Latest

పోలీసులనే ఎదిరించిన గంజాయి బ్యాచ్!▶
Crime· 24 Apr 2026

పోలీసులనే ఎదిరించిన గంజాయి బ్యాచ్!

హైదరాబాద్‌లోని బోడుప్పల్ కమాన్ దగ్గర కొందరు యువకులు గంజాయి మత్తులో నానా హంగామా చేశారు. నైట్ టైమ్ రోడ్డుపై వెళ్లే పబ్లిక్ ని ఆపి దాడులకు దిగారు. విషయం తెలిసి పోలీసులు అక్కడికి వస్తే, వారిని చూసి కూడా భయపడకుండా పోలీసుల మీదకే తిరగబడ్డారు. గంజాయికి బానిసలై యువత ఇలా ప్రవర్తించడం చూసి జనం భయపడుతున్నారు. పోలీసులు ఈ గంజాయి బ్యాచ్‌ను పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.

కరిగిపోతున్న డాలర్ డ్రీమ్స్ 40% మంది రిటర్న్ జర్నీకి రెడీ!
World· 24 Apr 2026

కరిగిపోతున్న డాలర్ డ్రీమ్స్ 40% మంది రిటర్న్ జర్నీకి రెడీ!

ఇండియన్స్ డాలర్ డ్రీమ్స్ కరిగిపోతున్నాయి. కార్నెగీ ఎండోమెంట్, YouGov సంయుక్తంగా నిర్వహించిన 'ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్స్ సర్వే (IAAS) 2026' లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో సుమారు 40% మంది తిరిగి ఇండియాకి వచ్చేద్దామని అనుకుంటున్నారట. ట్రంప్ నిర్ణయాలు, గన్ కల్చర్ పెరిగిపోవడం, ఇమ్మిగ్రేషన్ కష్టాలే దీనికి మెయిన్ రీజన్స్ అని ఈ రిపోర్ట్ సారాంశం. అమెరికాలో భారతీయులు ఉండటం ఇప్పుడు బిగ్ ఛాలెంజ్ గా మారిందని ఈ సర్వే చెబుతోంది.

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య.. కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం▶
Local· 24 Apr 2026

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య.. కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం

పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. స్థానిక RDO ఉమారాణి శంకర్ గౌడ్ కు నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి RTCలో ఉద్యోగం ఇస్తామని తెలిపారునర్సంపేట కాంగ్రెస్ MLA దొంతి మాధవరెడ్డి వ్యక్తిగతంగా రూ.5 లక్షల సాయం ప్రకటించారు.

శవంపై బంగారు కమ్మలు మాయం!
Local· 24 Apr 2026

శవంపై బంగారు కమ్మలు మాయం!

జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో మానవత్వం మంటగలిసింది. అనారోగ్యంతో చనిపోయిన 80 ఏళ్ల బాలవ్వ అనే వృద్ధురాలి చెవులకు ఉన్న బంగారు కమ్మలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. డెడ్ బాడిని ఇంటికి తీసుకెళ్లాక నగలు లేకపోవడాన్ని గమనించిన చుట్టాలు షాక్‌ అయ్యారు. హాస్పిటల్లోని సెక్యూరిటీ గార్డ్ ని నిలదీయగా తనకు తెలియదని చెప్పడంతో, బాధితులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అభిమానుల సమక్షంలో సచిన్ బర్త్ డే ▶
Sports· 24 Apr 2026

అభిమానుల సమక్షంలో సచిన్ బర్త్ డే

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 53వ బర్త్ డే ఇవాళ. ఈ సందర్భంగా ముంబైలో తన నివాసం బయట అభిమానుల సమక్షంలో సచిన్ కేక్ కట్ చేశారు. ఈ వేడుకలో ఆయన భార్య అంజలి టెండూల్కర్ కూడా పాల్గొన్నారు. అభిమానులంటూ హ్యాపీ బర్త్ టూ యూ అంటూ గట్టిగా అరుస్తూ సందడి చేశారు.

బీజేపీ ఆఫీసుకి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి
Politics· 24 Apr 2026

బీజేపీ ఆఫీసుకి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ఇవాళ బీజేపీ కార్యాలయానికి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో ఆమె భేటీ అయ్యారు. దీంతో ఆమె బీజేపీలో చేరతారని, ఆ పార్టీ నుంచి ఎంపీ సీటు ఆశిస్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల మల్లారెడ్డి తన కుటుంబంతో సహా ప్రధాని మోదీని కలుసుకున్నారు. మల్లారెడ్డి గ్రూప్ , గూగుల్ తో కలిసి ప్రారంభించనున్న డిజిటల్ ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించడానికి వెళ్లినట్టుగా అప్పట్లో మల్లారెడ్డి వివరణ ఇచ్చారు.

రికార్డ్ ఓటింగ్.. విజయ్ మేజిక్ చేసినట్టేనా?
Politics· 24 Apr 2026

రికార్డ్ ఓటింగ్.. విజయ్ మేజిక్ చేసినట్టేనా?

తమిళనాడులో నిన్న జరిగిన పోలింగ్ లో ఏకంగా 84.69% ఓటింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయి భారీ ఓటింగ్ కు విజయ్ కొత్త పార్టీ TVK ఎంట్రీనే మెయిన్ రీజన్ అని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా యూత్, ఫస్ట్ టైమ్ ఓటర్లు గంటల కొద్దీ క్యూలో నిలబడి ఓటేశారు. ఇది అధికార DMK శిబిరంలో గుబులు రేపుతోంది. గత చరిత్రను చూస్తే, రాష్ట్రంలో ఓటింగ్ శాతం భారీగా పెరిగినప్పుడల్లా ప్రభుత్వ వ్యతిరేకతతో పవర్ చేతులు మారింది. 1991, 1996, 2011 ఎన్నికలే దీనికి నిదర్శనం. ఈ సారి విజయ్ ద్రవిడ పార్టీల కోటలు బద్దలు కొడతారా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ . మే 4న ఫలితాలు వచ్చేవరకు లెట్స్ వెయిట్ సీ

ఇంఫాల్ లో టార్చి ర్యాలీ ▶
Local· 24 Apr 2026

ఇంఫాల్ లో టార్చి ర్యాలీ

మణిపూర్ లో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తుల బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడిని నిరసిస్తూ ప్రతీ రోజూ నిరసనల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంఫాల్ లో వేలాది మంది స్థానికులు టార్చ్ ర్యాలీ చేసి తమ నిరసన తెలిపారు.

స్వగ్రామానికి చేరుకున్న శంకర్ గౌడ్ మృతదేహం ▶
Local· 24 Apr 2026

స్వగ్రామానికి చేరుకున్న శంకర్ గౌడ్ మృతదేహం

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ (55) మృతదేహం ఆయన స్వగ్రామానికి చేరుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు ప్రత్యేక వాహనంలో తరలించారు. ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి. శంకర్ గౌడ్ ఆత్మహత్యతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు బీఆర్ఎస్ బంద్ కు పిలుపునిచ్చింది.

రాకేష్ బేడికి కోటి రూపాయల బోనస్
Entertainment· 24 Apr 2026

రాకేష్ బేడికి కోటి రూపాయల బోనస్

లీడ్ హీరోలకు కోట్లలో రెమ్యూనరేషన్ రావడం కామనే, కానీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కు ₹1 కోటి బోనస్ రావడం అంటే మామూలు విషయం కాదు. రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ధురంధర్ సినిమాలో పాక్ పొలిటీషియన్ గా నటించిన రాకేష్ బేడి తన పెర్ఫార్మెన్స్‌తో అందరినీ మెప్పించారు. సినిమా వరల్డ్ వైడ్ ₹1,700 కోట్లకు పైగా వసూలు చేయడంతో, డైరెక్టర్ ఆదిత్య ధర్ ఆయనకు కోటి రూపాయల బోనస్ ఇచ్చారు. ధురంధర్ రెండు పార్ట్స్ లో నటించినందుకు ఆయనకు ఇచ్చిన రెమ్యునరేషన్ 50 లక్షలే. ఈ మూవీలో "బచ్చా హై తూ మేరా" అనే డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్ మెటీరియల్‌గా మారిపోయింది!

గంగా నదిలో ప్రధాని పడవ విహారం▶
Politics· 24 Apr 2026

గంగా నదిలో ప్రధాని పడవ విహారం

పశ్చిమ బెంగాల్ తొలి దశ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కాస్త రిలాక్స్ అయ్యారు. హౌరా నుంచి కోల్ కతా వరకు రోడ్ షో చేస్తూ వచ్చిన ఆయన ఇవాళ ఉదయం గంగా నదిలో కాసేపు పడవలో విహరించారు. హుగ్లీ నది అందాలను తన కెమెరాలో బంధించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పండ్లు, కూరగాయలు తింటే క్యాన్సర్ వస్తుందా?
Health· 24 Apr 2026

పండ్లు, కూరగాయలు తింటే క్యాన్సర్ వస్తుందా?

హెల్దీగా ఉండాలంటే రోజూ వెజిటేబుల్స్ , ఫ్రూట్స్ తినాలని అనుకుంటాం కదా.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఒక షాకింగ్ రిపోర్ట్ ఇచ్చారు. కొన్ని రకాల పండ్లు, కూరగాయలు క్యాన్సర్ రిస్క్‌ను పెంచుతున్నాయట! అయితే తప్పు వాటిది కాదు, వాటిని పండించడానికి, మోతాదుకు మించి వాడుతున్న పెస్టిసైడ్స్ దేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటివల్ల శరీరంలోని కణాలు దెబ్బతిని క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందట. ఇకపై మీరు కొనేటప్పుడు అవి ఆర్గానిక్ అవునో కాదో ఒక్కసారి చెక్ చేసుకోండి.

అణుదాడులు చెయ్యం : ట్రంప్
World· 24 Apr 2026

అణుదాడులు చెయ్యం : ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు సీరియస్ అల్టిమేటం జారీ చేశారు. "టైమ్ అయిపోతోంది.. జాగ్రత్త!" అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే అణు దాడుల విషయంలో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి అణు బాంబు వేసే ఆలోచనదేమీ లేదని వైట్ హౌస్ లో విలేకరులతో చెప్పారు. తమ డిమాండ్లకు ఇరాన్ తలొగ్గాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరించారు. అణు దాడులు చెయ్యబోమన్న ట్రంప్ ప్రకటన కాస్త ఊరటనిచ్చేది.

టాప్ సైంటిస్టుల మిస్టరీ డెత్స్.. వరల్డ్ పవర్స్ మధ్య ఏం జరుగుతోంది?
World· 24 Apr 2026

టాప్ సైంటిస్టుల మిస్టరీ డెత్స్.. వరల్డ్ పవర్స్ మధ్య ఏం జరుగుతోంది?

అమెరికా, చైనాల్లో టాప్ లెవల్ శాస్త్రవేత్తలు వరుసగా మాయమవ్వడం లేదంటే అనుమానాస్పదంగా చనిపోవడం ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. రెండు మూడేళ్లలో AI, స్పేస్, న్యూక్లియర్ రంగాలకు చెందిన 20 మంది ఎక్స్‌పర్ట్స్ ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మామూలు వాళ్లు కాదు.. ప్రపంచ గమనాన్ని మార్చే టెక్నాలజీపై వర్క్ చేస్తున్న వాళ్లు! ఒకరు కార్ క్రాష్‌లో, మరొకరు బిల్డింగ్ పైనుంచి పడి.. ఇలా వరసపెట్టి మరణిస్తున్నారు. దీని వెనుక ఏదైనా 'స్పై వార్' ఉందా అని గ్లోబల్ మీడియా కోడై కూస్తోంది.

మన నౌకని ఇరాన్ హైజాక్ చేసింది ఇలా.. ▶
World· 24 Apr 2026

మన నౌకని ఇరాన్ హైజాక్ చేసింది ఇలా..

దుబాయ్ నుంచి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు వస్తున్న 'ఎపామినోండాస్' అనే భారీ కంటైనర్ నౌకను ఇరాన్ కమాండోలు హైజాక్ చేశారు. ముసుగులు ధరించి, గన్‌లతో స్పీడ్ బోట్లపై వెంబడించి మరీ ఓడను చుట్టుముట్టారు హార్మూజ్ జలసంధి మీదుగా వస్తున్న మన నౌక ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇరాన్ ఎలా మన ఓడను హైజాక్ చేసిందో ఈ వీడియోలో మీరే చూడండి.

ఏఐ ఎఫెక్ట్.. మెటాలో 8 వేల మందికి ఉద్వాసన
World· 24 Apr 2026

ఏఐ ఎఫెక్ట్.. మెటాలో 8 వేల మందికి ఉద్వాసన

ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాలో మళ్ళీ లేఆఫ్స్ మొదలయ్యాయి. ఏకంగా 10 శాతం మంది ఉద్యోగులను (సుమారు 8,000 మంది) తొలగిస్తున్నట్లు ఇంటర్నల్ మెమోలు అందాయి. మే 20 నుంచి ఈ కోతలు మొదలవుతాయి. ఏఐ డెవలప్ మెంట్ కోసం భారీగా నిధులు మళ్లిస్తూ ఉండడం వల్ల టెక్కీలపై ఎఫెక్ట్ పడింది.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ మృతి
Local· 24 Apr 2026

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ మృతి

ఆర్టీసీ సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీడ్రైవర్ కోల శంకర్ గౌడ్ (55) మరణించారు. 80శాతానికి పైగా గాయాలతో హైదరాబాద్ అపోలో DRDO ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు చనిపోయారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా ఉండడాన్ని నిరసిస్తూ వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో పని చేస్తున్న శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినా ఫలితం లేకుండా పోయింది.

 మైన్లు అమర్చే బోట్లను కాల్చేయండి ః ట్రంప్
World· 23 Apr 2026

మైన్లు అమర్చే బోట్లను కాల్చేయండి ః ట్రంప్

హర్ముజ్ లో మైన్లు అమర్చే ఏ చిన్న నౌకలైనా,బోట్లనైనా వెంటనే కాల్చి పారేయమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. అమెరికా మైన్ స్వీపర్లుప్రస్తుతం జల సంధిని క్లియర్ చేస్తున్నాయని, ఇరాన్ దళాలేవైనా జలసంధిలో మైన్లు పెడుతున్నట్లు అనిపిస్తే ఆ నౌకలని నిర్దాక్షిణ్యంగా కాల్చి యాలని ఆదేశించారు.

రూ.300 ఇచ్చి మొబైల్స్ పెట్టుకుని కాపీ కొట్టిన స్టూడెంట్స్
Crime· 23 Apr 2026

రూ.300 ఇచ్చి మొబైల్స్ పెట్టుకుని కాపీ కొట్టిన స్టూడెంట్స్

మహారాష్ట్రలోని చంద్రపూర్ లో షాకింగ్ ఇన్నిడెంట్ బయట పడింది. బి.ఏ సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ ఇద్దరు ఎగ్జామ్ హాల్ లో బాహా టంగా సెల్ ఫోన్స్ పెట్టుకుని కాపీ కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాపీలు జరగకుండా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం చెబుతుంటే వీరు మాత్రం ఎగ్జామ్ కండక్ట్ చేసే అధికారులకు రూ.300 లంచమిచ్చి ఫోన్లు దగ్గరుంచుకుని గూగుల్ లో ఆన్సర్స్ వెతుకుతూ ఎగ్జామ్ రాశారు.

 ఆలియా భట్ కు ఇళ్లు అమ్మేసిన అనుపమ్ ఖేర్ !
Entertainment· 23 Apr 2026

ఆలియా భట్ కు ఇళ్లు అమ్మేసిన అనుపమ్ ఖేర్ !

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన సొంత ఇంటిని అమ్మేసి అద్దె ఇంటికి మారిపోయారు. తనకు సింపుల్ గా జీవించడం ఇష్టమని అందుకే ఆ నిర్ణయం తీసుకున్ననన్నారు. అనుపమ్ భార్య కిరణ్ ఎంపీ కావడంతో ఆమె చండీగఢ్ లో ఉంటున్నారు. ఆస్తుల సంపాదన తన ధ్యేయం కాదని, నటుడిగా రాణించడమేనని ఖేర్ అంతకుముందు అన్నారు. అనుపమ్ స్థిరాస్థులైన రెండు ఇళ్లను అనుపమ్ అమ్మేసిన రూ.9 కోట్లు విలువ కలిగిన రెండు ప్రాపర్టీలను ప్రముఖ నటి అలియా భట్2015లో కొన్నారు.

తూచ్...  భారత్ గొప్పదేశం, మోడీ నాకు ఫ్రెండ్ ః ట్రంప్
World· 23 Apr 2026

తూచ్... భారత్ గొప్పదేశం, మోడీ నాకు ఫ్రెండ్ ః ట్రంప్

భారత, చైనాలను నరక కూపాలని కామెంట్ చేసి 24 గంటలు గడవ కుండానే యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారు. భారత్ చాలా నమ్మకమైన మిత్రదేశమని, మాట సర్దుకున్నారు. భారత్ ఒక గొప్ప దేశమని,ఆ దేశాధినేతతో తనకు వ్యక్తిగత స్నేహం ఉందనీ అన్నారు.అంతకుముందు భారత, చైనాలను నరక కూపాలంటూ రేడియో హోస్ట్ మైకేల్ సావేజ్ సోషల్ మీడియాలో స్పందించారు. అదే మెసేజ్ ను ట్రంప్ తన ఖాతాలో రీ పోస్ట్ చేశారు. భారత , చైనా దేశాల ప్రజలు 9వ నెలలో డెలివరీకి అమెరికా వస్తారని, ఆ వెంటనే అమెరికా సిటిజన్లుగా మారతారని సావేజ్ తన పోస్ట్ లో కామెంట్ చేశారు.