Latest

మళ్లీ పెట్రో బాదుడు
పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. వాహనదారులకు షాక్ ఇస్తూ పెట్రోల్, డీజిల్ 90 పైసల వరకు పెంచాయి. వారం రోజుల్లోనే రెండోసారి ధరలు పెరగడంతో సామాన్యుడిపై ఎనలేని భారం పడింది. పశ్చిమాసియా సంక్షోభంతో ఇంటర్నేషనల్ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రో సంస్థలు ఇక్కడ ధరల్ని పెంచేస్తున్నాయి. దీంతో మొత్తం నిత్యావసరాల ధరలపై ఎఫెక్ట్ పడి సామాన్యుడి జేబు ఖాళీ అవుతోంది.

అమిత్ షా- నక్సలిజం ఖతం!
దేశంలో నక్సలైట్ల ప్రాబ్లమ్‌ను పూర్తిగా ఎండ్ చేయడమే తమ టార్గెట్ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ను నక్సల్స్ ఫ్రీ స్టేట్‌గా మార్చడంలో హెల్ప్ చేసిన తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్, డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆయన ప్రత్యేకంగా సన్మానించారు. మార్చి 31, 2026 నాటికి దేశం మొత్తం నక్సలిజాన్ని క్లియర్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నామని, బస్తర్ ఏరియా ఇప్పుడు ఫుల్ సేఫ్‌గా మారిందని అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.
PM మోదీని టార్గెట్ చేసిన ఇంటర్నేషనల్ జర్నలిస్ట్!
ఇండియా PM నరేంద్ర మోదీ నా క్వశ్చన్స్ తీసుకోలేదు, అయినా ఆయన ఆన్సర్ చేయరని నేను ముందే ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంటూ నార్వే జర్నలిస్ట్ హెల్లే లింగ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో నార్వే నంబర్ 1 ప్లేస్‌లో ఉంటే. ఇండియా 157వ ప్లేస్ లో పాలస్తీనా, యూఏఈ, క్యూబాతో పోటీ పడుతోందని ఆమె కామెంట్ చేశారు. మనతో కలిసి పనిచేసే పవర్స్‌ను క్వశ్చన్ చేయడం మా బాధ్యత అని ఆమె చెప్పుకొచ్చారు.
కృష్ణ - విజయనిర్మల కార్ వాల్యూ అన్ని కోట్లా?
సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మలల కార్ గురించి యాక్టర్ నరేష్ సోషల్ మీడియాలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు. 15 ఏళ్ల క్రితమే ఈ కార్‌ను ఒక కోటికి పైగా పెట్టి కొన్నారని ఆయన చెప్పారు. వాళ్లిద్దరి జ్ఞాపకాలకు గుర్తుగా ఆ కార్ ఇప్పటికీ తమ దగ్గరే సేఫ్‌గా ఉందని నరేష్ చెప్పారు. ఈ వీడియొ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

జైల్లో యాక్టర్ సూసైడ్ అటెంప్ట్?
మర్డర్ కేస్‌లో జైల్లో ఉన్న కన్నడ యాక్టర్ దర్శన్ సూసైడ్ అటెంప్ట్ చేశారంటూ వచ్చిన రూమర్స్ సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేశాయి. దీంతో జైలు దగ్గర కొద్దిగా టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. అయితే ఈ న్యూస్‌లో ఎలాంటి నిజం లేదని, దర్శన్ సేఫ్‌గా ఉన్నారని జైలు డీజీపీ క్లారిటీ ఇచ్చారు. రేపు తన వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో ఫ్యామిలీని కలవడానికి పర్మిషన్ ఇవ్వాలని దర్శన్ కోర్టును కోరారు.

ఇండియా- అమెరికా రూల్స్ పెట్టినా రష్యా నుండి ఆయిల్ కొంటాం!
అమెరికా ఆంక్షల టైమ్ ముగిసినా సరే, రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనడం కంటిన్యూ చేస్తామని ఇండియా ఓపెన్‌గా చెప్పేసింది. మన దేశ ఎనర్జీ అవసరాలు, బిజినెస్ లాభాలే మనకు ఫస్ట్ ప్రయారిటీ అని పెట్రోలియం డిపార్ట్‌మెంట్ క్లారిటీ ఇచ్చింది. అమెరికా నుండి పర్మిషన్ ఉన్నా లేకపోయినా.. రష్యా నుండి మనకు ఆయిల్ సప్లై ఆగదు అని ప్రజలకి ఫుల్ భరోసా ఇచ్చింది.
జనసేన MLAపై బాధితురాలు వీణ సాంగ్!
జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్‌పై బాధితురాలు వీణ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అందరికీ తెలిసింది. కానీ నువ్వు నన్ను ఎందుకు వదిలేశావో ఇప్పటికీ ఒక మిస్టరీనే అంటూ, వీణ ఒక పాట పాడింది. ఈ వీడియొ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
చంద్రబాబు ఇచ్చే 30-40 వేల కోసం పిల్లలను కనకండి!
CM చంద్రబాబు ఇచ్చే 30 నుంచి 40 వేల రూపాయల కోసం ఆశపడి పిల్లలను కనకండి అంటూ డాక్టర్ శివరాణి సంతోష్ ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. పిల్లలను కంటే సరిపోదని.. వాళ్లకు మంచి ఫుడ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ ఇవ్వగలమా? అసలు మనకు ఉండటానికి ఇల్లు ఉందా? ఇవన్నీ ఆలోచించుకున్నాకే పిల్లలను కనాలని ఆమె పేరెంట్స్‌కు అడ్వైజ్ ఇచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
ఏపీ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్ టాపిక్!
మంత్రి నారా లోకేష్ కొడుకు దేవాన్ష్‌కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ టీజర్‌ను ఇంగ్లీష్‌లో రిలీజ్ చేశారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో డిస్కషన్ నడుస్తోంది. గత వైసీపీ గవర్నమెంట్ కామన్ పీపుల్ కోసం స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం తెస్తామని చెప్పినప్పుడు.. టిడిపి, జనసేన పార్టీలు దాన్ని గట్టిగా అడ్డుకున్నాయి కదా అంటూ నెటిజన్స్ పాత విషయాలను గుర్తు చేస్తున్నారు. దీంతో ఈ టాపిక్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఫుల్ వైరల్ అవుతోంది.

భార్యను అడ్డం పెట్టుకొని పేర్ని నాని బతికిపోయారు!
మాజీ మంత్రి పేర్ని నానిపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి ఫైర్ అయ్యారు. నూజివీడులో వైసీపీ లీడర్స్ చేసిన కామెంట్స్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు. భార్యను అడ్డం పెట్టుకొని పేర్ని నాని అవినీతి, అక్రమాలు చేశారని.. విమెన్‌ను వేధించకూడదన్న సీఎం చంద్రబాబు రూల్ వల్లే ఆయన బతికిపోయారని చెప్పారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ పేర్ని నానికి మంత్రి పార్థసారథి వార్నింగ్ ఇచ్చారు.
ముంబై స్టేజ్‌పై రామ్ చరణ్ డ్యాన్స్!
ముంబైలో జరిగిన ‘పెద్ది’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టేజ్‌పై సూపర్ ట్రెండింగ్ "ChikiriChikiri" సాంగ్‌కు వేసిన డ్యాన్స్ స్టెప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జన నాయగన్ రిలీజ్ డేట్ ఎప్ప్పుడంటే !!
తమిళనాడు సీఎం విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్రానికి ఈ వారాంతంలో సెన్సార్ సర్టిఫికేట్ లభించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. గత ఏడాది డిసెంబర్‌లో'స్క్రీనింగ్ కమిటీ సూచించిన మార్పులు చేసినప్పటికీ, ఒక సభ్యుని అభ్యంతరం వల్ల వివాదం తలెత్తింది. దీనిపై దర్శకుడు కోర్టును ఆశ్రయించగా, తాజాగా సీబీఎఫ్‌సీ రివైజింగ్ కమిటీ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు.

సువేందు కేబినెట్ సరీకొత్త కీలక నిర్ణయం !
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని నూతన ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. జూన్ నుండి మతపరమైన ప్రాతిపదికన అందించే ప్రభుత్వ సంక్షేమ నిధులు, సహాయాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇమామ్‌లు, ముయెజ్జిన్‌లు, ఆలయ పూజారుల నెలవారీ గౌరవ వేతనాల పథకాలు జూన్‌తో రద్దు కానున్నాయి. సంక్షేమ పథకాలు మత గుర్తింపు ఆధారంగా ఉండకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

జయలలిత పథకానికి సీఎం విజయ్ పెద్ద పీట
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ అమ్మా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా పునరుద్ధరించాలని నిర్ణయించారు. దివంగత సీఎం జయలలిత మొదలు పెట్టిన ఈ క్యాంటిన్స్ క్వాలిటీ ఫుడ్ సరఫరా చేయడంలో విఫలమయ్యాయి.. ఇప్పుడు విజయ్ రాకతో మళ్లీ వాటికి ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అమ్మా క్యాంటీన్లన్నింటినీ బాగు చేసి క్వాలిటీ మీల్స్ సప్లయ్ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.ప్రస్తుతం తమిళనాడులో స్టేట్ వైడ్ గా 600 అమ్మా క్యాంటీన్లున్నాయి. పేదలకు, కార్మికులకు, పేదవారికి ఈ క్యాంటిన్లు ఉచిత భోజనం అందిస్తున్నాయి.
వంట బిజీలో తల్లి.. పాపను కాపాడిన డాగ్!
వంట చేసేటప్పుడు పిల్లలపై ఎంత అలర్ట్‌గా ఉండాలో చెప్పే ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఒక ఆమె కిచెన్‌లో వంట చేస్తూ కింద ఉన్న చిన్న పాపను గమనించలేదు. అప్పుడే ఆ పాప సడెన్‌గా అక్కడ పడి ఉన్న నైఫ్ దగ్గరికి వెళ్ళింది. అది చూసిన వాళ్ల డాగ్ వెంటనే పాపను పక్కకి నెట్టి, ఆ మదర్ ని అలర్ట్ చేసింది. ఈ హార్ట్ టచింగ్ వీడియో చూసి నెటిజన్స్ ఆ డాగ్‌ని ఫుల్ మెచ్చుకుంటున్నారు.
టీమ్ లో ఒకరు కైండ్ గా ఉంటే టీమ్ మొత్తం ఎలా మారుతుందో తెలుసా?
లీడర్ కైండ్ గా ఉంటే, టీమ్ మొత్తం అదే దారి ఫాలో అవుతుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ హార్ట్ టచింగ్ వీడియో చూసి నెటిజన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు.
రేపల్లె హైవేపై తగలబడ్డ కారు..
బాపట్ల జిల్లా,రేపల్లె నియోజకవర్గంలో రేపల్లె హైవే ప్రధాన రహదారిపై సోమవారం మచిలీపట్నం నుండి వస్తున్న కారు కృష్ణానది ఓవర్ బ్రిడ్జిపై రాగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఎండ తీవ్రతకు కారు వేడెక్కి షార్ట్ సర్క్యూట్ తో తగలబడినట్లు స్థానికులు తెలిపారు. కారులో ప్రయాణికులు వెంటనే దిగి పరుగులు తీశారు. అదృష్టం కొద్దీ ఎవరూ గాయపడలేదు.
ఒకే చైర్‌లో 10 మంది బాయ్స్ లంచ్.. ఈ క్రేజీ చైన్ సిస్టమ్ చూశారా?
సోషల్ మీడియాలో ఒక మైండ్ బ్లోయింగ్ బాయ్స్ వీడియో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఒక ఫంక్షన్‌లో కొందరు అబ్బాయిలు తినడానికి కూర్చున్నారు. కానీ అక్కడ ట్విస్ట్ ఏంటంటే. ఒక అబ్బాయి చైర్‌లో కూర్చుంటే, ఆ అబ్బాయి లెగ్ పైన ఇంకో అబ్బాయి, అతని లెగ్ పైన మరో అబ్బాయి. ఇలా ఒక చైన్ సిస్టమ్ లాగా ఏకంగా 9 మంది ఒకరిపై ఒకరు కూర్చొని లంచ్ చేస్తున్నారు. ఈ క్రేజీ ఐడియా చూసి నెటిజన్స్ నవ్వి నవ్వి ఫుల్ ఫిదా అవుతున్నారు.
కోర్టులో నిందితుడిని హగ్ చేసుకున్న జడ్జ్!
అమ్మ ప్రాణాలు కాపాడే మెడిసిన్ కోసం ఒక కొడుకు ఫేక్ చెక్ ఇచ్చి దొంగతనం చేశాడు. కోర్టులో నిలబడి తప్పు చేశానని ఏడుస్తున్న ఆ కొడుకు వెనకున్న పెయిన్‌ను జడ్జ్ అర్థం చేసుకున్నారు. రూల్స్ పక్కన పెట్టి, అతన్ని స్టేజ్ పైనే హగ్ చేసుకుని అన్ని చార్జెస్ డ్రాప్ చేసేశారు. నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. వెళ్లి మీ అమ్మను చూసుకో అంటూ జడ్జ్ ఇచ్చిన కొత్త లైఫ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
తాతా మనవళ్ల క్రేజీ డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
సౌరాష్ట్రకు చెందిన ఒక ట్రెడిషనల్ డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఒక తాత, మనవడు కలిసి ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ స్టెప్స్ చేస్తున్న విజువల్స్ చూసి నెటిజన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. ఇప్పుడున్న ఫాస్ట్ వరల్డ్‌లో కూడా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్‌కు మన కల్చర్, ట్రెడిషన్స్ ఎలా పాస్ అవుతున్నాయో ఈ వీడియోలో చూడొచ్చు.
CM, PM మధ్య సీక్రెట్ లింక్? BJP MP అరవింద్ షాకింగ్ కామెంట్స్!
BJP MP ధర్మపురి అరవింద్ తెలంగాణ పాలిటిక్స్ గురుంచి క్రేజీ కామెంట్ చేశారు. CM రేవంత్ రెడ్డి, పీఎం నరేంద్ర మోదీ మధ్య లింక్ ఉందేమో అని ఆయన హింట్ ఇచ్చారు. బెంగాల్‌లో సువేందు అధికారి ఎలాగైతే BJPలోకి వచ్చారో, ఫ్యూచర్‌లో రేవంత్ రెడ్డి కూడా అలాగే మారే ఛాన్స్ ఉందేమో! నాకు తెలీదు.. BJPలో నేను చిన్న కార్యకర్తను అంటూ అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.