← Back to news

మళ్లీ పెట్రో బాదుడు

By aravinda nyayapati· 19 May 2026· Hyderabad
మళ్లీ పెట్రో బాదుడు

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. వాహనదారులకు షాక్ ఇస్తూ పెట్రోల్, డీజిల్ 90 పైసల వరకు పెంచాయి. వారం రోజుల్లోనే రెండోసారి ధరలు పెరగడంతో సామాన్యుడిపై ఎనలేని భారం పడింది. పశ్చిమాసియా సంక్షోభంతో ఇంటర్నేషనల్ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రో సంస్థలు ఇక్కడ ధరల్ని పెంచేస్తున్నాయి. దీంతో మొత్తం నిత్యావసరాల ధరలపై ఎఫెక్ట్ పడి సామాన్యుడి జేబు ఖాళీ అవుతోంది.

More in General