Latest

విజయ్ కు ప్రోటోకా్ల్ విత్ డ్రా చేసిన తమిళనాడు పోలీస్ !
ప్రభుత్వ ఏర్పాటులో జరుగుతున్న జాప్యం కారణంగా తనకు ఇచ్చిన ప్రోటోకాల్ ఏదీ ఇప్పట్లో వద్దని టీవీకే చీఫ్ విజయ్ చెప్పినట్లు తెలుస్తోంది.విజయ్ రిక్వెస్ట్ మేరకే ఆయన కిచ్చిన పోలీస్ బందోబస్తు, ప్రోటోకాల్ ను ఉపసంహరించినట్లు తమిళనాడు పోలీసులు చెబుతున్నారు. బుధవారం నుంచి విజయ్ ఎలాంటి ప్రోటోకాల్ లేకుండానే తిరుగుతున్నారు. కేవలం పైలట్ కార్ మినహాయించి మరే ఇతర ప్రోటోకాల్ ఆయన తీసుకోవడం లేదు.
ఫ్రిజ్‌లో ఇవి అస్సలు పెట్టకండి!
ఫుడ్ ఫ్రెష్‌గా ఉంటుందని మనం దేన్నైనా ఫ్రిజ్‌లో పెట్టేస్తాం, కానీ అలా పెట్టడం చాలా పెద్ద మిస్టేక్. ముఖ్యంగా ఉల్లిపాయలు, వెల్లుల్లి, బంగాళాదుంపలు ఫ్రిజ్‌లో పెడితే వీటిపై భయంకరమైన Fungus వస్తుంది. ఇలాంటి ఫుడ్ తింటే తెలియకుండానే Food Poison అయ్యి హాస్పిటల్ పాలు కావాల్సి వస్తుంది. మనం చేసే ఈ చిన్న మిస్టేక్ మన హెల్త్‌ని దారుణంగా పాడు చేస్తుంది. అందుకే దేన్నైనా స్టోర్ చేసే ముందు చాలా Careful గా ఉండండి. ఇప్పటికైనా Alert గా ఉండండి.

118 మంది సంతకాలతో రండి- విజయ్ కు గవర్నర్ మెలిక !
118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో మళ్లీ రావాలని టీవీకే చీఫ్ విజయ్‌కు తమిళనాడు గవర్నర్ సూచించారు..! వరుసగా రెండోరోజు విజయ్ వెనుదిరగాల్సి వచ్చింది. గవర్నర్ తీరు పై ఓ రేంజ్లో సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు . తమిళనాడు గవర్నర్ బీజేపి మాజీ నేత . కాబట్టి విజయ్ సీఎం అవడం ఇష్టం లేనట్లుంది అంటూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ సెటైర్లు వేశారు. .. బీజేపీఆ పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యేతో గేమ్ ఆడుతోంది. మెజార్టీ ప్రజలు ఓటేసిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడం నేరం' అని మండిపడ్డారు.
అబ్బాయిని ప్రేమించింది.. తర్వాత వరకట్న వేధింపులకు బలైంది!
యూపీలోని ఘాజీపూర్‌లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ప్రియా విశ్వకర్మ అనే అమ్మాయి అభిషేక్ అనే అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత అత్తగారి ఇంటికి వెళ్ళాక ఆమెకు నరకం చూపించారు. అదనపు వరకట్నం కావాలని టార్చర్ పెడుతూ. ఆమె భర్త, బావ, అత్త కలిసి విపరీతంగా కొట్టారు. కట్నం తీస్కురాకపోతే తన ఫ్యామిలీని కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఆడపిల్లలకు సేఫ్టీ ఎక్కడ అని పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు.

విజయ్‌కు సపోర్ట్‌గా హీరో విశాల్ ట్వీట్! గవర్నర్‌పై ప్రశ్నల వర్షం!
తమిళనాడు పాలిటిక్స్‌లో హీరో విశాల్ విజయ్‌కు సపోర్ట్‌గా ట్వీట్ చేశారు. గతంలో 2017 /18 గోవా, కర్ణాటకలో ఇచ్చినట్టే, TVK అధినేత విజయ్‌కు కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ ఇవ్వాలని గవర్నర్‌ను డిమాండ్ చేశారు. ప్రజల తీర్పును గౌరవించాలని, మాకు కావాల్సింది ప్రభుత్వం కానీ గవర్నర్ పాలన కాదని విశాల్ స్పందించారు. అలాగే విజయ్ ఖచ్చితంగా CM అవుతారని, ఒక ఓటరుగా బలంగా కోరుకుంటున్నట్లు ఆయన post చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సౌత్ కొరియాలో సన్యాసిగా మారిన రోబో!
సౌత్ కొరియాలో ఒక రోబో సన్యాసిగా మారి అందరినీ షాక్ చేస్తుంది. బుద్ధ పూర్ణిమ సందర్భంగా 'గాబి' అనే Humanoid Robot సియోల్‌లోని జోగ్యే టెంపుల్‌లో సందడి చేసింది. ట్రెడిషనల్ బౌద్ధ డ్రెస్ వేసుకున్న ఈ రోబో, మిగతా సన్యాసుల ముందు నిలబడి బౌద్ధమతానికి అంకితమవుతానని Promise చేసింది. దాదాపు 130 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న ఈ రోబోను చూసి పబ్లిక్ ఫిదా అవుతున్నారు.
కరీంనగర్‌లో హై టెన్షన్.. MLA కౌశిక్ రెడ్డి కారుపై అటాక్!
కరీంనగర్‌లో వార్ హీటెక్కింది. బండి సంజయ్‌పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు నిరసనగా కోపంతో బీజేపీ కార్యకర్తలు గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌తో పాటు, కౌశిక్ రెడ్డి కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. దీంతో అక్కడ ఫుల్ టెన్షన్ మొదలైంది. పోలీసులు వెంటనే ఎంట్రీ ఇచ్చి పరిస్థితిని కంట్రోల్ చేస్తున్నారు. ప్రెసెంట్ BRS మరియు BJP మధ్య గట్టిగా పొలిటికల్ వార్ నడుస్తోంది.

118 మంది సంఖ్యాబలం ఉండాలన్న గవర్నర్
తమిళనాడులో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ మళ్లీ షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యాబలం ఉందా అని తనను కలిసిన విజయ్ ని ప్రశ్నించారు. దాదాపు 40 నిముషాలసేపు గవర్నర్ తో విజయ్ భేటీ అయ్యారు. మరోవైపు విజయ్ కు కాంగ్రెస్, వీసీకే మద్దతు ప్రకటించాయి. వామపక్షాలు కూడా కలిసే ఛాన్స్ ఉంది.
శ్రీతేజ ఇంటికి అల్లు అరవింద్, స్నేహారెడ్డి!
పుష్ప-2 రిలీజ్ రోజు జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ గాయపడిన విషయం తెలిసిందే. rescentగా అల్లు అరవింద్, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి శ్రీతేజ ఇంటికి వెళ్లి వాళ్ళ ఫ్యామిలీని కలిసి బారోసా ఇచ్చారు. శ్రీతేజ హెల్త్ కండిషన్ అడిగి తెలుసుకున్నారు. అలాగే, శ్రీతేజ సిస్టర్ స్టడీస్ responcibility మొత్తం తామే చూసుకుంటామని అల్లు అరవింద్ బారోసా ఇచ్చారు.

తమిళనాడులో హైడ్రామా, గవర్నర్ అపాయింట్ మెంట్ కోరిన పళనిస్వామి
తమిళనాడు పాలిటిక్స్ క్షణం క్షణం మలుపు తిరుగుతున్నాయి. విజయ్ గవర్నర్ ని కలవడానికి వెళితే మరోవైపు పళనిస్వామి గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. సీపీఐ విజయ్ కి ప్రభుత్వం ఏర్పాటుకి ఛాన్స్ ఇచ్చి బలపరీక్ష జరిపించాలని కోరింది. విజయ్ కి మద్దతు ఇచ్చే అంశంలో తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని సీపీఎం తెలిపింది. రెండు సీట్లున్న వీసీకే విజయ్ కి మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చింది.

మామిడి పండ్లు చూస్తే నోరూరుతుంది.. తింటే ప్రాణం రిస్క్ లో పడుతుంది!
సమ్మర్ వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సందడి మొదలవుతుంది. కానీ కొందరు వ్యాపారులు లాభాల కోసం Calcium Carbide వాడుతూ మామిడి కాయలను పండ్లుగా మారుస్తున్నారు. ఇలా కెమికల్స్‌తో పండిన పండ్లు తింటే క్యాన్సర్ లాంటి డేంజర్ రోగాలు వచ్చే Risk ఉంది. అందుకే మామిడి పండ్లు కొనేటప్పుడు చాలా Carefulగా ఉండాలి. నాణ్యత లేని పండ్లు అమ్మే వారిపై ఆఫీసర్స్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పబ్లిక్ కోరుతున్నారు. పండ్లను బాగా కడిగి, చెక్ చేసుకున్నాకే తినండి!
ఆపరేషన్ సిందూర్ కి ఏడాది .. IAF ప్రత్యేక వీడియో
ఆపరేషన్ సిందూర్ కి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. మీరూ చూసేయండి.

విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి : సహకరిస్తామన్న స్టాలిన్
తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాము సహకరిస్తామని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం రాకూడదనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని టైమ్స్ ఆఫ్ ఇండియాకి చెప్పారు. విజయ్ పార్టీ 10 సీట్ల దూరంలో నిలిచిపోవడంతో డీఎంకే, ఏఐడీఎంకేలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయన్న ఊహాగానాలకు స్టాలిన్ తెరదించారు. ఏఐఏడీఎంకే బీజేపీ కలిసి విజయ్ ని సీఎం కాకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాము పడగొట్టాలని అనుకోమని, అయితే ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ నెరవేర్చాలని అన్నారు.

ఎయిర్ ఫోర్స్ నుంచి సువేందు షాడో వరకు.. ఎవరీ చంద్రనాథ్ రథ్
సువేందు అధికారి PA చంద్రనాథ్ రథ్ నేపథ్యం చాలా ఆసక్తికరమైంది. IAFలో 20ఏళ్లు పనిచేసి రిటైర్ అయ్యాక రాజకీయాల్లోకి వచ్చారు. 2019 నుండి సువేందు అధికారికి అత్యంత నమ్మకస్తుడిగా ఒక నీడలా ఉన్నారు. ఎన్నికల వ్యూహాలు, సమన్వయ బాధ్యతలు చూస్తూ ట్రబుల్ షూటర్ గా మారారు. రామకృష్ణ మిషన్ ఆశయాలతో ప్రభావితుడైన చంద్రనాథ్ Soft Spoken వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. సువేందు అధికారి కుటుంబానికి, రథ్ కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉంది. చంద్రనాథ్ మరణంతో సువేందు అధికారికి కుడిభుజం కోల్పోయినట్టయింది.

సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. బెంగాల్‌లో కొనసాగుతున్న హింస
పశ్చిమ బెంగాల్ భగ్గుమంటోంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక బీజేపీ, టీఎంసీ మధ్య ఘర్షణలు తారా స్థాయికి చేరుకున్నాయి. బీజేపీ సీఎం అభ్యర్థి రేసులో ముందున్న సువేందు అధికారి PA చంద్రనాథ్ రథ్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బుధవారం రాత్రి మధ్యమ్‌గ్రామ్ సమీపంలో కారులో వెళ్తుండగా బైక్‌పై వచ్చి అతి సమీపం నుంచి ఆయన్ని కాల్చి చంపారు. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. టీఎంసీ ప్రీ ప్లాన్డ్ గా తన పీఏని చంపేసిందని సువేందు అధికారి ఆరోపించారు.

విజయ్ సపోర్ట్ కు నో చెప్పిన కమ్యూనిస్టులు !
టీవీకే అధినేత విజయ్ ప్రమాణస్వీకారం రద్దయ్యింది. తిరిగి ఆదేశాలు ఇచ్చే వరకూ రిసార్టు లోనే ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. రేపు ఉదయం 11.30కి ఆయన ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉన్నా గవర్నర్ మెజారిటీ లేదని రిజెక్ట్ చేశారు. కాంగ్రెస్ మద్దతుతో కలిపి విజయ్ కు 112 మంది మాత్రమే ఉన్నారు. మేజిక్ ఫిగర్ కు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు అవసరమవుతారు.అన్నా డీఎంకే పళని స్వామి మద్దతు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. లెఫ్ట్ పార్టీలు తాము సపోర్ట్ చేయలేమని చేతులెత్తేశాయి. రేపు ప్రమాణ స్వీకారంలోగా ఏదో రకంగా మద్దతు కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఐ ప్యాక్ సేవలకు గుడ్ బై కొట్టేసిన అఖిలేష్ యాదవ్
డీఎంకే, టీఎంసీ పార్టీల ఓటమి చూశాక సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మనసు మార్చుకున్నారు. 2027 యూపీ ఎన్నికల కోసం ఐ ప్యాక్ టీమ్ తో కుదిరిన కాంట్రాక్ట్ ను రద్దు చేసుకున్నారు తమ దగ్గర ఫండ్స్ లేవని పైకి చెబుతున్నా ఆ రెండు రాష్ట్రాల్లో ఐ ప్యాక్ ఫెయిల్ అవడం వల్ల అఖిలేష్ డెసిషన్ మార్చుకున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ , కౌ ఫౌండర్ వినేష్ చందర్ ను ఈడీ అధికారులు కోల్ స్కామ్ కేసులో అరెస్టు చేయడం కూడా ఒక రీజన్ కావచ్చు. తమిళనాడు, బెంగాల్ రెంటిలోనూ అధికార పార్టీలు దారుణమైన ఓటమిని చూశాయి.

నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు! DGPకి CM వార్నింగ్!
CM రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ వల్ల సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదని క్లియర్‌గా చెప్పారు. ఇవాళ ఢిల్లీ వెళ్తున్నప్పుడు ఎయిర్‌పోర్ట్ దగ్గర vehicles ఆపేయడం పై ఆయన Serious అయ్యారు. CM వెళ్తున్నప్పుడు రోడ్లు బ్లాక్ చేయకుండా, సింగిల్ లైన్ రోడ్డు వాడాలని సూచించారు. నెగ్లెక్ట్ గా వ్యవహరించే ఆఫీసర్స్ పై action తీసుకోవాలని DGPని ఆదేశించారు. త్వరలోనే స్టేట్ వైడ్ Traffic Bureau కూడా ఏర్పాటు చేయబోతున్నారు.

విజయ్‌కు గవర్నర్ షాక్! 118 మంది MLAలు ఉంటేనే CM సీటు!
TVK చీఫ్ విజయ్‌కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ బిగ్ షాక్ ఇచ్చారు. governament form చేయడానికి కావాల్సిన 118 మంది MLA లని విజయ్ ఇంకా చూపించలేకపోయారు. ప్రెసెంట్ కాంగ్రెస్‌తో కలిపి విజయ్ దగ్గర 112 మంది MLAలు మాత్రమే ఉన్నారు. మెజారిటీకి ఇంకా 6 మంది MLAలు తక్కువగా ఉండటంతో గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో విజయ్ CM అయ్యే విషయంపై present Suspense కొనసాగుతోంది.

ముంబై టీమ్‌లో హార్దిక్ పాండ్య ను కెప్టెన్సీ నుంచి తీసేశారా?
IPL 2026లో ముంబై ఇండియన్స్ టీమ్‌లో ఏం జరుగుతుందో అర్థం కాక ఫ్యాన్స్ Full Confuse అవుతున్నారు. మే 10న RCBతో మ్యాచ్ కోసం MI ప్లేయర్స్ అంతా రాయ్‌పుర్ వెళ్లారు, కానీ హార్దిక్ పాండ్య ఎయిర్‌పోర్ట్‌లో కనిపించలేదు. లాస్ట్ మ్యాచ్‌లో హార్దిక్ లేకపోయినా సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమ్ అద్భుతంగా ఆడి గెలిచింది. దీంతో హార్దిక్‌ను కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టారా అనే డౌట్ అందరిలో స్టార్ట్ అయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో కూడా హార్దిక్ Performance దారుణంగా ఉండటంతో మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుందా అని చర్చ నడుస్తోంది.

కాషాయం కట్టుకున్న భారత్.. తగ్గిపోతున్న ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య
పశ్చిమ బెంగాల్, అసోంలో విజయంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే దేశంలో 22 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. దీంతో ఇండియన్ పొలిటికల్ ఫేస్ మారిపోతోంది. అసెంబ్లీలలో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోవడం కనిపిస్తోంది. 2013లో ముస్లిం ఎమ్మెల్యేలు 339 మంది ఉంటే, ఇప్పుడు వారి సంఖ్య 282కి పడిపోయింది. యూపీలో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య 63 నుండి 31కి తగ్గితే పశ్చిమ బెంగాల్‌లో 59 నుండి 37కి, బీహార్19 నుండి 11కి , రాజస్థాన్11 నుండి 6కి తగ్గింది. మొత్తం ఏడు రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిమ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరు.