Latest

పాము విషంతో చైనా లేడి కోట్ల సంపాదన !!
చైనాకు చెందిన క్విన్ అనే యువతి నగర జీవితాన్ని వదిలి, తన స్వగ్రామంలో సుమారు 60,000 విషసర్పాలను పెంచుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె వద్ద 50,000 ఫైవ్-స్టెప్ వైపర్లు, 10,000 నాగుపాములు ఉన్నాయి. వీటి విషం మరియు ఇతర భాగాలను వైద్య అవసరాల కోసం విక్రయిస్తూ ఏటా ₹1.35 కోట్ల ఆదాయం గడిస్తోంది. ప్రమాదకరమైన వ్యాపారమైనప్పటికీ, చిన్నప్పటి నుండి పాములతో గడపడం వల్ల తనకు భయం లేదని ఆమె చెబుతోంది.

రాజస్థాన్ ఆయిల్ రిఫైనరీలో ఫైర్ యాక్సిడెంట్ !!
రాజస్థాన్ బలోత్రాలోని పచ్ పద్ర ఆయిల్ రిఫైనరీ ప్రారంభోత్సవానికి ముందే అగ్ని ప్రమాదానికి లోనయింది. అతి త్వరలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ఓపెన్ కావాల్సిన ఈ రిఫైనరీలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. దట్టమైన పొగలతో ఆప్రాంతం నిండిపోయింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు.రాజస్థాన్ ప్రభుత్వం, హెచ్ పిసీఎల్ కంపెనీల భాగస్వామ్యంతో ఈ గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ ప్రాజెక్టు పని చేస్తుంది. ఈ నేపధ్యంలో ప్రధాని ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు.

అక్కడలా... ఇక్కడిలా... ఎందుకు విజయ్? ః ఈసీ
రెండు చోట్ల నుంచి ఎన్నికల్లో నిలబడ్డ టీవీకే పార్టీ అధ్యక్షుడు తలపతి విజయ్ ఎన్నికల అఫిడవిట్లో తేడాలుండటంతో మద్రాస్ హై కోర్టు నోటీసులిచ్చింది. ఆస్తుల వివరాలు పెరంబూర్ నియోజక వర్గం అఫిడవిట్ లో రూ. 115 కోట్లుగా ను, తిరుచ్చిలో రిటర్నింగ్ ఆఫీసర్ కు ఇచ్చిన వివరాల్లో రూ.220 కోట్లు గా విజయ్ అఫిడవిట్ సమర్పించారు. అయితే ఈ రెంటికీ తేడా ఎందుకు ఉందో తెలిపే వివరణ పత్రాలు మాత్రం లేవు. విఘ్నేశ్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ ను పరిశీలించిన మద్రాస్ హై కోర్టు విజయ్ కు నోటీసులిచ్చింది.

ఇక మాటల్లేవ్..మాట్లాడుకోడాల్లేవ్ ః ఇరాన్
అమెరికాతో రెండో విడత చర్చల్లో పాల్గొనే ఉద్దేశం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇస్లామాబాద్‌లో చర్చల వార్తలను ఆ దేశ అధికారిక మీడియా (IRNA) కొట్టిపారేసింది. అమెరికా అర్ధం లేని డిమాండ్లు, తరచుగా స్ట్రాటజీలు మార్చి, హర్ముజ్ ను సీజ్ చేసి పరమ చెత్తగా బిహేవ్ చేస్తోందని అమెరికా ప్రవర్తనతో మా మనసులు గాయపడ్డాయి అని ఇరాన్ ఆరోపించింది. ఈనెల 22తో మధ్యప్రాచ్యంలో సీజ్ ఫైర్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో టెన్షన్ కొనసాగుతోంది.

పోప్ తో గొడవ తర్వాత ట్రంప్ నోట్ బైబిల్ వచనాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వారం వైట్ హౌస్‌లో జరగనున్న 'అమెరికా రీడ్స్ ది బైబిల్' కార్యక్రమంలో పాల్గొననున్నారు. మంగళవారం ఓవల్ ఆఫీస్ నుండి ఆయన రికార్డ్ చేసిన సందేశాన్ని అందిస్తారు. ట్రంప్ బైబిల్లోని '2 క్రానికల్స్ 7:11-22' వచనాలను చదవనున్నారు. ఈ కార్యక్రమంలో మార్కో రూబియో వంటి ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. గతంలో 2021 క్యాపిటల్ దాడి సమయంలోనూ ఈ బైబిల్ వచనాలు చర్చకు దారితీశాయి.

నాసిక్ TCS లో చీరపట్టి లాగి,తొడపై చేతులేసి !!
నాశిక్ లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయంలో దారుణమైన లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు ఆరుగురికి పైగా మహిళా ఉద్యోగులు తమ తోటి మేల్ కొలీగ్స్ పై లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ప్రయత్నాలపై ఫిర్యాదు చేశారు. నిందితులు చీరపట్టి లాగి, తొడలపై చేతులు వేయడమే కాకుండా, హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఒక మహిళా మేనేజర్ సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. TCS స్పందిస్తూ నిందితులను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది.

జమ్ములో లోయలో పడిన బస్సుః 21 మంది మృతి
జమ్ము కశ్మీర్ లో ఉధంపూర్ రూట్ లో వెళుతున్న ఒక బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించగా అనేక మందికి గాయాలయ్యాయి.రాం నగర్ నుంచి ఉధంపూర్ వెళుతుండగా మధ్యలో జూలో అనే ప్రాంతంలో కొండమలుపు దగ్గర బస్సు టర్న్ తీసుకుంటుండగా లోయలో పడిపోయింది. ఉదయం పది గంటలకు ప్రమాదం జరిగింది.ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.

జపాన్ లో భూ కంపం..రిక్టర్ స్కేల్ పై 7.7 గా నమోదు
జపాన్ ను భూకంపం కుదిపేసింది. ఉత్తర తీరంలో వచ్చిన ఈ భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.4 గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.23 నిమిషాలకు భూమిలో 19 కిలోమీటర్ల లోతున 7.7 తీవ్రతతో భూమి కంపించిందని జపాన్ మెటీరియ లాజికల్ డిపార్టుమెంటు చెప్పింది. భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. టీవీ స్క్రీన్లపై సునామీ హెచ్చరికలు ప్రకటించిన ప్రభుత్వం ప్రభావిత ప్రాంతాలనుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పిలుపునిచ్చింది.
పెళ్లి బట్టలతోనే విజయ్ ర్యాలీకి
తమిళ సూపర్ స్టార్, TVK బాస్ విజయ్ క్రేజే వేరు! ఆయన ఆశీర్వాదం కోసం ఒక కొత్త జంట పెళ్లి బట్టలతోనే నేరుగా విజయ్ ర్యాలీకి వచ్చారు. ఆ జంటను చూసి మురిసిపోయిన విజయ్, వారిని ఆశీర్వదించడమే కాకుండా అదిరిపోయే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఖుషీ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్! "తలైవా అంటే ఆ మాత్రం ఉండాలి" అంటూ జెన్ జీ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.
ఎండలకు తట్టుకోలేక పడిపోయిన చంద్రబాబు కమాండో
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన బర్త్ డే సందర్భంగా విజయవాడలో అన్న క్యాంటీన్ కి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. సీఎం మాట్లాడుతూ ఉండగా ఎండ వేడి భరించలేక ఆయన పక్కనే ఉన్న NSG కమాండో ఒకరు శోష వచ్చినట్టు కిందపడిపోయారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.

H1B వీసా ఫ్రాడ్ .. ఇద్దరు తెలుగువారికి 5 ఏళ్ల జైలు
అమెరికాలో హెచ్-1బీ వీసా స్కామ్‌కు పాల్పడినందుకు ఇద్దరు తెలుగు సంతతి వ్యక్తులకు కాలిఫోర్నియా కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2.50 లక్షల డాలర్ల జరిమానా కట్టాలని ఆదేశించింది. 51 ఏళ్ల వయసున్న సంపత్ రాజిది, శ్రీధర్ మాడా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉద్యోగాలు లేకపోయినా ఉన్నట్టుగా చూపించి చాలా మంది విదేశీయుల్ని రిక్రూట్ చేసుకుని మోసానికి పాల్పడ్డారు. ఈ విషయం వెలుగులోనికి రావడంతో వారిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో పని చేస్తున్న వీరిద్దరికీ ఉద్యోగుల్ని నియమించే అధికారం లేకపోయినప్పటికీ చాలా మందికి వీసాలిప్పించి, తర్వాత వేరే క్లయింట్లకు వాటిని బదిలీ చేశారు.

స్వీడన్ లో పిల్లలకు నో మొబైల్స్ , లాప్ ట్యాప్స్
చిన్నారుల చదువులను అందరికన్నా ముందే డిజిటలైజ్ చేసిన స్వీడన్ ఇప్పుడు బ్యాక్ టు బేసిక్స్ అంటోంది. డిజిటల్ స్క్రీన్లకు గుడ్ బై కొట్టేసి స్టూడెంట్స్ చేతికి మళ్లీ పెన్ను, పుసక్తం ఇస్తోంది. లిటరసీ లెవెల్స్ పడిపోవడం, పిల్లల్లో ఏకాగ్రత తగ్గడం వల్ల మళ్లీ పాత విధానానికే వచ్చేసింది. డిజిటల్ ఓవర్ యూసేజ్ వల్ల తలెత్తుతున్న సమస్యలను తొలగించి మళ్లీ పుస్తకాలను తెస్తోంది. అలాగే నేషనల్ లెవెల్ లో స్కూళ్లలో ఫోన్లను బ్యాన్ చేస్తోంది. స్టూడెంట్ స్కూలుకు రాగానే మొబైల్ ను డిపాజిట్ చేసేయాలి.మనిషి మేధస్సును మళ్లీ గాడిలో పెట్టే ఒక టర్నింగ్ పాయింట్ ఇది..

గాలిలో 4 గంటల నరకం.. హైదరాబాద్-హుబ్లీ ఫ్లైట్‌కు తప్పిన ముప్పు
హైదరాబాద్ నుంచి కర్ణాటకలో హుబ్లీ వెళ్లాల్సిన Fly91 ఎయిర్ లైన్స్ విమాన ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. వాతావరణం అనుకూలించక పోవ డంతో ఫ్లైట్ 4 గంటలు గాల్లో చక్కర్లు కొట్టింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరిన విమానం హుబ్లీలో 4.30కి ల్యాండ్ అవాలి. కానీ వాతావరణం సరిగా లేకపోవడంతో గాల్లో చక్కర్లు కొట్టింది. దీంతో విమానంలో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ దేవుడ్ని ప్రారాధించారు పైలట్ చాక చక్యంగా సేఫ్ గా ల్యాండ్ చేయడం తో ఊపిరి పీల్చుకున్నారు .
రగులుతున్న మణిపూర్, 5 రోజుల బంద్
మణిపూర్‌లోని బిష్ణుపూర్‌లో జరిగిన ఘోర బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రం ఒక్కసారిగా అట్టుడికిపోయింది. ఈ దారుణానికి నిరసనగా పలు విద్యార్థి సంఘాలు 5 రోజుల పాటు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇంఫాల్‌తో పాటు పలు చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆగ్రహించిన జనం రోడ్లపైకి వచ్చి టైర్లు తగలేస్తూ నిరసన తెలుపుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలను భారీగా మోహరించారు.

డెంగ్యూకి చెక్.. ఇండియాలో ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చేస్తోంది
డెంగ్యూ టెన్షన్‌కి ఇక గుడ్ బై కొట్టేసే టైమ్ వచ్చేసింది. ఇండియా తన మొదటి డెంగ్యూ వ్యాక్సిన్ ‘Qdenga’ (క్యూడెంగా) కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జపనీస్ కంపెనీ ‘టకేడా’ (Takeda) ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. హైదరాబాద్‌కు చెందిన ‘బయోలాజికల్ ఇ’ (Biological E) సంస్థ మేకిన్మ ఇండియాలో భాగంగా మన దేశంలో తయారు చేయనుంది. 4 నుండి 60 ఏళ్ల లోపు వారు ఈ టీకా తీసుకోవచ్చు. మరోవైపు మన స్వదేశీ కంపెనీ ‘పనాసియా బయోటెక్’ కూడా ఐసీఎంఆర్ (ICMR) సహకారంతో మరో వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తోంది.

ఒక్క మార్కు కోసం రీ వాల్యుయేషన్ !!
ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కి నూటికి నూరు శాతం మార్కులు సాధించాలనే తపన నాచురల్.కేరళలో ఆషిమా అనే ఓ స్టూడెంట్ CBSC ఫలితాల్లో ఒక మార్కు కోసం రీ వాల్యుయేషన్ కు వెళ్లింది. ఇంతకీ ఆ స్టూడెంట్ సాధించిన మార్కులెన్నో తెలుసా? 499/ 500.. అన్ని సబ్జెక్ట్స్ లోనూ వందకి వంద సాధించిన ఆషీమా సైన్స్ లో 99 మార్కులు మాత్రమే తెచ్చుకుంది. ఆ ఒక్క మార్కు కూడా వస్తుందని నమ్మకంగా ఉంది. అందుకే రీ వాల్యుయేషన్ కి అప్లయ్ చేసింది.

ఇరాన్ తో సీక్రెట్ డీల్స్ గుట్టు రట్టు.. మహిళా వ్యాపారవేత్త అరెస్ట్
ఇరాన్ కు అక్రమంగా బాంబులు, డ్రోన్లను సరఫరా చేస్తున్న ఒక మహిళా వ్యాపారవేత్తను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరాన్ మూలాలున్న షమీమ్ మాఫీ అనే బిజినెస్ ఉమెన్ సీక్రెట్ గా ఇరాన్ తో ఆయుధ ఒప్పందాల్లో మధ్యవర్తిత్వం చేస్తోందని అమెరికా పోలీసులకు సమాచారం అందింది. ఒక గూఢచారిగా వ్యవహరిస్తూ నిషేధిత టెక్నాలజీని ఇరాన్ కు చేరవేస్తోందని గుర్తించారు. లాస్ ఏంజెల్స్ విమానాశ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 43 ఏళ్ల వయసున్న షమీమ్ మాఫి 2025లో ఇరాన్ ప్రభుత్వంతో నేరుగా సంప్రదింపులు జరిపినట్టుగా ఆధారాలు కూడా లభించాయి.
అన్న క్యాంటీన్ లో సీఎం చంద్రబాబు బర్త్ డే
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ 76వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సతీమణి భువనేశ్వరితో కలిసి విజయవాడ పటమటలోని అన్న క్యాంటిన్ కు వెళ్లారు. అక్కడ నిరుపేదలకు తానే స్వయంగా వడ్డించి వారితో పాటు టిఫిన్ తిన్నారు. రాష్ట్రంలోని అన్న క్యాంటీన్ల ఒక్క రోజు ఖర్చు రూ.76 లక్షలను భువనేశ్వరి విరాళంగా ఇచ్చారు. క్యాంటిన్ దగ్గరకి పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు వచ్చి సీఎంకు బర్త్ డే విషెస్ చెప్పారు.

అమెరికాతో చర్చలకు ఇరాన్ నో
అమెరికాతో జరగాల్సిన రెండో రౌండ్ శాంతి చర్చలను ఇరాన్ తిరస్కరించింది. ఇస్లామాబాద్‌లో చర్చలు జరుగుతాయన్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. అమెరికా చేస్తున్నవన్నీ అర్థం లేని డిమాండ్స్ అని మండిపడింది. సముద్ర మార్గంలో దిగ్బంధనం చేస్తూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని యూఎస్ ఉల్లంఘిస్తోందని ఇరాన్ ఆరోపించింది. డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇది దౌత్యానికి ఇస్తున్న చివరి అవకాశం అని వార్నింగ్ ఇచ్చారు. చర్చలు విఫలమైతే దాడులు తప్పవని హెచ్చరించారు.

చర్చలు ఫెయిల్ అయితే దాడులేః ట్రంప్
రేపు ఇస్లామాబాద్ కు అమెరికా ప్రతినిధులు వెళతారని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఒప్పందాలను ఒప్పుకోకపోతే దాడులు తప్పవని ఆయన హెచ్చరించారు. విద్యుత్ కేంద్రాలు, బ్రిడ్జిలను కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ లో నౌకలపై ఇరాన్ కాల్పులను ట్రంప్ తప్పుబట్టారు. సీజ్ ఫైర్ ను ఇరాన్ ఉల్లంఘించిందని అన్నారు. హర్ముజ్ మూసేయడం ఇరాన్ కే నష్టమన్నారు.
కిరాణా షాపులో పల్లీలు తిన్న ప్రధాని
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ పశ్చిమ బెంగాల్లో పర్యటించిన ప్రధాని మోదీ స్థానిక ప్రజలకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఝాడ్గామ్ లో ర్యాలీ చేసిన ఆయన తన కాన్వాయ్ మధ్యలో ఆపేసి ఓ కిరాణా షాపులోకి వెళ్లారు. అక్కడ పల్లీలు, చిరుతిళ్లు కొనుక్కొని తిని డబ్బులు ఇచ్చారు. షాపు యజమానితో కాసేపు ముచ్చటించారు. మీరు ఉల్లి తింటారా అని దుకాణ దారుడు అడగగా ..తింటాను.. బుర్ర మాత్రం తినను అంటూ చమత్కరించారు. మోదీని చూసి అక్కడున్న వారు 'భారత్ మాతాకీ జై', 'జై శ్రీరామ్', 'మోదీజీ జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు.