మల్కాజిగిరి SP సాహసం: అర్ధరాత్రి మారువేషంలో రోడ్డుపైకి ఐపీఎస్ సుమతి.
మల్కాజిగిరి సీపీ ఐపీఎస్ సుమతి గారు అర్ధరాత్రి దిల్‍సుఖ్ నగర్ బస్టాప్‌లో మారువేషంలో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. రాత్రి 12:30 నుండి 3:30 వరకు ఆమె సామాన్య మహిళలా వేచి ఉండగా, సుమారు 40 మంది ఆకతాయిలు ఆమెను అసభ్య పదజాలంతో వేధించారు. ఆమె సిగ్నల్ ఇవ్వగానే పోలీసులు వారిని పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. మహిళల భద్రత కోసం 25 ఏళ్ల క్రితం కాజీపేటలో కూడా ఆమె ఇలాంటి ఆపరేషన్ నిర్వహించడం విశేషం. ఈ ఘటన వేధింపుదారులకు గట్టి హెచ్చరికగా నిలిచింది.



