ఖైదీ టూ అడ్వకేట్: రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి!

రాజీవ్ గాంధీ హత్య కేసులో దాదాపు 31 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన పేరరివాళన్, ఇప్పుడు లాయర్ అయ్యారు. 2022లో సుప్రీంకోర్టు ఆదేశాలతో రిలీస్ అయిన ఆయన, Law చదివి Bar Associationలో తన పేరు రిజిస్టర్ చేసుకున్నారు. సరైన న్యాయం అందక జైళ్లలో ఉండిపోయిన నిరుపేద ఖైదీల కోసం పోరాడటమే తన లక్ష్యమని ఆయన చెప్పారు. త్వరలోనే మద్రాస్ హైకోర్టులో లాయర్గా తన ప్రాక్టీస్ స్టార్ట్ చేయబోతున్నారు.



