నా డెడ్ బాడీని తండ్రి తాకద్దుః కాన్పూర్ లాయర్ సంచలన పోస్ట్ !!

కాన్పూర్ కోర్టు భవనంపై నుంచి దూకి పాతికేళ్ల లాయర్ ప్రియాన్షు శ్రీవాస్తవ చనిపోయాడు. ఆత్మ హత్యకు ముందు వాట్సప్ లో సూసైడ్ నోట్ వైరల్ గా మారింది. బాల్యంలో తండ్రి అకృత్యాలే సూసైడ్ కి కారణమని నోట్‌లో ఆరోపించాడు ప్రియాన్షు. తండ్రి కఠినంగా వ్యవహరించడంవల్ల మెంటల్ టెన్షన్ పెరిగిందని, ఇష్టం లేని చదువువల్ల ఎగ్జామ్స్ ఫెయిల్ అయినట్లు అందులో రాశాడు.ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలతో ఒత్తిడి పెరిగి, ఆత్మన్యూనత భావంతో బాధపడ్డానని పేర్కొన్నాడు.“నా డెడ్ బాడీని నా తండ్రి తాకకూడదు” అని రాయడం సంచలనం. తన తల్లిని నిందించొద్దని అతడు కోరాడు.



