Latest

 భారత-న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
World· 27 Apr 2026

భారత-న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా?

భారత్-న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం (FTA) వల్ల కలిగే మెయిన్ బెనిఫిట్స్ ఇవే: ఇండియాకు లాభం: సుమారు 8,284 రకాల ఇండియన్ ప్రోడక్ట్స్ (లెదర్, హ్యాండ్లూమ్స్ వంటివి) న్యూజిలాండ్‌లోకి ఎలాంటి డ్యూటీ లేకుండా ఎంట్రీ ఇస్తాయి. న్యూజిలాండ్ ఎగుమతులు: అక్కడి నుంచి వచ్చే ఉన్ని, బొగ్గు, పండ్లపై టారిఫ్స్ తగ్గుతాయి. అయితే మన రైతుల కోసం డైరీ, షుగర్, స్పైసెస్ వంటి రంగాలకు మినహాయింపు ఇచ్చారు. బిజినెస్ టార్గెట్: రాబోయే 5 ఏళ్లలో ఇరు దేశాల మధ్య వ్యాపారాన్ని రెట్టింపు చేస్తూ $5 బిలియన్లకు చేర్చడమే ఈ డీల్ లక్ష్యం!

 భారత్, న్యూజీలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ !
World· 27 Apr 2026

భారత్, న్యూజీలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ !

భారత్ ,న్యూజిలాండ్ సోమవారం ఒక చారిత్రాత్మక Free Trade Agreement (FTA) పై సంతకాలు చేశాయి. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో మంత్రులు పియూష్ గోయల్, టాడ్ మెక్లే ఈ ఒప్పందాన్ని ఖరారు చేశారు. న్యూజిలాండ్ పార్లమెంట్ దీనిని సమీక్షించి, ఆమోదించడానికి మరో ఆరు నెలలు పట్టొచ్చు. ఈ ఏడాదే అమల్లోకి రానున్న ఈ డీల్ వల్ల ఇరు దేశాల మధ్య వ్యాపారం నెక్స్ట్ లెవల్‌కు చేరుకోనుంది!

పిల్లల హక్కుల విషయంలో సుప్రీంకోర్టు గుడ్ న్యూస్..
Politics· 27 Apr 2026

పిల్లల హక్కుల విషయంలో సుప్రీంకోర్టు గుడ్ న్యూస్..

Live in relationship పై సుప్రీంకోర్టు ఒక షాకింగ్ రియాలిటీ చెక్ ఇచ్చింది. ఇద్దరూ ఇష్టపడి కొన్నేళ్లు కలిసి ఉండి, ఒక బిడ్డ కూడా పుట్టిన తర్వాత.. ఇప్పుడు అది అత్యాచారం ఎలా అవుతుందని ప్రశ్నించింది. Consent తో రిలేషన్‌లో ఉండి, ఆ తర్వాత గొడవలొస్తే రేప్ కేసు పెట్టడం కరెక్ట్ కాదని కోర్టు అభిప్రాయపడింది. అలాగే, పెళ్లి కాకుండా పుట్టిన పిల్లలు అక్రమ సంతానం కాదని, వాళ్లకు అన్ని హక్కులు ఉంటాయని క్లారిటీ ఇచ్చింది..

గ్రౌండ్ లో సిక్సర్లు.. బయట ప్రాంక్‌లు! వైభవ్ వీడియో వైరల్..▶
Entertainment· 27 Apr 2026

గ్రౌండ్ లో సిక్సర్లు.. బయట ప్రాంక్‌లు! వైభవ్ వీడియో వైరల్..

ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ బయట చాలా సరదాగా ఉంటాడు. రీసెంట్ గా ఎయిర్‌పోర్ట్‌లో తనను చూడటానికి వచ్చిన కిడ్స్ తో వైభవ్ ప్రాంక్ చేశాడు. నాతో ఫోటో దిగాలంటే 100 ఇవ్వాలి అని సీరియస్‌గా చెప్పడంతో ఆ పిల్లలు షాక్ అయ్యారు. ఒక పిల్లాడు నిజంగానే 200 ఇస్తానని అనడంతో, వైభవ్ నవ్వి వారితో సెల్ఫీలు దిగాడు. ఈ వీడియొ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?▶
Sports· 27 Apr 2026

వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?

IPL 2026లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సెంచరీతో రికార్డు సృష్టించాడు. ఇతని బ్యాటింగ్ చూసి పాక్ అనలిస్ట్ నౌమన్ నియాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైభవ్ బ్యాట్‌లో ఏమైనా AI Chip ఉందేమో చెక్ చేయాలి, ఇంత చిన్న వయసులో ఇలా ఆడటం ఇంపాసిబుల్ అని రియాక్ట్ అయ్యాడు. వైభవ్ టెక్నిక్ చూస్తుంటే అతడు ఫ్యూచర్ సూపర్ స్టార్ అవ్వడం ఖాయమని అభినందించారు.

ప్రాణం పోతుంటే కూడా రైలు ఆపరా?▶
News· 27 Apr 2026

ప్రాణం పోతుంటే కూడా రైలు ఆపరా?

వెస్ట్ బెంగాల్ లోని జల్పాయ్ గురి రూట్‌లో ఒక అబ్బాయి రైలులో నుంచి కింద పడిపోయిన ఘటన మన రైల్వే వ్యవస్థ ఎలా ఉందో చూపిస్తోంది. ప్యాసింజర్లు వెంటనే Emergency Chain లాగినా రైలు ఆగలేదు. Helpline, TTE కి కంప్లైంట్ చేసినా ఎవరూ హెల్ప్ చేయలేదు. ఆ ట్రైన్ లోనే ఉన్న వాళ్ళ అక్క తమ్ముడి కోసం ఏడుస్తూ అరిచినా కూడా Railway Administration ఏమాత్రం పట్టించుకోలేదు. ఎమర్జెన్సీలో చైన్ లాగితే ఆగని ఈ వ్యవస్థ, సామాన్యుల మీద మాత్రం ఫైన్లు వేయడానికి రెడీగా ఉంటుందని నెటిజెన్స్ అంటున్నారు.

KCR ఇంటికి వాటర్ ట్యాంకర్?▶
Politics· 27 Apr 2026

KCR ఇంటికి వాటర్ ట్యాంకర్?

మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో వాటర్ ట్యాంకర్ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్! తెలంగాణ ఆవిర్భావ వేడుకల కోసం ఆయన హైదరాబాద్ వస్తుండగా, ఇంట్లో వాటర్ ప్రాబ్లం కారణంగా స్టాఫ్ ట్యాంకర్‌ను ఏర్పాటు చేశారు. KCR ఇంటికే వాటర్ ట్యాంకర్ రావడం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

భర్తకు సీరియస్, భార్య ambulence క్లీనింగ్!▶
News· 27 Apr 2026

భర్తకు సీరియస్, భార్య ambulence క్లీనింగ్!

మధ్యప్రదేశ్‌లోని కట్నీలో ఒక హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. భర్తకి సీరియస్ ఉంది అని హాస్పిటల్ కి తీసుకెళ్తే, హాస్పిటల్ స్టాఫ్ మాత్రం కనీసం కనికరం కూడా లేకుండా అతని భార్య చేత అంబులెన్స్‌ క్లీన్ చేయించారు. ట్రీట్‌మెంట్ ఇవ్వడం మానేసి, ఇలాంటి పనులు చేయించడం ఏంటి? ముందు ట్రీట్మెంట్ ఇవ్వండి అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

AC ఎందుకు బ్రో.. ఉల్లిపాయ చాలు!▶
Health· 27 Apr 2026

AC ఎందుకు బ్రో.. ఉల్లిపాయ చాలు!

ఎండలు మామూలుగా లేవు కదా! దీనిపై కేంద్ర మంత్రి Jyotiraditya Scindia ఒక క్రేజీ టిప్ ఇచ్చారు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే జేబులో ఉల్లిపాయ పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. 51°C ఎండలో కూడా తాను AC అస్సలు వాడనని, తనది స్ట్రాంగ్ "చంబల్ చర్మం" అని ఫన్నీగా చెప్పారు. పాతకాలపు ఈ ఆయుర్వేద హ్యాక్ ఎండల నుంచి మనల్ని కాపాడుతుందని ఆయన గుర్తుచేశారు.

watermelon తిని ఫ్యామిలీ మొత్తం చనిపోయారు!
Health· 27 Apr 2026

watermelon తిని ఫ్యామిలీ మొత్తం చనిపోయారు!

ముంబైలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. saturday నైట్, ఫ్యామిలీ పార్టీలో వాటర్మిలాన్ తిని ఒకే ఫ్యామిలీలో నలుగురు చనిపోయారు . ఫ్రూట్ తిన్న కొద్దిసేపటికే వాంథింగ్స్ , స్టమక్ పెయిన్ రావడంతో హాస్పిటల్‌కు వెళ్లారు, కానీ దురదృష్టవశాత్తు వైఫ్ అండ్ హస్బండ్ తో పాటు వాళ్ళ డాటర్స్ కూడా చనిపోయారు. వాటర్మిలాన్ లో ఏవైనా కెమికల్స్ కలిశాయా లేదా అనేది Post-mortem రిపోర్ట్ వస్తేనే తెలుస్తుంది.

స్కూల్ ప్రిన్సిపల్ రూడ్ బిహేవియర్!▶
Politics· 27 Apr 2026

స్కూల్ ప్రిన్సిపల్ రూడ్ బిహేవియర్!

యూపీలోని హర్దోయ్ Sunbeam School ప్రిన్సిపల్ మమతా మిశ్రా ఒక పేరెంట్‌పై రూడ్ గా బిహేవ్ చేసింది. స్టూడెంట్ నోట్‌బుక్స్ స్కూల్‌లో కాకుండా బయట కొన్నారనే కోపంతో ఆమె షటప్ అంటూ గట్టిగా అరిచారు. అంతేకాకుండా స్టూడెంట్ ని స్కూల్ నుండి పంపేస్తానని బెదిరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో Viral కావడంతో, "స్కూలా లేక బిజినెస్ సెంటరా?" అంటూ నెటిజన్లు ప్రిన్సిపల్‌పై ఫైర్ అవుతున్నారు.

గుండుసూది మింగిన 8th క్లాస్ స్టూడెంట్!
Health· 27 Apr 2026

గుండుసూది మింగిన 8th క్లాస్ స్టూడెంట్!

గంపలగూడెంలో కోట వరుణ్ సందేశ్ అనే బాబు సరదాగా టీత్ ని గుండుసూదితో క్లీన్ చేసుకుంటూ, పొరపాటున దాన్ని మింగేశాడు. అది లంగ్స్ వరకు వెళ్లడంతో నోటి నుంచి బ్లడ్ వచ్చింది. వెంటనే విజయవాడలోని ఓ హాస్పిటల్ కి తీసుకెళ్లారు.. అక్కడ డాక్టర్స్ Magnet హెల్ప్ తో ఆ సూదిని బయటకు తీశారు. ప్రెసెంట్ బాబు సేఫ్ గా ఉన్నాడు.

సింగిల్స్‌కి బ్యాడ్ న్యూస్.. పెళ్లి కాకపోతే క్యాన్సర్ రిస్క్?
Politics· 27 Apr 2026

సింగిల్స్‌కి బ్యాడ్ న్యూస్.. పెళ్లి కాకపోతే క్యాన్సర్ రిస్క్?

రీసెంట్ స్టడీస్ ప్రకారం.. పెళ్లయిన వారితో పోలిస్తే సింగిల్స్ లో క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉందట! పెళ్లి కాకపోవడం వల్ల ఈ డిసీస్ రాదు, కానీ సింగిల్గా ఉండటం వల్ల సరిగ్గా తినకపోవడం, టైమ్‌కి చెక్అప్స్ చేయించుకోకపోవడమే మెయిన్ రీజన్ అని తేలింది. ముఖ్యంగా లేడీస్‌లో ఈ రిస్క్ ఇంకా ఎక్కువని Experts చెబుతున్నారు. సో పెళ్లి సంగతి పక్కన పెడితే, హెల్త్ విషయంలో మాత్రం కేర్లెస్గా ఉండకండి!

ఆ జడ్జి ముందు హాజరుకాను  _కేజ్రివాల్
Local· 27 Apr 2026

ఆ జడ్జి ముందు హాజరుకాను _కేజ్రివాల్

లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ ముందు హాజరుకావడానికి ఆయన నిరాకరించారు. ఆమె ఈ కేసుని విచారిస్తే తనకు న్యాయం జరగదని, అందుకే తాను కానీ, తన తరఫున లాయర్లు ఎవరూ కోర్టుకు హాజరు కాకూడదని డెసిషన్ తీసుకున్నామంటూ న్యాయమూర్తికే ఒక లెటర్ రాశారు. స్వర్ణకాంత శర్మ విషయంలో తాను సుప్రీం కోర్టులో పోరాడతానని స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడుస్తూ తన నిరసన తెలియజేస్తున్నానని చెప్పారు.

పెళ్లి పీటలెక్కిన F2 నటి
Entertainment· 27 Apr 2026

పెళ్లి పీటలెక్కిన F2 నటి

సినీ నటి మెహరీన్ ఫిర్జాదా పెళ్లి చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక లగ్జరీ రిసార్ట్‌లో ఆదివారం నాడు తన చిరకాల మిత్రుడు అర్ష్ ఔలఖ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వెడ్డింగ్‌ ఫోటోలను ఆమె ఇన్ స్టాలో షేర్ చేశారు. కృష్ణగాడి వీర ప్రేమ గాధ మూవీతో టాలీవుడ్ లోకి మెహరీన్ అడుగు పెట్టారు. అనిల్ రావిపూడి డైరక్షన్ లో వచ్చిన F2, F3 మూవీస్ లో వరుణ్ తేజ్ పక్కన నటించి పేరు తెచ్చుకున్నారు.

ప్రపంచంలో హాటెస్ట్ సిటీల లిస్ట్.. టాప్ 100లో 98 మనవే!
Local· 27 Apr 2026

ప్రపంచంలో హాటెస్ట్ సిటీల లిస్ట్.. టాప్ 100లో 98 మనవే!

దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతల విషయంలో AQI.in సంస్థ తాజా డేటా షాక్‌కు గురిచేస్తోంది. ప్రపంచంలోని టాప్ 100 హాటెస్ట్ సిటీలలో ఏకంగా 98 మన దేశంలోనే ఉన్నాయి. యూపీ, రాజస్థాన్, ఒడిశా, బీహార్ రాష్ట్రాలతో పాటు మన తెలంగాణ, ఏపీలో చాలా నగరాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటేస్తున్నాయి. ఎల్‌ నినో ఎఫెక్ట్ వల్లే ఈ స్థాయిలో 'హీట్ వేవ్' కొనసాగుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

 సీఎం రేవంత్ కు హారన్ లతో నిరసన !▶
Politics· 26 Apr 2026

సీఎం రేవంత్ కు హారన్ లతో నిరసన !

విఐపీల కోసం గంటల తరబడి రోడ్ ను బ్లాక్ చేయడం జనం ఇబ్బందులు పడటం మామూలే. తెలంగాణలో ఔటర్ రింగ్ రోడ్ లోని నార్సింగ్, పుప్పాలగూడ రూట్ లో సీఎం రేవంత్ రెడ్డి తరచుగా వెళ్లడం సామాన్యులకు నరకం చూపిస్తోంది. ప్రోటోకాల్ పేరుతో ట్రాఫిక్ ఆపేయడంతో వారికి ఒళ్లు మండిపోయింది. అసలే ఎండ... ఆపై నడిరోడ్డుపై వెయిట్ చేయాల్సి రావడంతో వారి కోపం పీక్స్ కి వెళ్లింది.పోలీసుల తీరుపై వారంతా హారన్లు మోగించి నిరసన తెలిపారు. అంతా చూసిన పోలీసులు కారులో ఏసీ వేసుకు కూర్చోండి. లేదా సీఎంనే అడగండి.. ఎండలో మేం మాడుతుంటే మామీదేంటి గుస్సా అంటున్నారు..

పార్టీ పెట్టాక కవిత  ఎక్స్ లో ఇంట్రెస్టింగ్ ట్వీట్  !!
Politics· 26 Apr 2026

పార్టీ పెట్టాక కవిత ఎక్స్ లో ఇంట్రెస్టింగ్ ట్వీట్ !!

కొత్త పార్టీ పెట్టాక టీఆర్ఎస్ అధినేత్రి కవిత 'ఎక్స్'లో ఆసక్తికర పోస్టు చేశారు. 'మీ టైం పూర్తయ్యింది.. మా టైం మొదలైంది.. #TRS' అంటూ పోస్టు పెట్టారు. శనివారం మునీరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన సభలో తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లక్ష్యంగా కవిత విమర్శలు గుప్పించారు.

కోపంలో  కోటిన్నర విసిరి పారేసింది !!▶
Politics· 26 Apr 2026

కోపంలో కోటిన్నర విసిరి పారేసింది !!

మొగుడుపై అలిగి రూ. కోటిన్నర నోట్లను బాల్కనీలోంచి విసిరేసింది ఓ మహిళ..! గ్వాంగ్‌డాంగ్లోని శాంతౌ నగరంలో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల మధ్య గొడవతో కోపానికి గురైన మహిళ, బాల్కనీ నుంచి సుమారు రూ.1.5 కోట్లు విలువైన నగదును బయటకు విసిరేసింది..! స్టార్ లేక్ సిటీ ప్రాంతంలో ఈ ఘటనతో నోట్లు గాల్లో ఎగరడంతో స్థానికులు ఆ డబ్బును అందుకునేందుకు ప్రయత్నిం చడంతో అక్కడ కాసేపు టెన్షన్ పెరిగింది.పోలీసులు జోక్యంతో పరిస్థితి సర్దుకుంది. ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ ఆ క్యాష్ అసలైన దేనని ధృవీకరించగా, తీసుకున్న వారు తిరిగి ఇవ్వాలని సూచించింది.

డిస్టెన్స్ డిగ్రీలపై తెలంగాణ  హైకోర్టు షాకింగ్  జడ్జిమెంట్ !
Local· 26 Apr 2026

డిస్టెన్స్ డిగ్రీలపై తెలంగాణ హైకోర్టు షాకింగ్ జడ్జిమెంట్ !

పక్క రాష్ట్రాల వర్సిటీల స్టడీ సెంటర్లలో Distance Education ద్వారా డిగ్రీలు చేసిన వారికి తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రాలు దాటి నిర్వహించే ఇలాంటి డిగ్రీలు కేవలం కాగితపు ముక్కలే అని, ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవి Not Valid అని తేల్చి చెప్పింది. ఈ సంచలన తీర్పుతో సర్కారీ కొలువులే లక్ష్యంగా ఉన్న వేలాది మంది అభ్యర్థుల ఫ్యూచర్ ఇప్పుడు రిస్క్‌లో పడింది!2022 లైబ్రేరియన్ పోస్టుల వెరిఫికేషన్ సమయంలో ఆచార్య నాగార్జున వర్సిటీ డిగ్రీలను టీజీపీఎస్సీ తిరస్కరించడంతో ఈ వివాదం మొదలైంది. యూజీసీ నిబంధనల ప్రకారం వర్సిటీలు తమ రాష్ట్ర సరిహద్దులు దాటి డిగ్రీలు ఇవ్వడం చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

పెళ్లి పేరుతో  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు నటి ఆశూ రెడ్డి  మస్కా!
Crime· 26 Apr 2026

పెళ్లి పేరుతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు నటి ఆశూ రెడ్డి మస్కా!

పెళ్లి పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ధర్మేంద్రను మోసం చేసి, ₹9.83 కోట్లు, 5KG గోల్డ్, విల్లా అడ్వాన్స్ వసూలు చేసినట్లు నటి Ashu Reddy ఫ్యామిలీపై CCS పోలీసులు కేసు నమోదు చేశారు. వేణుస్వామి దగ్గర జాతకాలు చూపించి మరీ నమ్మించి, తీరా పెళ్లికి నో చెప్పి హనీ ట్రాప్ చేశారని బాధితుడి తండ్రి ఫిర్యాదు చేశారు. ఆషురెడ్దీ చెల్లెలు దివ్యారెడ్డి కి కూడా ధర్మేంద్ర 50 లక్షలు ఇచ్చినట్లు చెప్పారు. అక్కా, చెల్లి ఇద్దరూ హానీ ట్రాప్ తో తమ కుమారుని భారీగా దోచేశారంటూ కంప్లయింట్ చేయడంతో అశురెడ్డిపై వేర్వేరు సెక్షన్ల కింద సీరియస్ యాక్షన్ మొదలైంది!