← Back to news

H1B వీసా ఫ్రాడ్ .. ఇద్దరు తెలుగువారికి 5 ఏళ్ల జైలు

By aravinda nyayapati· 20 Apr 2026· Hyderabad
H1B వీసా ఫ్రాడ్ .. ఇద్దరు తెలుగువారికి 5 ఏళ్ల జైలు

అమెరికాలో హెచ్-1బీ వీసా స్కామ్‌కు పాల్పడినందుకు ఇద్దరు తెలుగు సంతతి వ్యక్తులకు కాలిఫోర్నియా కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2.50 లక్షల డాలర్ల జరిమానా కట్టాలని ఆదేశించింది. 51 ఏళ్ల వయసున్న సంపత్ రాజిది, శ్రీధర్ మాడా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉద్యోగాలు లేకపోయినా ఉన్నట్టుగా చూపించి చాలా మంది విదేశీయుల్ని రిక్రూట్ చేసుకుని మోసానికి పాల్పడ్డారు. ఈ విషయం వెలుగులోనికి రావడంతో వారిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో పని చేస్తున్న వీరిద్దరికీ ఉద్యోగుల్ని నియమించే అధికారం లేకపోయినప్పటికీ చాలా మందికి వీసాలిప్పించి, తర్వాత వేరే క్లయింట్లకు వాటిని బదిలీ చేశారు.

More in World