ్ బీ డే సందర్భంగా కోయంబత్తూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక మైండ్ బ్లోయింగ్ సీన్ కనిపించింది. భాగ్యలక్ష్మి అనే స్టూడెంట్. ఏకంగా 20 వేల భారతీయ తేనెటీగలతో తన ఫేస్ పై గడ్డంలా సెట్ చేసుకుని అందరినీ షాక్ కి గురిచేసింది. తేనెటీగలను చూసి భయపడాల్సిన అవసరం లేదని, వాటిని అర్థం చేసుకుంటే చాలని అవగాహన కల్పించడానికి ఈ డేర్ చేసినట్లు ఆమె చెప్పింది. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

బొద్దింకల జనతా పార్టీ ఫౌండర్ ని చంపేస్తామంటూ వార్నింగ్స్!
బొద్దింకల జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే చేసిన ఒక లేటెస్ట్ పోస్ట్ నెట్టింట తీవ్ర కలకలం రేపుతోంది. "నాకు ఇప్పుడు చంపేస్తామంటూ బెదిరింపులు (Death Threats) వస్తున్నాయి" అంటూ ఆయన తన ఎక్స్ అకౌంట్‌లో ఒక వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్‌ని షేర్ చేశారు.. సోషల్, పొలిటికల్ టాపిక్స్ పై వాయిస్ వినిపించే అభిజీత్‌కి ఇలాంటి threats రావడంపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ వాట్సాప్ లో ఉన్న నెంబర్ పై పోలీసులు యాక్షన్ తీసుకోవాలంటూ పబ్లీక్ నుండి డిమాండ్స్ పెరుగుతున్నాయి.
జస్ట్ 5minates లో కార్ ఛార్జింగ్ ఫుల్!
ఎలక్ట్రిక్ కార్ల (EVs) ఛార్జింగ్ టైమ్‌కి బైబై చెప్పే టైమ్ వచ్చేసింది! చైనా ఈవీ జెయింట్ BYD కొత్త 'ఫ్లాష్ ఛార్జింగ్' టెక్నాలజీని లాంచ్ చేసింది. బంకులో పెట్రోల్ ఫుల్ చేయించడానికి పట్టే టైమ్‌లోనే, అంటే ఓన్లీ 5 to 9 minates కార్ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయొచ్చని BYD అనౌన్స్ చేసింది. సెకండ్ జనరేషన్ బ్లేడ్ బ్యాటరీతో పాసిబుల్ అయ్యే ఈ అల్ట్రా-ఫాస్ట్ టెక్నాలజీ ఈవీ ఒక బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ కాబోతోంది.
హిందూ ధర్మం కోసం 200 మంది గిరిజనుల కాళ్లు కడిగిన MLA!
చత్తీస్‌గఢ్‌లోని పండరియాలో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక పాస్టర్‌తో పాటు దాదాపు 200 మంది గిరిజనులు మళ్లీ హిందూ మతంలోకి మారారు. ఈ ప్రోగ్రామ్‌కి అటెండ్ అయిన BJP MLA భావనా బోహ్రా. వారందరికీ వెల్‌కమ్ చెప్పారు. స్వయంగా వారి కాళ్లు కడిగి హిందూ ధర్మంలోకి invite చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
CM relatives దగ్గర బండి భగీరథ్ ను దాచారు?
బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కేస్‌పై KTR షాకింగ్ కామెంట్స్ చేశారు. భగీరథ్‌ను అరెస్ట్ చేయకుండా తప్పించడానికి.. సీఎం relatives అయిన 'మెడికేర్' హాస్పిటల్‌లో అల్మోస్ట్ 9 డేస్ సీక్రెట్‌గా దాచిపెట్టారంటూ KTR సంచలన ఆరోపణలు చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
నాగేశ్వరరావును అరెస్ట్ చేస్తే బొద్దింకలు బయటికి వస్తాయి!
ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేస్తే, ఆయన CM క్యాండిడేట్‌గా బయటకు వస్తారు" అంటూ CPI నారాయణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జనసేన పార్టీ వాళ్లు ఆయన్ని అరెస్ట్ చేయిస్తామని బెదిరిస్తున్నారని, అరెస్ట్ చేయండి. అలా చేస్తే మిగిలిన 'బొద్దింకలు' (రాజకీయ ప్రత్యర్థులు) కూడా బయటపడతాయని, ఈ మూవ్‌మెంట్ ఇంకా పెద్దదవుతుందని నారాయణ వ్యాగ్యంగా విమర్శించారు.

విజయ్ సర్కార్ యూ-టర్న్ .. డీఎంకే దెబ్బకి టెండర్ క్యాన్సిల్
తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి టెండర్ సెగ తగిలింది. కాంచీపురంలో ₹16.83 లక్షల ఖర్చుతో వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం మే 19న టెండర్లు పిలిచారు. ఉదయం 9 కి ఓపెన్ చేసి, మధ్యాహ్నం 3 కే క్లోజ్ చేసేశారు. కేవలం 6 గంటలే టైమ్ ఇవ్వడంపై ప్రతిపక్ష డీఎంకే గట్టిగా వాయిస్ రైజ్ చేసింది. ఈ కాంట్రాక్ట్ తమ వాళ్లకు ఇచ్చుకోవడానికే అంటూ డీఎంకే ఆరోపించడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. దెబ్బకి రూట్ మార్చిన టీవీకే సర్కార్.. ఆ టెండర్‌ను క్యాన్సిల్ చేసింది. రీసెంట్‌గా విజయ్ తన ఆస్ట్రాలజర్‌ను OSDగా నియమించి వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రెండో యూ-టర్న్ హాట్ టాపిక్ గా మారింది.
వాటర్ ప్లీజ్ అంటూ బస్సు ఆపేసిన కోతి !!
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో తీవ్రమైన ఎండల వల్ల వన్యప్రాణులు అల్లాడిపోతున్నాయి. యావత్మాల్ జిల్లా ఖండాలా ఘాట్ సమీపంలో వాషిమ్ నుండి పూసద్ వెళ్తున్న ఒక ప్రభుత్వ బస్సును దాహంతో ఉన్న ఒక కోతి అడ్డుకుంది. డ్రైవర్ బస్సును ఆపగా, అది కదలకుండా అలాగే నిలబడింది. దాని పరిస్థితిని గమనించిన ప్రయాణికులు బాటిల్‌తో నీళ్లు అందించారు. ఆ కోతి నీళ్లు తాగుతుండగా, అడవి నుండి మరికొన్ని కోతులు వచ్చి నీటి కోసం ఎగబడ్డాయి.

బండి భగీరథ్ కేసులో మరో అప్‌డేట్!
బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడానికి తెలంగాణ హైకోర్ట్ పర్మిషన్ ఇచ్చింది. తన బెయిల్ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంటామంటూ భగీరథ్ వైపు లాయర్స్ కోర్టును రిక్వెస్ట్ చేయడంతో హైకోర్ట్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, బండి భగీరథ్‌ను పోలీసులు ఆల్రెడీ కస్టడీలోకి తీసుకున్న మ్యాటర్ తెలిసిందే.

ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై పోలీస్ కేస్!
ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో పాటు ఒక టీవీ ఛానల్‌పై కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్‌లో కేస్ ఫైల్ అయింది. ఒక TV డిబేట్ షోలో నాగేశ్వర్ మాట్లాడుతూ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ టెంపరరీ ఫ్రెండ్స్ అని. జగన్ మాత్రమే లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని అమిత్ షా చెప్పారు అంటూ కామెంట్స్ చేశారు. డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, మినిస్టర్ నాదెండ్ల మనోహర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదంటూ జనసేన లీడర్స్ ఇచ్చిన కంప్లైంట్‌తో పోలీసులు ఈ కేస్ రిజిస్టర్ చేశారు.