Latest

 ఏపి బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత, ఓ ఆక్వారైతు ఆక్రందన ▶
AP· 28 Apr 2026

ఏపి బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత, ఓ ఆక్వారైతు ఆక్రందన

ఏపీలో ప్రధాన బంకుల్లో పెట్రోల్ , డీజిల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఎక్కడ చూసినా బంకుల దగ్గర చాంతాడంత క్యూ కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల బంకులను డీజిల్ లేక మూసేస్తున్నారు.అనేక చోట్ల రూల్స్ పాటించని బంకులను అధికారులు సీజ్ చేస్తున్నారు.పల్నాడు జిల్లాలో మూడు,నర్సరావు పేట, పిడుగురాళ్ల, చిలకలూరి పేటల్లో బంకులను సీజ్ చేశారు. ఇటీవల ఓ బంకు దగ్గర ఆక్వారైతన్న 500 రూ. ల విలువైన డీజిల్ పోయండి. నా రొయ్య పిల్లలు చనిపోతాయంటూ ఆవేదన వ్యక్తం చేసిన వీడియో వైరల్ గా మారుతోంది.

ప్లైట్స్ ఆపేస్తాం - ఇండియన్ ఎయిర్ లైన్స్ వార్నింగ్
General· 28 Apr 2026

ప్లైట్స్ ఆపేస్తాం - ఇండియన్ ఎయిర్ లైన్స్ వార్నింగ్

పెరిగిన ఆయిల్ ధరలు (ATF prices) వార్ ఎఫెక్ట్ కారణంగా జర్నీకి లాంగర్ రూట్స్ ఎంచుకోవచడం వల్ల ఇండియన్ ఎయిర్‌లైన్స్ క్రైసిస్ లో పడిపోతోంది. Air India, IndiGo మరియు SpiceJet తమ యాక్టివిటీ నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన పడుతు న్నాయి. ప్రభుత్వం అర్జెంట్ గా జోక్యం చేసుకోవాలని కోరుతున్నాయి. ఈ నష్టాల నుండి బయటపడేందుకు Federation of Indian Airlines (FIA) సివిలేవియేషన్ శాఖకు ఎమర్జెన్సీ నోట్ రాసింది.

ముంబై రోడ్లపై బర్త్ డే రీల్  ఫైర్ !!-నిందితుడు అరెస్ట్
Crime· 28 Apr 2026

ముంబై రోడ్లపై బర్త్ డే రీల్ ఫైర్ !!-నిందితుడు అరెస్ట్

బర్త్ డే సెలబ్రేషన్ పేరుతో ముంబైలో ఓ ఆటో డీలర్ రోడ్డుపై తన ఏజ్ ను వేసి దానికి నిప్పంటించి ఇన్ స్టా గ్రామ్ రీల్ చేశాడు. ఆ ఆటో డీలర్ వయసు 33 కావడంతో 33 ఆకారంలో పెట్రోల్ పోసి దానికి నిప్పంటించి రీల్ షూట్ చేసి అప్ లోడ్ చేశాడు. ఆన్లైన్ లో వైరల్ అయిన దానిని చూసిన ముంబై గురేగావ్ పోలీసులు ఆ డీలర్ ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆ మంటల ధాటికి రోడ్డు పాడైపోయింది. లోకల్స్ అనేకమంది చాలా ఇబ్బంది కూడా పడ్డారు. బర్త్ డే వీడియోపై నెటిజన్లు ఏకి పారేశారు.

అమరావతి టు హైదరాబాద్ ఇక 70 నిమిషాల్లో !!
Politics· 28 Apr 2026

అమరావతి టు హైదరాబాద్ ఇక 70 నిమిషాల్లో !!

మోడీ ప్రభుత్వానికి దక్షిణాది అంటే చిన్న చూపు కాదని ప్రేమ అనీ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కామెంట్ చేశారు. హై స్పీడ్ డైమండ్ పేరుతో దక్షిణాదిన ఇక బుల్లెట్ రైళ్లు దూసుకు పోతాయ న్నారు. ఇంపార్టెంట్ సిటీస్ మధ్య బుల్లెట్ రైల్ కనెక్షన్ పెరుగుతుందన్నారు. అమరావతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వీటి మధ్య ఈ రైళ్లు నడుస్తాయ న్నారు. కేవలం 70 నిమిషాల్లో అమరా వతినుంచి హైదరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ లో రావొచ్చునన్నారు. విపక్షాల విమర్శలను డెవలప్ మెంట్ తో తిప్పి కొడతామన్నారు.గూగుల్ డేటా సెంటర్ శంకుస్థా పనలో ఈ మేటర్ చెప్పారు.

తెలంగాణలో వడదెబ్బకు నలుగురు బలి!
News· 28 Apr 2026

తెలంగాణలో వడదెబ్బకు నలుగురు బలి!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్‌లో 46 Degrees టెంపరేచర్ నమోదైంది. ఈ వడదెబ్బ కారణంగా ముగ్గురు చనిపోగా, పిడుగుపడి మరొకరు చనిపోయారు. afternoon ఎండలో బైటికి రావద్దని, తగినంత వాటర్ తాగుతూ సేఫ్ గా ఉండమని డాక్టర్స్ చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది.

యుద్ధం ఎఫెక్ట్- ప్రభుత్వం ఆదుకోకుంటే ఫ్లైట్స్ ఆపేస్తాం!
World· 28 Apr 2026

యుద్ధం ఎఫెక్ట్- ప్రభుత్వం ఆదుకోకుంటే ఫ్లైట్స్ ఆపేస్తాం!

విమానాల్లో వాడే ఇంధనం రేట్స్ విపరీతంగా పెరగడంతో ఎయిర్ ఇండియా, ఇండిగో కంపెనీలు భారీ నష్టాల్లో ఉన్నాయి. వార్ కారణంగా రేట్స్ పెరగడంతో ఫ్లైట్స్ నడపడం చాలా కష్టంగా మారింది. గవర్నమెంట్ మాకు హెల్ప్ చేయకపోతే కంపెనీలు క్లోస్ చేయాల్సి వస్తుంది అని ఏయిర్ లైన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ఫైనాన్షియల్ హెల్ప్ చేయమని సెంట్రల్ కి లెటర్ రాశారు.

రక్తపు మడుగులో యువతి డెడ్ బాడి!
Crime· 28 Apr 2026

రక్తపు మడుగులో యువతి డెడ్ బాడి!

బెంగళూరులోని ఒక అపార్ట్‌మెంట్‌లో జార్ఖండ్‌కు చెందిన 34years పూజా దత్తా నగ్నంగా, రక్తపు మడుగులో శవమై కనిపించింది. ఫ్లాట్ నుంచి బ్యాడ్ స్మెల్ రావడంతో పోలీసులు డోర్స్ బ్రేక్ చేసి చూడగా ఈ దారుణం బయటపడింది. రూమ్ లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆమె Suicide చేసుకుందా లేక ఎవరైనా Murder చేశారా అనే angleలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

Overthinking వల్ల బీపీ పెరుగుతుందా?
Health· 28 Apr 2026

Overthinking వల్ల బీపీ పెరుగుతుందా?

Overthinking అండ్ మెంటల్ స్ట్రెస్ వల్ల బాడి లో కొన్ని హార్మోన్లు రిలీస్ అయి హార్ట్ స్పీడ్ పెరుగుతుంది. దీనివల్ల Blood Pressure పెరిగే అవకాశం ఉందని డాక్టర్స్ వార్నింగ్ ఇస్తున్నారు. Overthinking ఇలాగే ఎప్పుడు కంటిన్యూ ఔతే హార్ట్ ప్రాబ్లమ్స్ రావొచ్చు. కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి డైలీ 30 మినేట్స్ ఎక్సర్‌సైజ్, గుడ్ స్లీప్ అండ్ పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం.

సమ్మర్‌లో మొక్కలకి ఎప్పుడు నీళ్లు పోయాలి?
Viral· 28 Apr 2026

సమ్మర్‌లో మొక్కలకి ఎప్పుడు నీళ్లు పోయాలి?

సమ్మర్‌లో మొక్కలకి ఎప్పుడు పడితే అప్పుడు వాటర్ పోయకూడదు. ఎర్లీ మార్నింగ్ వాటర్ పోయడం చాలా మంచిది. అప్పుడు ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి వేర్లు వాటర్ ని బాగా పీల్చుకుంటాయి. సాయంత్రం పోస్తే రాత్రంతా ఆ తడి వల్ల మొక్కలకి ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరీ మట్టి ఎండిపోతే తప్ప సాయంత్రం పోయకండి. మీ మొక్కలు పచ్చగా ఉండాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి!

రిజల్ట్స్ రాకముందే రిలాక్స్ అవుతున్న సీఎం స్టాలిన!
Entertainment· 28 Apr 2026

రిజల్ట్స్ రాకముందే రిలాక్స్ అవుతున్న సీఎం స్టాలిన!

తమిళనాడు అసెంబ్లీ ఎలెక్షన్స్ పోలింగ్ క్లోస్ అవ్వడం తో, CM స్టాలిన్ కొడైకెనాల్‌లో రిలాక్స్ అవుతున్నాడు. ఫ్యామిలీతో కలిసి కొడైకెనాల్ వెళ్లిన ఆయన, అక్కడ లేక్ దగ్గర సైక్లింగ్ చేస్తూ సందడి చేశారు. స్నో లో వాకింగ్ చేస్తూ టూరిస్ట్ తో సరదాగా Selfies దిగారు. మే 4th రిజల్ట్స్, ఈ గ్యాప్ లో చిన్న Holiday Break ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

మతం అడిగి మరీ దాడి!
Crime· 28 Apr 2026

మతం అడిగి మరీ దాడి!

నిన్న ఎర్లీ మార్నింగ్ ముంబై దగ్గర మీరా రోడ్ లో ఒక భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది. జైబ్ జుబైర్ అన్సారీ (31) అనే పర్సన్ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ని (రాజ్కుమార్ మిశ్రా, సుబ్రతో సేన్) కత్తితో పొడిచాడు. ముందుగా వాళ్ళ మతం ఏంటో అడిగి, "కల్మా" చదవమని ఫోర్స్ చేసాడు. వాళ్ళు చదవలేదని కోపంతో వారి మీద అటాక్ చేసాడు. వెంటనే అన్సారీ ని పోలీసులు అరెస్ట్ చేసారు. మిశ్రా కండిషన్ ఇప్పుడు సీరియస్ గా ఉంది. పోలీస్ సోదా లో అన్సారీ ఇంట్లో ISIS అనే ఒక అరబిక్ టెర్రరిస్టు గ్రూప్ వి కొన్ని పేపర్స్ దొరికాయి. అంటే అతను ఒక టెర్రరిస్టు అని అనుమాణిస్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్ర ATS ఈ కేసు ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

ఖైదీ టూ అడ్వకేట్: రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి!
News· 28 Apr 2026

ఖైదీ టూ అడ్వకేట్: రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి!

రాజీవ్ గాంధీ హత్య కేసులో దాదాపు 31 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన పేరరివాళన్, ఇప్పుడు లాయర్ అయ్యారు. 2022లో సుప్రీంకోర్టు ఆదేశాలతో రిలీస్ అయిన ఆయన, Law చదివి Bar Associationలో తన పేరు రిజిస్టర్ చేసుకున్నారు. సరైన న్యాయం అందక జైళ్లలో ఉండిపోయిన నిరుపేద ఖైదీల కోసం పోరాడటమే తన లక్ష్యమని ఆయన చెప్పారు. త్వరలోనే మద్రాస్ హైకోర్టులో లాయర్‌గా తన ప్రాక్టీస్ స్టార్ట్ చేయబోతున్నారు.

అషురెడ్డి సెటిల్‌మెంట్ ఆడియో లీక్!
Local· 28 Apr 2026

అషురెడ్డి సెటిల్‌మెంట్ ఆడియో లీక్!

బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి చుట్టూ వివాదం ముదురుతోంది. ఒక NRI ని పెళ్లి పేరుతో రూ. 9.83 కోట్లు మోసం చేసిందనే ఆరోపణల మధ్య ఆమె పంపిన Voice Record బయటపడింది. అందులో ప్రస్తుతానికి ఒక కోటిన్నర ఇస్తా. సెటిల్ చేసుకుందాం అని, లేదంటే రివర్స్ కేసు పెడతా అని బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ Audio ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

హైదరాబాద్ ORR పై మంచు ▶
Viral· 28 Apr 2026

హైదరాబాద్ ORR పై మంచు

హైదరాబాద్‌లో వర్షం తో పాటు పెద్ద వడగళ్ల వాన కురిసింది. దీంతో రోడ్లు అన్నీ తెల్ల మంచు లా కనిపించాయి. జనాలు ఇది చూసి చాలా ఆశ్చర్యపోయారు. శంషాబాద్ లాంటి ప్రాంతాల్లో రోడ్ల మీద మంచు పెరిగింది. ఇది నిజమైన స్నో ఫాల్ కాదు, కానీ చూడడానికి మాత్రం కాశ్మీర్ లా ఉంది. ఈ మంచు ముక్కల వల్ల చల్లటి గాలి వీచింది.

అస్థిపంజరంతో బ్యాంకుకి!▶
News· 28 Apr 2026

అస్థిపంజరంతో బ్యాంకుకి!

ఒడిశాలో ఒక వ్యక్తి తన సిస్టర్ అక్కౌంట్ నుండి ₹20,000 విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించాడు. ఆమె చనిపోయిందని చెప్పినా వినకుండా, బ్యాంకు అధికారులు అక్కౌంట్ హోల్డరే రావాలని మొండికేశారు. దాంతో చేసేదేమీ లేక, ఆమె మరణాన్ని నిరూపించడానికి తన సిస్టర్ సమాధిని తవ్వి ఆమె అస్థిపంజరాన్ని బ్యాంకుకు తెచ్చాడు. ఈ ఘటన వ్యవస్థలోని చట్టపరమైన అవగాహన లోపాన్ని మరియు అధికారుల మొండితనాన్ని తెలియజేస్తుంది.

విరాట్ కోహ్లీ పట్టించుకోలేదని కన్నీళ్లు పెట్టుకున్న బుజ్జి ఫ్యాన్!▶
Viral· 28 Apr 2026

విరాట్ కోహ్లీ పట్టించుకోలేదని కన్నీళ్లు పెట్టుకున్న బుజ్జి ఫ్యాన్!

విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ కోసం ఒక చిన్న బాబు బ్యాట్ పట్టుకుని హోటల్ లాబీలో ఎంతో ఆశగా వెయిట్ చేశాడు. కానీ కోహ్లీ తనను గమనించకుండా వెళ్లిపోవడంతో, ఆ బుజ్జి ఫ్యాన్ Heartbreak అయి. వెంటనే తన చేతిలో ఉన్న బ్యాట్‌ను కింద పడేసి ఏడ్చేశాడు. ఈ ఎమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పాపం ఆ బాబు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా?
Health· 28 Apr 2026

జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా?

సమ్మర్ లో వడదెబ్బ తగలకుండా జేబులో ఉల్లిపాయ పెట్టుకోవాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇచ్చిన సలహా ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే దీనికి ఎలాంటి Scientific Evidence లేవని డాక్టర్లు చెబుతున్నారు. ఉల్లిపాయను ఫుడ్ లో తీసుకుంటే బాడి కూల్ ఔతుంది కానీ, ఓన్లీ జేబులో పెట్టుకుంటే ఎండ నుంచి protection ఉండదు. ఎండలో వెళ్లేటప్పుడు వాటర్ ఎక్కువగా తాగడం, కాటన్ క్లాత్స్ వేసుకోవడం వంటి జాగ్రత్తలే మంచిదని experts చెపుతున్నరు.

పూణేలో దారుణం- భార్య ముందే భర్తపై రికవరీ ఏజెంట్ల దాడి!▶
News· 28 Apr 2026

పూణేలో దారుణం- భార్య ముందే భర్తపై రికవరీ ఏజెంట్ల దాడి!

పూణేలోని హడప్సర్ లో ఒక ప్రైవేట్ ఫైనాన్స్ Recovery Agents దారుణంగా ప్రవర్తించారు. క్రెడిట్ కార్డ్ Dues ఉందని ఒక వ్యక్తిని అతని వైఫ్ చూస్తుండగానే రోడ్డుపై దారుణంగా కొట్టారు. అందరూ చూస్తుండగానే ఏజెంట్లు రెచ్చిపోయి ప్రవర్తించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది సాహసం కాదు, పచ్చి మూర్ఖత్వం!▶
News· 28 Apr 2026

ఇది సాహసం కాదు, పచ్చి మూర్ఖత్వం!

అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి పెట్రోల్ బంక్ లాంటి డేంజరస్ ఏరియా లో ఇద్దరు యువకుడు బైక్ స్టంట్లు చేస్తున్నారు, ఇలా స్టంట్లు చేయడం సాహసం కాదు, పచ్చి మూర్ఖత్వం. మీ ఒక్క క్షణం షో కోసం అక్కడ ఉన్న అమాయకుల లైఫ్ రిస్క్‌లో పెట్టడం దారుణం. మీరు చేసే Wheelings, ఇంట్లో మీ కోసం వెయిట్ చేసే మీ పేరెంట్స్ కి కన్నీటి Feelings మిగల్చకూడదు. responsibleగా ఉండండి, షో ఆఫ్ కోసం ఇలాంటి స్టంట్స్ ఆపండి అంటూ సోషల్ మీడియా లో ఈ వీడియొ కింద కామెంట్స్ చేస్తున్నారు!

సహజీవనంతో బిడ్డను కన్నాక అత్యాచారం అనడం తప్సు ః సుప్రీం
Crime· 27 Apr 2026

సహజీవనంతో బిడ్డను కన్నాక అత్యాచారం అనడం తప్సు ః సుప్రీం

లివిన్ రిలేషన్ షిప్స్ పై సుప్రీం కోర్టు కీలక కామెంట్స్ చేసింది. ఆడ, మగ ఇద్దరూ సహజీవనం చేసిఒక బిడ్డను కూడా కన్నాక బంధం వీగిపోతే దానిని లైంగిక దాడి, అత్యాచారం గా ఎలా లెక్కిస్తారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ తన పార్ట్ నర్ పై కేసు పెట్టింది. ఆకేసు విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న ఈ కామెంట్స్ చేశారు. పెళ్లి కాకుండా బిడ్డను కని ఇప్పుడు దానిని లైంగిక దాడి అనడం చెల్లదని ఆమె అన్నారు.పెళ్లి చేసుకోకుండా బంధాలను కొనసాగిస్తే వచ్చే సమస్యలిలాగే ఉంటాయని అన్నారు.

పంటలు కొనక పోతే ఉద్యమిస్తాం ః కేటీఆర్
Politics· 27 Apr 2026

పంటలు కొనక పోతే ఉద్యమిస్తాం ః కేటీఆర్

రేవంత్ ప్రభుత్వం పంటలు కొనకపోతో ఇంకో ఉద్యమం స్టార్ట్ చేస్తామని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. తమ హయాంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా కొన్నామ న్నారు. ఎన్నో పార్టీలు వస్తుంటాయ్.. పోతుంటాయ్ అంటూ కవిత కొత్త పార్టీని లైట్ తీసుకున్నారు.తెలంగాణ ప్రజల మనసులను గాయపరి చేలా బీజేపి నేత తేజస్వి సూర్య మాట్లాడారని, తనకు ఫోన్ చేసి వివరణ ఇవ్వబోతే గట్టిగా ఖండించి, నిరసన తెలిపాననీ కేటీఆర్ అన్నారు.పార్టీలో రాష్ట్ర కమిటీ తప్ప అన్ని కమిటీలు రద్దు చేశామని ఫ్రెష్ గా మెంబర్ షిప్స్ స్టార్ట్ చేస్తామని అన్నారు.