UP లో ఎన్కౌంటర్లు!

గత 24 గంటల్లో ఉత్తరప్రదేశ్ పోలీసులు నేరగాళ్లపై ఉక్కుపాదం మోపారు. ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగిన ఏడు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో పోలీసులు 10 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది నేరగాళ్ల కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. వీరి నుంచి భారీగా అక్రమ ఆయుధాలు, చోరీ చేసిన నగదు, వెండి ఆభరణాలు మరియు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీలు, హత్యాయత్నాలు మరియు స్మగ్లింగ్‌కు పాల్పడే గ్యాంగ్‌లపై ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.



