← Back to news

నాసిక్ TCS లో చీరపట్టి లాగి,తొడపై చేతులేసి !!

By DS· 20 Apr 2026· visakhapatnam
నాసిక్ TCS లో చీరపట్టి లాగి,తొడపై చేతులేసి !!

నాశిక్ లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయంలో దారుణమైన లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు ఆరుగురికి పైగా మహిళా ఉద్యోగులు తమ తోటి మేల్ కొలీగ్స్ పై లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ప్రయత్నాలపై ఫిర్యాదు చేశారు. నిందితులు చీరపట్టి లాగి, తొడలపై చేతులు వేయడమే కాకుండా, హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఒక మహిళా మేనేజర్‌ సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. TCS స్పందిస్తూ నిందితులను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.