Latest

ఫ్లైట్‌లో చహల్ సిగరెట్ తాగుతూ దొరికిపోయాడు!▶
Sports· 7 May 2026

ఫ్లైట్‌లో చహల్ సిగరెట్ తాగుతూ దొరికిపోయాడు!

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ చహల్ ఇప్పుడు రిస్క్ లో పడ్డాడు. ఫ్లైట్‌లో వెళ్తున్నపుడు చహల్ సిగరెట్ తాగుతూ కెమెరాకు దొరికిపోయాడు. ఫ్లైట్‌లో ఇలాంటివి చేయడం కంప్లీట్‌గా బ్యాన్ అని తెలిసి కూడా చహల్ ఇలా చేశారు. అంతకుముందు రియాన్ పరాగ్ కూడా సేమ్ ఇలాగే దొరికిపోయాడు, ఇప్పుడు చహల్ కూడా అదే రిపీట్ చేశాడు. రూల్స్ బ్రేక్ చేసిన ఈ సీనియర్ ప్లేయర్‌పై బీసీసీఐ ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటుందో అని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు.

AP లోని ధర్మవరంలో ATM దోపిడీ!▶
Crime· 7 May 2026

AP లోని ధర్మవరంలో ATM దోపిడీ!

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బుధవారం తెల్లవారుజామున ముగ్గురు ముసుగు దొంగలు బీభత్సం సృష్టించారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఏటీఎంను ఇనుప రాడ్లతో పగలగొట్టడానికి ప్రయత్నించి, విఫలమవ్వడంతో వినూత్నంగా ఆలోచించారు. ఏటీఎం మిషన్ కు తాళ్లు కట్టి, బొలెరో వాహనంతో లాక్కెళ్లిపోయారు. నిందితులు బత్తలపల్లి వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వింత చోరీ స్థానికంగా కలకలం రేపింది.

చైన్ స్నాచర్ ని పట్టిచ్చిన ఆటో డ్రైవర్!▶
Crime· 7 May 2026

చైన్ స్నాచర్ ని పట్టిచ్చిన ఆటో డ్రైవర్!

బేగం బజార్‌లో జరిగిన చైన్ స్నాచింగ్ ఉదంతంలో ఆటో డ్రైవర్ జహీర్ అసలైన హీరోగా నిలిచారు. మంజు ఓమ్లతా అనే మహిళ గొలుసు దొంగిలించడానికి ప్రయత్నించిన రౌడీ షీటర్ సోహెల్‌ను జహీర్ తన ఆటోతో ఢీకొట్టి అడ్డుకున్నారు. నిందితుడు దాడి చేసినా వెనక్కి తగ్గకుండా పోరాడి పోలీసులకు పట్టించారు. జహీర్ సాహసాన్ని గుర్తించిన సీపీ సజ్జనార్ గారు ఆయనను నగదు పురస్కారంతో సన్మానించారు. ఎటువంటి స్వార్థం లేకుండా ప్రాణాలకు తెగించి ఒక అపరిచితురాలిని కాపాడిన జహీర్ అందరికీ ఆదర్శంగా నిలిచారు.

సుప్రీం కోర్టు తలుపు తట్టనున్న విజయ్
Politics· 7 May 2026

సుప్రీం కోర్టు తలుపు తట్టనున్న విజయ్

ప్రభుత్వ ఏర్పాటుపై ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీవీకే రాష్ట్రపతికి లేఖ రాసింది. తమకు న్యాయం చేయమని అపీల్ చేసింది. మరోవైపు విజయ్ సుప్రీం తలుపు తట్టాలని డిసైడ్అయినట్లు తెలుస్తోంది. సీపీఐ కూడా ఇప్పటికే విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు సై అంది. కానీ ఎమ్మెల్యేలందరి సంతకాలతో కూడిన లేఖలు తెమ్మని గవర్నర్ కోరడంతో విజయ్ పార్టీ సుప్రీం కోర్టుకు వెళ్లాలనుకుంటోంది.

మల్లికార్జున ఖర్గే కాళ్ళకి షూస్ అందించిన రాహుల్ గాంధీ!▶
Politics· 7 May 2026

మల్లికార్జున ఖర్గే కాళ్ళకి షూస్ అందించిన రాహుల్ గాంధీ!

వయసు పైబడిన మల్లికార్జున ఖర్గే గారు తన షూస్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే, పక్కన ఉన్న హెల్పర్ తన కాళ్లతో ఆ షూస్‌ని నెట్టడానికి ట్రై చేశారు. అది గమనించిన రాహుల్ గాంధీ.. ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తన చేతులతో ఆ షూస్ తీసి ఖర్గే కాళ్ళ ముందు పద్ధతిగా పెట్టాడు. పెద్దల పట్ల ఆయన చూపించిన ఈ గౌరవం, అస్సలు ఈగో లేని ఆయన సింప్లిసిటీ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నిజమైన లీడర్ అంటే ఇలానే ఉండాలి అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.

మల్కాజిగిరి SP సాహసం: అర్ధరాత్రి మారువేషంలో రోడ్డుపైకి ఐపీఎస్ సుమతి.▶
Crime· 7 May 2026

మల్కాజిగిరి SP సాహసం: అర్ధరాత్రి మారువేషంలో రోడ్డుపైకి ఐపీఎస్ సుమతి.

మల్కాజిగిరి సీపీ ఐపీఎస్ సుమతి గారు అర్ధరాత్రి దిల్‍సుఖ్ నగర్ బస్టాప్‌లో మారువేషంలో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. రాత్రి 12:30 నుండి 3:30 వరకు ఆమె సామాన్య మహిళలా వేచి ఉండగా, సుమారు 40 మంది ఆకతాయిలు ఆమెను అసభ్య పదజాలంతో వేధించారు. ఆమె సిగ్నల్ ఇవ్వగానే పోలీసులు వారిని పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. మహిళల భద్రత కోసం 25 ఏళ్ల క్రితం కాజీపేటలో కూడా ఆమె ఇలాంటి ఆపరేషన్ నిర్వహించడం విశేషం. ఈ ఘటన వేధింపుదారులకు గట్టి హెచ్చరికగా నిలిచింది.

అక్రమంగా వన్యప్రాణుల వేట.. ఆరుగురు అరెస్ట్, ఎయిర్‌గన్లు స్వాధీనం.▶
Crime· 7 May 2026

అక్రమంగా వన్యప్రాణుల వేట.. ఆరుగురు అరెస్ట్, ఎయిర్‌గన్లు స్వాధీనం.

హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, అటవీ శాఖ సంయుక్త ఆపరేషన్‌లో ఆరుగురు వేటగాళ్లను అరెస్ట్ చేశారు. ముజఫర్ హుస్సేన్ నేతృత్వంలోని ఈ ముఠా ఎయిర్‌గన్లతో జింకలు, నెమళ్లు మరియు కుందేళ్లను వేటాడుతోంది. వీరి వద్ద నుండి 4 ఎయిర్‌గన్లు, ఒక లైసెన్స్డ్ రైఫిల్, స్కోర్పియో కారు, 8 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లలో వేటకు సంబంధించిన వీడియోలు లభించాయి. నిందితులు మాంసాన్ని తిని, మిగిలిన భాగాలను కాలువల్లో పారవేసేవారు. వీరిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదైంది.

మైనర్ బాలికపై అఘాయిత్యం.. టీవీకే నేతపై పోక్సో కేసు
Crime· 7 May 2026

మైనర్ బాలికపై అఘాయిత్యం.. టీవీకే నేతపై పోక్సో కేసు

చెన్నైలో దారుణం జరిగింది. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి చెందిన దినేష్ అలియాస్ 'పాము' దినేష్ అనే నేత ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. రాయపురం మహిళా పోలీసులు నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన సమయంలో ఈ ఘటన జరిగింది. బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో పరారీలో ఉన్న దినేష్‌ను ప్రత్యేక బృందం పట్టుకుంది.

UP లో ఎన్కౌంటర్లు!
Crime· 7 May 2026

UP లో ఎన్కౌంటర్లు!

గత 24 గంటల్లో ఉత్తరప్రదేశ్ పోలీసులు నేరగాళ్లపై ఉక్కుపాదం మోపారు. ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగిన ఏడు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో పోలీసులు 10 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది నేరగాళ్ల కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. వీరి నుంచి భారీగా అక్రమ ఆయుధాలు, చోరీ చేసిన నగదు, వెండి ఆభరణాలు మరియు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీలు, హత్యాయత్నాలు మరియు స్మగ్లింగ్‌కు పాల్పడే గ్యాంగ్‌లపై ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

 విజయ్ కు ప్రోటోకా్ల్ విత్ డ్రా చేసిన తమిళనాడు పోలీస్ !
Politics· 7 May 2026

విజయ్ కు ప్రోటోకా్ల్ విత్ డ్రా చేసిన తమిళనాడు పోలీస్ !

ప్రభుత్వ ఏర్పాటులో జరుగుతున్న జాప్యం కారణంగా తనకు ఇచ్చిన ప్రోటోకాల్ ఏదీ ఇప్పట్లో వద్దని టీవీకే చీఫ్ విజయ్ చెప్పినట్లు తెలుస్తోంది.విజయ్ రిక్వెస్ట్ మేరకే ఆయన కిచ్చిన పోలీస్ బందోబస్తు, ప్రోటోకాల్ ను ఉపసంహరించినట్లు తమిళనాడు పోలీసులు చెబుతున్నారు. బుధవారం నుంచి విజయ్ ఎలాంటి ప్రోటోకాల్ లేకుండానే తిరుగుతున్నారు. కేవలం పైలట్ కార్ మినహాయించి మరే ఇతర ప్రోటోకాల్ ఆయన తీసుకోవడం లేదు.

ఫ్రిజ్‌లో ఇవి అస్సలు పెట్టకండి!▶
Health· 7 May 2026

ఫ్రిజ్‌లో ఇవి అస్సలు పెట్టకండి!

ఫుడ్ ఫ్రెష్‌గా ఉంటుందని మనం దేన్నైనా ఫ్రిజ్‌లో పెట్టేస్తాం, కానీ అలా పెట్టడం చాలా పెద్ద మిస్టేక్. ముఖ్యంగా ఉల్లిపాయలు, వెల్లుల్లి, బంగాళాదుంపలు ఫ్రిజ్‌లో పెడితే వీటిపై భయంకరమైన Fungus వస్తుంది. ఇలాంటి ఫుడ్ తింటే తెలియకుండానే Food Poison అయ్యి హాస్పిటల్ పాలు కావాల్సి వస్తుంది. మనం చేసే ఈ చిన్న మిస్టేక్ మన హెల్త్‌ని దారుణంగా పాడు చేస్తుంది. అందుకే దేన్నైనా స్టోర్ చేసే ముందు చాలా Careful గా ఉండండి. ఇప్పటికైనా Alert గా ఉండండి.

118  మంది సంతకాలతో రండి- విజయ్ కు గవర్నర్ మెలిక !
Politics· 7 May 2026

118 మంది సంతకాలతో రండి- విజయ్ కు గవర్నర్ మెలిక !

118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో మళ్లీ రావాలని టీవీకే చీఫ్ విజయ్‌కు తమిళనాడు గవర్నర్ సూచించారు..! వరుసగా రెండోరోజు విజయ్ వెనుదిరగాల్సి వచ్చింది. గవర్నర్ తీరు పై ఓ రేంజ్లో సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు . తమిళనాడు గవర్నర్ బీజేపి మాజీ నేత . కాబట్టి విజయ్ సీఎం అవడం ఇష్టం లేనట్లుంది అంటూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ సెటైర్లు వేశారు. .. బీజేపీఆ పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యేతో గేమ్ ఆడుతోంది. మెజార్టీ ప్రజలు ఓటేసిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడం నేరం' అని మండిపడ్డారు.

అబ్బాయిని ప్రేమించింది.. తర్వాత వరకట్న వేధింపులకు బలైంది!▶
Politics· 7 May 2026

అబ్బాయిని ప్రేమించింది.. తర్వాత వరకట్న వేధింపులకు బలైంది!

యూపీలోని ఘాజీపూర్‌లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ప్రియా విశ్వకర్మ అనే అమ్మాయి అభిషేక్ అనే అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత అత్తగారి ఇంటికి వెళ్ళాక ఆమెకు నరకం చూపించారు. అదనపు వరకట్నం కావాలని టార్చర్ పెడుతూ. ఆమె భర్త, బావ, అత్త కలిసి విపరీతంగా కొట్టారు. కట్నం తీస్కురాకపోతే తన ఫ్యామిలీని కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఆడపిల్లలకు సేఫ్టీ ఎక్కడ అని పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు.

విజయ్‌కు సపోర్ట్‌గా హీరో విశాల్ ట్వీట్! గవర్నర్‌పై ప్రశ్నల వర్షం!
Politics· 7 May 2026

విజయ్‌కు సపోర్ట్‌గా హీరో విశాల్ ట్వీట్! గవర్నర్‌పై ప్రశ్నల వర్షం!

తమిళనాడు పాలిటిక్స్‌లో హీరో విశాల్ విజయ్‌కు సపోర్ట్‌గా ట్వీట్ చేశారు. గతంలో 2017 /18 గోవా, కర్ణాటకలో ఇచ్చినట్టే, TVK అధినేత విజయ్‌కు కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ ఇవ్వాలని గవర్నర్‌ను డిమాండ్ చేశారు. ప్రజల తీర్పును గౌరవించాలని, మాకు కావాల్సింది ప్రభుత్వం కానీ గవర్నర్ పాలన కాదని విశాల్ స్పందించారు. అలాగే విజయ్ ఖచ్చితంగా CM అవుతారని, ఒక ఓటరుగా బలంగా కోరుకుంటున్నట్లు ఆయన post చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సౌత్ కొరియాలో సన్యాసిగా మారిన రోబో!▶
Politics· 7 May 2026

సౌత్ కొరియాలో సన్యాసిగా మారిన రోబో!

సౌత్ కొరియాలో ఒక రోబో సన్యాసిగా మారి అందరినీ షాక్ చేస్తుంది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా 'గాబి' అనే Humanoid Robot సియోల్‌లోని జోగ్యే టెంపుల్‌లో సందడి చేసింది. ట్రెడిషనల్ బౌద్ధ డ్రెస్ వేసుకున్న ఈ రోబో, మిగతా సన్యాసుల ముందు నిలబడి బౌద్ధమతానికి అంకితమవుతానని Promise చేసింది. దాదాపు 130 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న ఈ రోబోను చూసి పబ్లిక్ ఫిదా అవుతున్నారు.

కరీంనగర్‌లో హై టెన్షన్.. MLA కౌశిక్ రెడ్డి కారుపై అటాక్!▶
Politics· 7 May 2026

కరీంనగర్‌లో హై టెన్షన్.. MLA కౌశిక్ రెడ్డి కారుపై అటాక్!

కరీంనగర్‌లో వార్ హీటెక్కింది. బండి సంజయ్‌పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు నిరసనగా కోపంతో బీజేపీ కార్యకర్తలు గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌తో పాటు, కౌశిక్ రెడ్డి కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. దీంతో అక్కడ ఫుల్ టెన్షన్ మొదలైంది. పోలీసులు వెంటనే ఎంట్రీ ఇచ్చి పరిస్థితిని కంట్రోల్ చేస్తున్నారు. ప్రెసెంట్ BRS మరియు BJP మధ్య గట్టిగా పొలిటికల్ వార్ నడుస్తోంది.

118 మంది సంఖ్యాబలం ఉండాలన్న గవర్నర్
Politics· 7 May 2026

118 మంది సంఖ్యాబలం ఉండాలన్న గవర్నర్

తమిళనాడులో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ మళ్లీ షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యాబలం ఉందా అని తనను కలిసిన విజయ్ ని ప్రశ్నించారు. దాదాపు 40 నిముషాలసేపు గవర్నర్ తో విజయ్ భేటీ అయ్యారు. మరోవైపు విజయ్ కు కాంగ్రెస్, వీసీకే మద్దతు ప్రకటించాయి. వామపక్షాలు కూడా కలిసే ఛాన్స్ ఉంది.

శ్రీతేజ ఇంటికి అల్లు అరవింద్, స్నేహారెడ్డి!▶
Politics· 7 May 2026

శ్రీతేజ ఇంటికి అల్లు అరవింద్, స్నేహారెడ్డి!

పుష్ప-2 రిలీజ్ రోజు జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ గాయపడిన విషయం తెలిసిందే. rescentగా అల్లు అరవింద్, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి శ్రీతేజ ఇంటికి వెళ్లి వాళ్ళ ఫ్యామిలీని కలిసి బారోసా ఇచ్చారు. శ్రీతేజ హెల్త్ కండిషన్ అడిగి తెలుసుకున్నారు. అలాగే, శ్రీతేజ సిస్టర్ స్టడీస్ responcibility మొత్తం తామే చూసుకుంటామని అల్లు అరవింద్ బారోసా ఇచ్చారు.

తమిళనాడులో హైడ్రామా, గవర్నర్ అపాయింట్ మెంట్ కోరిన‌ పళనిస్వామి
Politics· 7 May 2026

తమిళనాడులో హైడ్రామా, గవర్నర్ అపాయింట్ మెంట్ కోరిన‌ పళనిస్వామి

తమిళనాడు పాలిటిక్స్ క్షణం‌ క్షణం మలుపు తిరుగుతున్నాయి.‌ విజయ్ గవర్నర్ ని కలవడానికి వెళితే మరోవైపు పళనిస్వామి గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. సీపీఐ విజయ్ కి ప్రభుత్వం ఏర్పాటుకి ఛాన్స్ ఇచ్చి బలపరీక్ష జరిపించాలని కోరింది. విజయ్ కి మద్దతు ఇచ్చే అంశంలో తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని సీపీఎం తెలిపింది. రెండు సీట్లున్న వీసీకే విజయ్ కి మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చింది.

మామిడి పండ్లు చూస్తే నోరూరుతుంది.. తింటే ప్రాణం రిస్క్ లో పడుతుంది!
Politics· 7 May 2026

మామిడి పండ్లు చూస్తే నోరూరుతుంది.. తింటే ప్రాణం రిస్క్ లో పడుతుంది!

సమ్మర్ వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సందడి మొదలవుతుంది. కానీ కొందరు వ్యాపారులు లాభాల కోసం Calcium Carbide వాడుతూ మామిడి కాయలను పండ్లుగా మారుస్తున్నారు. ఇలా కెమికల్స్‌తో పండిన పండ్లు తింటే క్యాన్సర్ లాంటి డేంజర్ రోగాలు వచ్చే Risk ఉంది. అందుకే మామిడి పండ్లు కొనేటప్పుడు చాలా Carefulగా ఉండాలి. నాణ్యత లేని పండ్లు అమ్మే వారిపై ఆఫీసర్స్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పబ్లిక్ కోరుతున్నారు. పండ్లను బాగా కడిగి, చెక్ చేసుకున్నాకే తినండి!

ఆపరేషన్ సిందూర్ కి ఏడాది .. IAF ప్రత్యేక వీడియో▶
General· 7 May 2026

ఆపరేషన్ సిందూర్ కి ఏడాది .. IAF ప్రత్యేక వీడియో

ఆపరేషన్ సిందూర్ కి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. మీరూ చూసేయండి.