Latest

స్పేస్ లో రేర్ క్లిక్: మార్స్ "క్రీసెంట్" ఫోటో అదిరిపోయింది!
NASA కి చెందిన సైకీ (Psyche) స్పేస్ క్రాఫ్ట్ ఒక అద్భుతాన్ని సాధించింది. అంగారక గ్రహం (Mars) పక్క నుంచి వెళ్తూ, ఒక రేర్ 'క్రీసెంట్' (చందమామ లాంటి వంపు) షేప్ లో ఉన్న మార్స్ ఫోటోని క్యాప్చర్ చేసింది. అంతరిక్ష ప్రియులకి ఇది ఫుల్ మీల్స్ లాంటి వార్త. ప్రస్తుతం ఈ పిక్చర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. స్పేస్ టెక్నాలజీ ఏ రేంజ్ కి వెళ్ళిందో చెప్పడానికి ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్.
మాట రాని ఎంప్లాయ్‌ని 'బ్రాండ్ మోడల్'గా మార్చేశారు!
కేరళలోని ఒక బట్టల షాపు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ షాపులో పనిచేస్తూ, మాట్లాడలేని స్థితిలో ఉన్న ఒక ఎంప్లాయ్‌ని ఆ షాపు ఓనర్ ఏకంగా తన బ్రాండ్‌కు మెయిన్ మోడల్‌గా మార్చేశారు. సిటీలోని పెద్ద పెద్ద బిల్‌బోర్డ్స్ మీద ఆమె ఫోటోలనే పెట్టారు. వైకల్యం అనేది దేనికీ అడ్డు కాదని నిరూపించిన ఈ షాపు ఓనర్ ని సోషల్ మీడియాలో మెచ్చుకుంటున్నారు.

ట్రంప్ vs ఇరాన్: సీజ్ ఫైర్ "లైఫ్ సపోర్ట్" లో ఉంది!
అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఈరోజు ఇరాన్ పంపిన శాంతి ఒప్పందాన్ని 'చెత్తబుట్ట'లో వేసేశారు. ఇరాన్ ఇచ్చిన ప్రపోజల్ అస్సలు నచ్చలేదని, ప్రస్తుతం ఉన్న కాల్పుల విరమణ (Ceasefire) "లైఫ్ సపోర్ట్" మీద ఉందని, ఎప్పుడైనా మళ్ళీ యుద్ధం మొదలవ్వచ్చు అని వార్నింగ్ ఇచ్చారు. దీనివల్ల గ్లోబల్ మార్కెట్స్ లో ఆయిల్ రేట్లు పెరిగే ఛాన్స్ ఉండటంతో అందరూ టెన్షన్ పడుతున్నారు.

PM మోదీ "Austerity" మంత్రం: నో మోర్ విదేశీ ట్రిప్స్!
ఈరోజు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన PM మోదీ, ఇండియన్ ఎకానమీని కాపాడుకోవడానికి కొన్ని గట్టి రూల్స్ చెప్పారు. "అవసరం లేకపోతే ఫారిన్ వెకేషన్స్ వెళ్లకండి, విదేశీ వస్తువుల కంటే మన స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వండి" అని కోరారు. ముఖ్యంగా బంగారం కొనడం కొంచెం తగ్గించి, పెట్రోల్ వాడకాన్ని తగ్గించడానికి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) కి షిఫ్ట్ అవ్వమని పిలుపునిచ్చారు. ఇది వింటే చాలామందికి మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి!

హైకోర్టు మెట్లెక్కిన బండి సంజయ్ కొడుకు!
POCSO కేసులో చిక్కుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఇప్పుడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనకు మధ్యంతర బెయిల్ (ఇంటర్మీడియట్ బెయిల్) ఇవ్వాలని కోరుతూ వెకేషన్ బెంచ్ ముందు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ఈ నెల 14న విచారణ చేయనుంది. అప్పటివరకు భగీరథ్‌కు రిలీఫ్ దొరుకుతుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

కాలేజీమేట్స్.. ఇప్పుడు ఒకే అసెంబ్లీలో
తమిళనాడు సీఎం విజయ్, ప్రతిపక్ష నేత ఉదయ నిధి స్టాలిన్ ఒకే కాలేజీలో చదువుకున్నారు. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు వీళ్లిద్దరూ ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీలో ఇద్దరూ ప్రత్యర్థులు. స్పీకర్ గా ఎన్నికైన టీవీకే నేత జేసీడీ ప్రభాకర్ కూడా వీళ్ల కాలేజీయే. వీరంతా లయోలా కాలేజీ పూర్వ విద్యార్థులు. ఇదే విషయాన్ని ఉదయనిధి స్టాలిన్ ఇవాళ అసెంబ్లీలో గుర్తు చేశారు. ఒకే కాలేజీలో చదివినా పాలిటిక్స్ లో మేమే సీనియర్స్ అంటూ నవ్వులు పూయించారు.

నీట్ యూజీ పరీక్ష రద్దు
దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో ప్రవేశాల కోసం మే 3న జరిగిన NEET UG 2026 ఎగ్జామ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. రాజస్థాన్‌లో పేపర్ లీక్ అయినట్లు పక్కా ఆధారాలు దొరకడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయాల్సిందిగా CBIని ఆదేశించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న విషయం కావడంతో సోషల్ మీడియాలో 'Justice for NEET Students' అంటూ ట్రెండ్ అవుతోంది. మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో అన్న టెన్షన్‌లో అభ్యర్థులు ఉన్నారు.
అసెంబ్లీలో CM విజయ్ ఫస్ట్ స్పీచ్!
తమిళనాడు అసెంబ్లీలో CM విజయ్ తన ఫస్ట్ స్పీచ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. సభలో ప్రతి ఒక్క MLA ఇంపార్టెంటే అంటూ చాలా హుందాగా మాట్లాడారు. కేవలం ఒక్క MLA ఉన్న పార్టీ ఇచ్చే ఒపీనియన్ ని కూడా TVK పార్టీ అభిప్రాయంతో సమానంగా చూస్తామని విజయ్ చెప్పారు. ఎవరైనా సరే. మంచి సలహాలు ఇస్తే తీసుకుంటామని, చెడు సలహాలను మాత్రం రిజెక్ట్ చేస్తామని అసెంబ్లీ లో విజయ్ క్లియర్ గా స్టేట్‌మెంట్ ఇచ్చారు.

CM విజయ్‌కు విశాల్ విజిల్స్!
CM విజయ్ తీసుకున్న 717 వైన్ షాపుల క్లోజింగ్ డెసిషన్‌పై యాక్టర్ విశాల్ హ్యాపీగా రియాక్ట్ అయ్యారు. విజిల్స్ టు యు విజయ్! అంటూ అప్రిషియేట్ చేశారు. మెయిన్ గా స్కూల్స్ దగ్గర ఆల్కహాల్ షాప్స్ తీసేయడం వల్ల ఎంతోమంది అమ్మాయిలకు సేఫ్టీ దొరుకుతుందని విశాల్ చెప్పారు. గతంలో ఆర్కే నగర్ లో ఒక స్కూల్ స్టూడెంట్ వైన్ షాపుల దగ్గర పడ్డ ఇబ్బందులను గుర్తు చేస్తూ.. ఆ అమ్మాయి లాంటి వాళ్ళందరూ ఇప్పుడు విజయ్‌ను మెచ్చుకుంటారని విశాల్ వీడియొ చేసి పోస్ట్ చేశారు
బండి భగీరథ్ POCSO కేసు: కొత్త ట్విస్ట్!
సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై ఉన్న POCSO కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. మనీ ఉంటే దేన్నైనా మేనేజ్ చేయొచ్చు అనే రేంజ్‌లో సోషల్ మీడియాలో కొత్త ప్రచారం స్టార్ట్ అయింది. సోషల్ మీడియా అడ్వర్టైజర్స్ ద్వారా, తమ తప్పేమీ లేదని.. అంతా ఆ అమ్మాయి పేరెంట్సే మనీ కోసం చేస్తున్నారని బండి సంజయ్ చెప్పిస్తున్నట్టు ఒక వీడియో వైరల్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియాలో పబ్లిక్ సీరియస్ అవుతున్నారు. తప్పు చేసిన వాళ్ళని వదిలేసి, బాధితులనే టార్గెట్ చేయడం ఏంటని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు.

ఆల్కహాల్ షాప్స్ క్లోజింగ్‌పై కమల్ హాసన్ స్పెషల్ పోస్ట్!
తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్న ఒక బిగ్ డెసిషన్ పై లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ రియాక్ట్ అయ్యారు. పవర్ లోకి రాగానే స్కూల్స్, టెంపుల్స్ దగ్గర ఉన్న 717 లిక్కర్ షాపులను క్లోజ్ చేయడంపై విజయ్‌ను ఆయన అప్రిషియేట్ చేశారు. ఆల్కహాల్ అమ్మడం అనేది గవర్నమెంట్ పని కాకూడదని, ఇలాగే మరిన్ని షాపులు క్లోజ్ చేయాలని కమల్ చెప్పారు. ప్రజల కోరిక మేరకు వెంటనే యాక్షన్ తీసుకున్న తన తమ్ముడు విజయ్‌కు కమల్ హాసన్ కంగ్రాట్స్ చెప్పారు.
అసెంబ్లీ స్పీకర్ పోస్ట్ TVK కే!
తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా TVK MLA J.C.D. ప్రభాకర్ సెలెక్ట్ అయ్యారు. విజయ్ పార్టీ నుంచి ఒక MLA ఈ టాప్ పొజిషన్ లో కూర్చోవడం ఇదే ఫస్ట్ టైమ్. కొత్త గవర్నమెంట్‌లో ఈ ఇంపార్టెంట్ పదవి TVK ఖాతాలోకి వెళ్లడం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్‌లో బిగ్ న్యూస్ గా మారింది. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆఖరికి ఆ దేశంలోకీ దోమల ఎంట్రీ..!
ఐస్‌లాండ్ పేరు వింటే మనకు గుర్తొచ్చేది చల్లటి మంచు కొండలు. కానీ ఆ దేశానికి మరో పేరుంది.అదే దోమలు లేని దేశం. ఇప్పుడు ఆ స్టేటస్ అది కోల్పోయింది. ఐస్ లాండ్ లోకి కూడా ఇప్పుడు మస్కిటోలు ఎంట్రీ ఇచ్చేశాయి. వాతావరణ మార్పులతో అక్కడ మంచు కొండలు కరిగిపోయి చలి తగ్గిపోవడంతో దోమలు బతికే పరిస్థితులు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐస్‌లాండ్ వెళ్లే ప్లాన్ ఉంటే స్వెట్టర్లతో పాటు ఇకపై మస్కిటో కాయిల్స్ కూడా పట్టుకెళ్లాల్సిందేనేమో!

ఆ మేయర్ చైనా ఏజెంట్.. అమెరికాకు షాక్
అమెరికా పాలిటిక్స్‌లో పెను సంచలనం నమోదైంది. కాలిఫోర్నియాలోని ఆర్కేడియా మేయర్ ఎలీన్ వాంగ్ తాను చైనా ఏజెంట్‌గా వ్యవహరించినట్లు అంగీకరించి అందరినీ షాక్‌కు గురిచేశారు. పదవికి రాజీనామా చేశారు. పదేళ్ల పాటు ఆమె చైనా ఇంటెలిజెన్స్ అధికారులకు కీలక సమాచారం అందించారు. ఈ విషయాన్ని ఆమె కోర్టులో స్వయంగా ఒప్పుకున్నారు. దీంతో గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది.

పాకిస్తాన్ డబుల్ గేమ్ .. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో ఇరాన్ విమానాలు
ఇరాన్-అమెరికా టెన్షన్స్ మధ్య పాకిస్థాన్ డబుల్ గేమ్ ఆడిందా? ఇదే ఇప్పుడు ఇంటర్నేషనల్ హాట్ టాపిక్‌గా మారింది. అమెరికాతో శాంతి చర్చలు జరుపుతూనే… ఇరాన్‌కు చెందిన మిలిటరీ, స్పై ఎయిర్‌క్రాఫ్ట్‌లను నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌ల్లో పార్క్ చేసేందుకు పాక్ అనుమతిచ్చిందని రిపోర్టులు చెబుతున్నాయి.ఒకవైపు శాంతి చర్చలు అంటూనే, మరోవైపు ఇలా ఇరాన్ నిఘా విమానాలకు ఆశ్రయం కల్పించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అమెరికా మీడియా అంతటా ఇవే కథనాలు వస్తున్నాయి. ఇక ట్రంప్ ఏమంటారో చూడాలి.

విజయ్ కే మా మద్దతు : AIADMK షణ్ముగం వర్గం ప్రకటన
తమిళనాడు రాజకీయాల్లో మరో ట్విస్ట్.. విజయ్ నేతృత్వంలోని TVKకి 30 మంది ఎమ్మెల్యేలున్న సీవీ షణ్ముగం నేతృత్వంలో AIADMK చీలిక వర్గం మద్దతు ప్రకటించింది. విజయ్‌ను ప్రజల సీఎం అని షణ్ముగం ప్రశంసించారు. అయితే తాము పార్టీని చీల్చబోవడం లేదని స్పష్టం చేశారు. రేపే విజయ్ అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఏఐఏడీఎంకే మద్దతు కీలకంగా మారింది. అసెంబ్లీ మెజార్టీకి అవసరమైన సంఖ్యా బలం విజయ్ కి ఉన్నప్పటికీ షణ్ముగం మద్దతుతో పొలిటికల్ గా కొత్త సమీకరణలు మొదలయ్యే ఛాన్స్ ఉంది.

11 గంటలు నాన్ స్టాప్ ఈత.. బెంగళూరు అడ్వెంచర్ కపుల్ హిస్టరీ
ఫ్లైట్ కాదు… బోట్ కాదు… శ్రీలంక నుంచి ఇండియాకి సముద్రంలో ఈదుకుంటూ వచ్చేశారు ఆ అడ్వెంచర్ కపుల్. బెంగళూరుకు చెందిన IT కపుల్ డానిష్ అబ్దీ, వృషాలి ప్రసాదే నాలుగేళ్ల క్రితమే స్విమ్మింగ్ నేర్చుకున్నారు. అయినా ఒక పెద్ద అడ్వెంచర్ చేశారు. రామసేతు రూట్‌లో 32 కిలోమీటర్లు దాదాపు 11 గంటలు సముద్రాన్ని ఈది హిస్టరీ క్రియేట్ చేశారు. భారీ అలలు, స్ట్రాంగ్ కరెంట్స్ మధ్య కూడా వెనక్కి తగ్గలేదు. వీరి సాహనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ మద్యం షాపులు బంద్… విజయ్ నిర్ణయం
తమిళనాడులో సీఎం విజయ్ అతి పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఆలయాలు, స్కూల్స్, బస్ స్టాండ్స్ దగ్గర 500 మీటర్ల పరిధిలో ఉన్న తమిళనాడు ప్రభుత్వం రన్ చేస్తున్న 717 మద్యం షాపులు రెండు వారాల్లో మూసేయాలని ఆదేశించారు. “డ్రగ్స్, మద్యం ఫ్రీ తమిళనాడు” లక్ష్యంతో ఈ స్టెప్ తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మద్యం ద్వారా వేల కోట్లు ఆదాయం వస్తున్నా… విజయ్ మాత్రం పబ్లిక్ వెల్ఫేర్‌కే ప్రాధాన్యం ఇచ్చారు
మీ పిల్లలకు ఇలాంటివి నేర్పండి..
ఈ వీడియో చూడండి.. మన పిల్లలకు ఇవ్వడం, తీసుకోవడం, పనికి వెల కట్టడం లాంటివి నేర్పడం ఎలాగో తెలిపే వీడియో ఇది.. చిన్న చిన్న పనులు చేయడం నేర్పి వాటికి కొంత సొమ్ము ఇచ్చి వాటిని ఎలా సేవ్ చేయాలో నేర్పాలి. వాటిని అవసరమైన వారికి ఎలా ఇవ్వాలో నేర్పాలి. దీనివల్ల ఇచ్చే తత్వం అలవడుతుంది. సోసైటీలో ఎలా ఉండాలో తెలుస్తుంది. ఇంటి పనులు చేయడం రావడంతో పాటు, డబ్బు విలువ తెలిసి రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అవుతారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి...
దీదీ ఓటమికి శపథం పడుతూ ఓ డాక్టర్ పాత వీడియో వైరల్
అపర కాళికలా నర్తిస్తున్న ఈవిడెవరో సాదా సాదా ఆర్టిస్టు కాదు.. ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్న డాక్టర్. ఆమె అలా కాళికలా నర్తించడానికి కారణం మాజీ సీఎం మమతా బెనర్జీ పాలనపై ఆగ్రహం.. అది కేవలం ఆగ్రహం మాత్రమే కాదు. శపథం. మమత పవర్ లోంచి దిగిపోయే వరకూ ఆమె అలాగే తన కోపాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ రీజన్ ఏంటో తెలుసా? కోల్ కాతాలోని ఆర్ జి కర్ హాస్పిటల్ రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితులను దీదీ ప్రభుత్వం సేవ్ చేస్తోందన్న కోపంతో ఆమె ఈ పని చేశారు. మమత ప్రభుత్వం దించుతామని శపథం చేస్తూ సాగిన ఈ డాన్స్ ఒక స్ట్రీట్ ప్లేలా గట్టిగానే పనిచేసింది.
సచిన్ టెండూల్కర్ ఆశ్చర్యపరిచిన 'దేశీ కారు'.. టాలెంట్ అంటే ఇదే!
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఒక అమేజింగ్ టాలెంట్‌ను తన X లో పరిచయం చేశారు. ఇండియాలోని ఒక మారుమూల ఏరియాలో ట్రావెల్ చేస్తుండగా. ఒక వింత 'కారు' సచిన్ కంటపడింది. అది ఏ షోరూమ్ నుండి రాలేదు, ఓన్లీ ఒక వ్యక్తి ఇమాజినేషన్ నుండి పుట్టింది. ఆ కారును చూసి సర్ప్రైజ్ అయిన సచిన్, తన వెహికల్ ఆపి మరీ ఆ టాలెంట్‌ను అప్రిషియేట్ చేశారు. టాలెంట్‌కు కండిషన్స్ అక్కర్లేదు, జస్ట్ ఒక ఛాన్స్ వస్తే చాలు అంటూ సచిన్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది.