Latest

రైల్వే స్టేషన్లలో కీరదోసకాయల స్కామ్!▶
Politics· 8 May 2026

రైల్వే స్టేషన్లలో కీరదోసకాయల స్కామ్!

రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ మీద అమ్మే కీరదోసకాయలు చాలా ఫ్రెష్‌గా, గ్రీన్‌గా కనిపిస్తున్నాయని కొంటున్నారా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్టే! కటిహార్ స్టేషన్‌లో ఒక లేడీ కీరదోసకాయలకు కెమికల్ కలర్ కలుపుతూ అడ్డంగా దొరికిపోయింది. పాత దోసకాయలు కూడా నిగనిగలాడుతూ కనిపించడానికి ఈ టాక్సిక్ Dye వాడుతున్నారు. ఇలాంటి కలర్స్ కలిపిన ఫుడ్ తింటే హెల్త్ ఖరాబవ్వడం ఖాయం. రైల్వే స్టేషన్లలో వెండర్స్ దగ్గర ఏదైనా కొనేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి అంటూ హెల్త్ experts చెప్తున్నారు.

విజయ్ CM అవ్వాలని దేవుడిని ప్రార్థన కోరిన అభిమాని!▶
Politics· 8 May 2026

విజయ్ CM అవ్వాలని దేవుడిని ప్రార్థన కోరిన అభిమాని!

చెన్నైలో దళపతి విజయ్ ఇంటి వద్ద ఒక డై-హార్డ్ ఫ్యాన్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీవీకే (TVK) చీఫ్ విజయ్ ఖచ్చితంగా సీఎం అవ్వాలని, దేవుడి విగ్రహాల ముందు మోకాళ్లపై నిలబడి ఆ అభిమాని ఎమోషనల్‌గా ప్రార్థనలు చేశాడు. "ఎన్ని అడ్డంకులు వచ్చినా విజయ్ అన్నే సీఎం అవుతాడు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ 'మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ' వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఫ్యాన్ పడే ఈ పాజిటివ్ వైబ్స్ చూస్తుంటే విజయ్ క్రేజ్ ఏ లెవల్లో ఉందో అర్థమవుతోంది.

విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత.. లోక్ భవన్ వద్ద ఆందోళనకారుల అరెస్ట్.▶
Politics· 8 May 2026

విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధత.. లోక్ భవన్ వద్ద ఆందోళనకారుల అరెస్ట్.

తమిళనాడులో రాజకీయ సెగలు రాజుకున్నాయి. టీవీకే (TVK) అధినేత విజయ్ ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న సందిగ్ధత నేపథ్యంలో, చెన్నైలోని లోక్ భవన్ వద్ద ఆందోళన చేస్తున్న పార్టీ మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్‌ను ఆహ్వానించాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. గవర్నర్, పార్టీ మధ్య మెజారిటీ నిరూపణపై ప్రతిష్టంభన ఏర్పడటంతో చెన్నైలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి తరలించారు.

విజయ్ CM అవుతున్నారా! గవర్నర్‌తో మూడోసారి మీటింగ్!
Politics· 8 May 2026

విజయ్ CM అవుతున్నారా! గవర్నర్‌తో మూడోసారి మీటింగ్!

తమిళనాడు పాలిటిక్స్‌లో ఇప్పుడు ఫుల్ టెన్షన్ నడుస్తోంది.TVK విజయ్ మూడోసారి గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్‌ను కలవబోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన Full Support దొరకడంతో, మెజారిటీ MLAల మద్దతు letterతో విజయ్ గవర్నర్‌ దగ్గరికి వెళ్తున్నారు. VCK, CPI, CPM పార్టీలు విజయ్‌కి మద్దతు ప్రకటించడంతో మ్యాజిక్ ఫిగర్ దాటేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 4:30 గంటలకు ఈ సస్పెన్స్‌కి తెరపడనుంది. విజయ్ CM అవ్వడం ఇప్పుడు దాదాపు కన్ఫర్మ్ అయ్యేలా కనిపిస్తోంది.

ప్రభుత్వ పాఠశాలలపై నీతి అయోగ్ షాకింగ్ రిపోర్ట్
India· 8 May 2026

ప్రభుత్వ పాఠశాలలపై నీతి అయోగ్ షాకింగ్ రిపోర్ట్

దేశంలో ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితిపై నీతి అయోగ్ షాకింగ్ విషయాలు బయటపెట్టింది. 1.19 లక్షలకుపైగా స్కూళ్లలో కరెంట్ లేదు. 14,500కి పైగా స్కూళ్లలో తాగునీరు సరిగా లేదు. దాదాపు 98 వేల స్కూళ్లలో అమ్మాయిలకి టాయిలెట్ సౌకర్యం లేదు. 61 వేలకు పైగా స్కూలు టాయిలెట్స్ వాడేటట్టుగా లేవు. ఇక చదువు చెప్పే టీచర్ల పరిస్థితి అంతంత మాత్రమే. కేవలం 10 నుంచి 15 శాతం టీచర్లు మాత్రమే తాము చెప్పే సబ్జెక్టులో విద్యార్థుల పాస్ పెర్సంటేజ్ 60శాతం దాటిన వారున్నారు. అందుకే స్కూళ్లలో డ్రాపవుట్లు ఎక్కువైపోయి, ప్రైవేటు స్కూళ్ల వైపు వెళుతున్నారని నీతి అయోగ్ తన నివేదికలో వివరించింది.

పెళ్లి చేసుకున్న సొంత అక్కాతమ్ముళ్లు!
Viral· 8 May 2026

పెళ్లి చేసుకున్న సొంత అక్కాతమ్ముళ్లు!

బెంగళూరు దగ్గర ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. శశికళ, ప్రవీణ్ వరుసకు అక్కాతమ్ముళ్లు, వీరి ఇద్దరి mothers own సిస్టర్స్. వరుసలు మరిచి వీరు 3 ఏళ్లుగా సీక్రెట్ లవ్‌లో ఉన్నారు. శశికళకు ఇంట్లో వాళ్ళు వేరే పెళ్లి సెట్ చేయడంతో, ఈ జంట ఎస్కేప్ అయ్యి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పేరెంట్స్ నుంచి ప్రాణహాని ఉందని పోలీసుల దగ్గరికి వెళ్లారు.

విజయ్ కి మద్దతుగా BJP లీడర్ ఖుష్బూ ట్వీట్!
Politics· 8 May 2026

విజయ్ కి మద్దతుగా BJP లీడర్ ఖుష్బూ ట్వీట్!

తమిళనాడు పాలిటిక్స్‌పై BJP లీడర్ ఖుష్బూ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తమిళనాడు స్టేట్ సిటిజన్‌గా చెప్తున్నా. ప్రజలు వాళ్ళ CMను చూస్ చేసుకున్నారు, కాబట్టి వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళే స్టేట్ ని పాలించాలి అని ఆమె opinion x లో షేర్ చేసుకున్నారు. ఒక పక్క BJP విజయ్ ని CM అవ్వడం ఆపుతుంటే, మరో పక్క అదే పార్టీకి చెందిన ఖుష్బూ ఇలా ఇండైరెక్ట్‌గా విజయ్‌కి సపోర్ట్ ఇవ్వడంపై పెద్ద చర్చ నడుస్తోంది.

విజయ్‌కు చెక్ పెట్టడానికి బద్ధ శత్రువులు ఒక్కటవుతారా ?
Politics· 8 May 2026

విజయ్‌కు చెక్ పెట్టడానికి బద్ధ శత్రువులు ఒక్కటవుతారా ?

తమిళనాడులో రాజకీయం రోజుకొకలా మారుతోంది. ఒకే ఒక్కడు విజయ్ ని సీఎం కాకుండా అడ్డుకోవడానికి బద్ధశత్రువులైన DMK, AIADMK చేతులు కలిపేలా కనిపిస్తున్నాయి. AIADMKతో పొత్తుకి డీఎంకే ఒకే ఒక్క కండిషన్ పెట్టింది. మతతత్వ పార్టీ అయిన బీజేపీని వీడితే మద్దతు ఇస్తామని చెబుతోందని పార్టీ వర్గాల్ని ప్రస్తావిస్తూ నేషనల్ మీడియా కథనాలు రాస్తోంది. మరోవైపు డీఎంకే కూటమిలో ఉన్న లెఫ్ట్ పార్టీలు ఏఐఏడీఎంకేతో కలవడానికి సిద్ధంగా లేవు. ఇవాళ మధ్యాహ్నం సమావేశమై వామపక్ష పార్టీలు తుది నిర్ణయం తీసుకోనున్నాయి.

క్యాబ్ డ్రైవర్లంటే చిన్నచూపా?▶
News· 8 May 2026

క్యాబ్ డ్రైవర్లంటే చిన్నచూపా?

ఒక అమ్మాయి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తూ, మధ్యలో కారు ఆపించి చాలా సేపు బయట వెయిట్ చేసింది. ఆ డ్రైవర్ వెయిట్ చేసి వెయిట్ చేసి.. విసిగిపోయి డబ్బులు అడగగానే, ఆ అమ్మాయి మనీ ఇవ్వకుండా argument స్టార్ట్ చేసి, వేరే క్యాబ్ బుక్ చేసుకొని అక్కడనుండి వెళ్లిపోవడానికి ట్రై చేసింది. ఇప్పుడు ఈ వీడియొ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది, డ్రైవర్లకి కూడా ఫ్యామిలీ responsibilities ఉంటాయి, వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి అని పబ్లిక్ ఆమె పై ఫైర్ అవుతున్నారు.

IPS వైఫ్ ను చంపేసిన పనిమనిషి!
Crime· 8 May 2026

IPS వైఫ్ ను చంపేసిన పనిమనిషి!

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఒక షాకింగ్ మర్డర్ జరిగింది. రిటైర్డ్ IPS వినయ్ రంజన్ వైఫ్ ని వాళ్ళ ఇంట్లోనే పనిమనిషి చంపేసినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పాట్‌కు వెళ్లి కేసు బుక్ చేశారు. అసలు ఆ పనిమనిషి ఎందుకు చంపాడు? ఈ మర్డర్ వెనుక ఉన్న అసలు రీసన్ ఏంటి? అనే దానిపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.

డ్రైవర్ లేని ట్యాక్సీలో హీరోయిన్ మీనా రైడ్..▶
Viral· 8 May 2026

డ్రైవర్ లేని ట్యాక్సీలో హీరోయిన్ మీనా రైడ్..

హీరోయిన్ మీనా రీసెంట్‌గా ఒక క్రేజీ ఎక్స్‌పీరియన్స్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. డ్రైవర్ లేని ఆటోమేటిక్ ట్యాక్సీలో ఆమె వెళ్లారు. టెక్నాలజీని నమ్మి వ్యూని ఎంజాయ్ చేస్తున్నా అంటూ ఆమె పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

ఫ్లిప్‌కార్ట్ మైండ్ బ్లోయింగ్ యాడ్: కవలలతో డబుల్ ధమాకా సేల్ ▶
Business· 8 May 2026

ఫ్లిప్‌కార్ట్ మైండ్ బ్లోయింగ్ యాడ్: కవలలతో డబుల్ ధమాకా సేల్

ఒక్కసారి ఈ యాడ్ చూడండి. కేరళలోని ట్విన్ టౌన్ అని పిలుచుకునే కొడిన్హిని ఫ్లిప్‌కార్ట్ తన ప్రమోషన్ కోసం భలే వాడేసింది. ఆ గ్రామంలో ప్రతి ఐదుగురిలో ఒకరు కవలలే. సమ్మర్ సీజన్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రమోట్ చేస్తూ 'డబుల్ సేల్' పేరుతో క్రేజీ యాడ్ ని రిలీజ్ చేసింది. సేమ్ టు సేమ్ ఒకేలా ఉండే కవలలను చూపిస్తూ డబుల్ ఆఫర్లను హైలైట్ చేయడం నెటిజన్లను ఫిదా చేస్తోంది. బ్రాండ్ ప్రమోషన్ కోసం ఈ వింత గ్రామాన్ని వాడుకున్న ఫ్లిప్‌కార్ట్ ఐడియా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్!

బిర్యానీ, పుచ్చకాయ విషాదం : జింక్ ఫాస్ఫైడ్ ఎందుకంత ప్రమాదం?
Crime· 8 May 2026

బిర్యానీ, పుచ్చకాయ విషాదం : జింక్ ఫాస్ఫైడ్ ఎందుకంత ప్రమాదం?

ముంబైలో కుటుంబం మరణానికి బిర్యానీ, పుచ్చకాయ తినడం కాదని ఎలుకలు మందు అని తేలింది. దీంతో ఈ ప్రమాదకరమైన జింక్ ఫాస్ఫైడ్ గురించి చర్చ మొదలైంది. ఇది పొట్టలోని యాసిడ్‌తో కలవగానే ఫాస్ఫైన్ అనే విషవాయువును విడుదల చేస్తుంది. తిన్న ఆహారం వల్ల యాసిడ్ పెరిగి, ఈ గ్యాస్ మరింత వేగంగా వ్యాపిస్తుంది. దీనికి ప్రపంచంలోనే యాంటీడోట్ అంటే విరుగుడు మందు లేదు. ఎలుకలు ముందు తిన్న వెంటనే కొబ్బరి నూనె తాగించి స్టమక్ వాష్ చేయడం వల్ల విషం రక్తంలో కలవకుండా కొంతవరకు అడ్డుకోవచ్చు.అందుకే ఎలుకల మందు వాడేటప్పుడు మనం తినే ఆహార పదార్థాల విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం

సముద్రం మధ్యలో హంటా వైరస్ కలకలం..ఆ క్రూయిజ్ లు ఇద్దరు ఇండియన్స్
Health· 8 May 2026

సముద్రం మధ్యలో హంటా వైరస్ కలకలం..ఆ క్రూయిజ్ లు ఇద్దరు ఇండియన్స్

అర్జెంటీనా నుంచి బయలుదేరిన MV హోండియస్ అనే క్రూయిజ్ షిప్ లో హంటా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 8 మందికి ఈ వైరస్ సోకగా, అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. అయితే, ఈసారి 'ఆండీస్ వైరస్' రకం వల్ల మనుషుల నుంచి మనుషులకు కూడా సోకే అవకాశం ఉందని WHO ఆందోళనగా ఉంది. ఆ షిప్ లో 149 మంది ప్రయాణికులుంటే అందులో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. ఈ షిప్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. ప్రపంచదేశాలకు ముప్పు అంతగా లేకపోయినా అందరూ జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరించింది.

మహువా మోయిత్రాకు ఇండిగో ఫ్లైట్‌లో వేధింపులు▶
Crime· 8 May 2026

మహువా మోయిత్రాకు ఇండిగో ఫ్లైట్‌లో వేధింపులు

కోల్‌కతా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ (6E-2476)లో టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాకు చేదు అనుభవం ఎదురైంది. కొందరు ప్రయాణికులు ఆమెను ఉద్దేశించి 'చోర్ చోర్' అని నినాదాలు చేస్తూ హేళన చేశారు. దీనిపై ఆమె ఇండిగో యాజమాన్యానికి, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రయాణికుల భద్రత, విమానయాన నిబంధనల ఉల్లంఘనపై విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.

 ముంబై పుచ్చకాయ మృతులపై జరిగింది  విష ప్రయోగమే !
Politics· 7 May 2026

ముంబై పుచ్చకాయ మృతులపై జరిగింది విష ప్రయోగమే !

ముంబైలో వాటర్ మిలన్ తిని చనిపోయిన కుటుంబానిది విషప్రయోగమేనని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. పుచ్చకాయలోనూ, మృతుల బాడీలలోనూ ఎలుక విషం అవశేషాలు కనిపించాయని నిపుణులు తెలిపారు. బంధువులతో కలసి పార్టీ చేసుకుని మటన్ పులావ్ ఆరగించిన ఆ కుటుంబం రాత్రి 12 గంటల వేళ పుచ్చకాయతిన్నారని, తిన్నవెంటనే తీవ్రమైన వాంతులు, విరేచనాలతో వారంతా మరణించారని పోలీసుల విచారణలో తేలింది. మరి కావాలని ఆత్మ హత్య చేసుకున్నారా? లేక ఎవరైనా విష ప్రయోగం చేశారా అన్నది తేలాల్సి ఉంది.

నేను ఆరోజు బ్రోతల్ కీపర్ గా వెళ్లా- సుమతి
Crime· 7 May 2026

నేను ఆరోజు బ్రోతల్ కీపర్ గా వెళ్లా- సుమతి

పోకిరీల ఆట కట్టించడానికి అర్ధరాత్రి స్టింగ్ ఆపరేషన్ చేసిన మల్కాజ్ గిరి ఐపీఎస్ సుమతి తాను ఆరోజు బ్రోతల్ కీపర్ గా వెళ్లినట్లు తెలిపారు. హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ లో అసాంఘీక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు వెళ్లిన తాను రెండు గంటలు 40 మంది పోకిరీలతో నానా ఇబ్బందులు పడ్డానన్నారు. తాను అమ్మాయిల సప్లయర్ గా వారికి చెప్పగా ఒకడు అప్పటికప్పుడు వాళ్ల దగ్గరకు తీసుకెళ్లమని వత్తిడి చేశాడని రెండు గంటలు చాలా ఇబ్బంది పడినట్లు సుమతి వివరించారు.

 బెంగాల్ అసెంబ్లీ రద్దు- గవర్నర్ ప్రకటన
Politics· 7 May 2026

బెంగాల్ అసెంబ్లీ రద్దు- గవర్నర్ ప్రకటన

పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ ఆర్. ఎన్. రవి ఉత్తర్వులిచ్చారు. అసెంబ్లీ గడువు ఈ రాత్రితో ముగుస్తుండటం, మరోవైపు మమత రాజీనామా చేసేందుకు తిరస్కరించడంతో గవర్నర్ ఈ యాక్షన్ తీసుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 172 ప్రకారం అయిదేళ్ల గడువు పూర్తయ్యాక అసెంబ్లీ రద్దవుతుందని, కొత్త ప్రభుత్వం పవర్ లోకి వచ్చే వరకూ అధికారంలో ఉన్న మంత్రులు ఆపద్ధర్మ మంత్రులు అవుతారు. గవర్నర్ ఈరూల్స్ కోట్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

అప్పుడు మస్క్  ఓన్లీ Sperm Donor మాత్రమే!
Viral· 7 May 2026

అప్పుడు మస్క్ ఓన్లీ Sperm Donor మాత్రమే!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పర్సనల్ లైఫ్ గురించి అతని వైఫ్ శివోన్ జిలిస్ కోర్టులో కొన్ని సెన్సేషనల్ సెక్రేట్స్ బయటపెట్టారు. 2020లో తాను మదర్ కావాలనుకున్నప్పుడు మస్క్ ఓన్లీ Sperm Donorగా మాత్రమే హెల్ప్ చేశారని, అప్పట్లో వాళ్ళ మధ్య ఎలాంటి లవ్ లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. హెల్త్ ఇష్యూస్ వల్ల marriage ki బదులు ఇలా పిల్లల్ని కనాలని డిసైడ్ అయ్యానని, మస్క్ కోరిక మేరకే ఈ విషయాన్ని ఇన్నాళ్లూ సీక్రెట్‌గా ఉంచామని చెప్పారు. ప్రెసెంట్ వీరికి నలుగురు పిల్లలు. ఇప్పుడు మస్క్ వారితో రెగ్యులర్‌గా టైం స్పెండ్ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. సొ ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

ఫ్లైట్‌లో చహల్ సిగరెట్ తాగుతూ దొరికిపోయాడు!▶
Sports· 7 May 2026

ఫ్లైట్‌లో చహల్ సిగరెట్ తాగుతూ దొరికిపోయాడు!

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ చహల్ ఇప్పుడు రిస్క్ లో పడ్డాడు. ఫ్లైట్‌లో వెళ్తున్నపుడు చహల్ సిగరెట్ తాగుతూ కెమెరాకు దొరికిపోయాడు. ఫ్లైట్‌లో ఇలాంటివి చేయడం కంప్లీట్‌గా బ్యాన్ అని తెలిసి కూడా చహల్ ఇలా చేశారు. అంతకుముందు రియాన్ పరాగ్ కూడా సేమ్ ఇలాగే దొరికిపోయాడు, ఇప్పుడు చహల్ కూడా అదే రిపీట్ చేశాడు. రూల్స్ బ్రేక్ చేసిన ఈ సీనియర్ ప్లేయర్‌పై బీసీసీఐ ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటుందో అని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు.

AP లోని ధర్మవరంలో ATM దోపిడీ!▶
Crime· 7 May 2026

AP లోని ధర్మవరంలో ATM దోపిడీ!

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బుధవారం తెల్లవారుజామున ముగ్గురు ముసుగు దొంగలు బీభత్సం సృష్టించారు. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఏటీఎంను ఇనుప రాడ్లతో పగలగొట్టడానికి ప్రయత్నించి, విఫలమవ్వడంతో వినూత్నంగా ఆలోచించారు. ఏటీఎం మిషన్ కు తాళ్లు కట్టి, బొలెరో వాహనంతో లాక్కెళ్లిపోయారు. నిందితులు బత్తలపల్లి వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వింత చోరీ స్థానికంగా కలకలం రేపింది.