కోపంలో కోటిన్నర విసిరి పారేసింది !!
మొగుడుపై అలిగి రూ. కోటిన్నర నోట్లను బాల్కనీలోంచి విసిరేసింది ఓ మహిళ..! గ్వాంగ్డాంగ్లోని శాంతౌ నగరంలో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల మధ్య గొడవతో కోపానికి గురైన మహిళ, బాల్కనీ నుంచి సుమారు రూ.1.5 కోట్లు విలువైన నగదును బయటకు విసిరేసింది..! స్టార్ లేక్ సిటీ ప్రాంతంలో ఈ ఘటనతో నోట్లు గాల్లో ఎగరడంతో స్థానికులు ఆ డబ్బును అందుకునేందుకు ప్రయత్నిం చడంతో అక్కడ కాసేపు టెన్షన్ పెరిగింది.పోలీసులు జోక్యంతో పరిస్థితి సర్దుకుంది. ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఆ క్యాష్ అసలైన దేనని ధృవీకరించగా, తీసుకున్న వారు తిరిగి ఇవ్వాలని సూచించింది.


