చైన్ స్నాచర్ ని పట్టిచ్చిన ఆటో డ్రైవర్!
బేగం బజార్‌లో జరిగిన చైన్ స్నాచింగ్ ఉదంతంలో ఆటో డ్రైవర్ జహీర్ అసలైన హీరోగా నిలిచారు. మంజు ఓమ్లతా అనే మహిళ గొలుసు దొంగిలించడానికి ప్రయత్నించిన రౌడీ షీటర్ సోహెల్‌ను జహీర్ తన ఆటోతో ఢీకొట్టి అడ్డుకున్నారు. నిందితుడు దాడి చేసినా వెనక్కి తగ్గకుండా పోరాడి పోలీసులకు పట్టించారు. జహీర్ సాహసాన్ని గుర్తించిన సీపీ సజ్జనార్ గారు ఆయనను నగదు పురస్కారంతో సన్మానించారు. ఎటువంటి స్వార్థం లేకుండా ప్రాణాలకు తెగించి ఒక అపరిచితురాలిని కాపాడిన జహీర్ అందరికీ ఆదర్శంగా నిలిచారు.



