Latest

రన్నింగ్ ట్రైన్‌లో రెచ్చిపోయిన కామాంధుడు..▶
Politics· 18 Apr 2026

రన్నింగ్ ట్రైన్‌లో రెచ్చిపోయిన కామాంధుడు..

KRBA-TVCN SF Expressలో ఒక మహిళకు చేదు అనుభవం ఎదురైంది. స్లీపర్ కోచ్ S1లో ప్రయాణిస్తున్న తనతో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు వీడియొ తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. రిజర్వ్డ్ కోచ్‌లలో కూడా మహిళలకు రక్షణ లేకపోవడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ Shocking Inciden tపై రైల్వే పోలీసులు స్పందించి Action తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. ప్రయాణికుల Safetyపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మహిళా బిల్లు వైఫల్యం కాంగ్రెస్ దేనా?
Politics· 18 Apr 2026

మహిళా బిల్లు వైఫల్యం కాంగ్రెస్ దేనా?

డీ లిమిటేషన్ , మహిళా బిల్లులను ఒకేసారి రాజ్యాంగ సవరణకు లింకు పెట్టి సభలో ఓటింగ్ పెట్టిన బీజేపి తెలివిగా ఈ వైఫల్యాన్ని కాంగ్రెస్ పై రుద్దే పని మొదలు పెట్టింది. మహిళల దశాబ్దాల కల అయిన విమెన్ రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మోకాలడ్డిందంటూ ప్రచారం మొదలు పెట్టింది. బీజేపి మహిళా ఎంపీలంతా రాహుల్ ఇంటి వరకూ ప్రదర్శనగా వెళ్లారు. ధోకే బాజ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు.

డబ్బు కోసం పిన్నిని చంపి కాల్చేసిన మహిళ!
Crime· 18 Apr 2026

డబ్బు కోసం పిన్నిని చంపి కాల్చేసిన మహిళ!

కర్ణాటకలో డబ్బు, బంగారం కోసం నాగలక్ష్మి అనే మహిళ తన ప్రియుడితో కలిసి సొంత పిన్నిని మర్డర్ చేసింది. అడవిలో చంపేసి, శవంపై పెట్రోల్ పోసి కాల్చేశారు. ఏడాది తర్వాత లభించిన ఎముకలు, పుర్రె ఆధారంగా పోలీస్ లు ఇన్వెస్టిగేషన్ చేసారు. లేటెస్ట్ టెక్నాలజీ హెల్ప్ తో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కిరాతక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

లైక్.. మళ్లీ అన్ లైక్...క్యా హై కొహ్లీ జీ !!
Sports· 18 Apr 2026

లైక్.. మళ్లీ అన్ లైక్...క్యా హై కొహ్లీ జీ !!

విరాట్ కోహ్లీ, జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ LizLaz ఫోటోను లైక్ చేసి, వెంటనే అన్‌లైక్ చేయడం సోషల్ మీడియాలో పెద్ద Drama అయ్యింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. "మొదట హ్యాపీగా అనిపించినా, ఇది ఇంత Viral అవ్వడం చూసి కోహ్లీ కోసం బాధపడ్డాను. జస్ట్ ఒక లైక్ ఇంత పెద్ద న్యూస్ అవుతుందని ఊహించలేదు. అతని ఉద్దేశం ఏదైనా, ఆ సపోర్ట్‌కి థాంక్స్" అంటూ Chill గా రియాక్ట్ అయ్యింది. విరాట్ కి ఇది మొదటి సారి కాదు.గతంలో అవనీత్ కౌర్ అనే నటి ఫోటోను లైక్ చేసి ఇలాగే దుమారం రేగడంతో అన్ లైక్ చేయాల్సి వచ్చింది.

క్రికెటర్ చాహల్ vs నటి తాన్యా.. అసలేం జరిగింది?
Politics· 18 Apr 2026

క్రికెటర్ చాహల్ vs నటి తాన్యా.. అసలేం జరిగింది?

టీమిండియా క్రికెటర్ చాహల్ తనకు ఇంస్టాగ్రామ్ లో పర్సనల్ మెసేజ్‌లు పంపారంటూ నటి తాన్యా ఛటర్జీ చేసిన ఆరోపణలు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన చాహల్, ఆమెపై పరువు నష్టం కేసు వేశారు. తనను అనవసరంగా ట్రోల్ చేస్తున్నారని, అసలు మెసేజ్ చేసిన చాహల్‌ను ఎవరూ ప్రశ్నించడం లేదని తాన్యా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ Controversy సోషల్ మీడియా లో హాట్ టాపిక్‌గా మారింది.

హర్ముజ్ మళ్లీ మూత పడింది. !!
World· 18 Apr 2026

హర్ముజ్ మళ్లీ మూత పడింది. !!

హర్ముజ్ గేట్ వే మళ్లీ మూసుకుపోయింది. హార్ముజ్ ను తాము తెరిస్తే అమెరికా మొండితనంతో మళ్లీ దిగ్బంధిస్తామని అందని అందువల్ల తమ డెసిషన్ ను వెనక్కు తీసుకున్నామని ఇరాన్ ప్రకటించింది. హర్ముజ్ ను దాటుతున్న ఒక ట్యాంకర్ పై రెండు ఇరానియన్ గన్ బోట్స్ కాల్పులు జరిపాయి. ఎలాంటి ముందస్తు వార్నింగ్ లేకుండానే ఇరాన్ గార్డులు ఫైరింగ్ చేశారని ఆ ట్యాంకర్ కెప్టెన్ తెలిపాడు.

 కంప్లయింట్ చేసిన స్టూడెంట్ పై టీచర్ దాడి!▶
Crime· 18 Apr 2026

కంప్లయింట్ చేసిన స్టూడెంట్ పై టీచర్ దాడి!

బీహార్‌లోని అల్లామా ఇక్బాల్ కాలేజీలో జరుగుతున్న లోపాల గురించి కంప్లయింట్ చేసినందుకు ఒక స్టూడెంట్ ని, టీచర్ అతి దారుణంగా కొట్టి కిందకు నెట్టేశాడు. ఈ ఇంన్సిడెంట్ కు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో విద్యార్థిపై జరిగిన ఈ దాడిపై సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

 ఇది ఎందుకు వాడాలంటే....
Health· 18 Apr 2026

ఇది ఎందుకు వాడాలంటే....

రాతి ఉప్పు లేదా సైంధవ లవణం (రాక్ సాల్ట్) లో ఐరన్, జింక్, నికెల్, మాంగనీస్, లాంటి శరీరానికి మేలు చేసే మినరల్స్ ఉన్నాయి. మన బాడీలో సోడియం లెవెల్స్ ను ఇది బాగా కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే బాడీలో సోడియం ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా ప్రమాదమే. రాక్ సాల్ట్ లో ఉండే ఎలక్ట్రోలైట్ కండరాల తిమ్మిరి తగ్గిస్తుంది.పేగు ఆరోగ్యం కాపాడి , బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, డయేరియా లాంటివి తగ్గిస్తుంది. దీనినే పింక్ రాక్ సాల్ట్ అని కూడా అంటారు.

చిన్నారి పునర్వికకు 16 కోట్ల ఇంజెక్షన్ !!
Health· 18 Apr 2026

చిన్నారి పునర్వికకు 16 కోట్ల ఇంజెక్షన్ !!

అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ Type-1 వ్యాధితో బాధపడుతున్న కర్నూలుకు చెందిన చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల విలువైన ఇంజెక్క్షన్ ఇచ్చారు. దాతలు రూ.10 కోట్లు సేకరించగా, మిగిలిన రూ.6 కోట్లను మంత్రి నారా లోకేశ్ సమకూర్చారు. విదేశాల నుండి ఈ మందును తెప్పించి, హైదరాబాద్‌లోని Rainbow Hospitalలో పాపకు చికిత్స అందించారు. తన బిడ్డ ప్రాణాలను కాపాడినందుకు తల్లిదండ్రులు మంత్రికి స్పెషల్ థాంక్స్ తెలిపారు.

గర్భిణీపై వేధింపులు: కటకటాల్లోకి రాహుల్ గుర్జర్..▶
Crime· 18 Apr 2026

గర్భిణీపై వేధింపులు: కటకటాల్లోకి రాహుల్ గుర్జర్..

రాజస్థాన్‌లోని మాల్వియా నగర్‌లో ఒక గర్భిణీని వేధించిన ఘటనలో ప్రధాన నిందితుడు రాహుల్ గుర్జర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హర్రాస్మెంట్ కేసు లో పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని కస్టడీ లోకి తీసుకున్నారు. మహిళల భద్రతపై ప్రశ్నలు రేకెత్తించిన ఈ ఘటనలో కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీస్ ఈ కేసుపై పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

చిన్నారిని కాపాడిన కోతి!▶
Motivational· 18 Apr 2026

చిన్నారిని కాపాడిన కోతి!

బాల్కనీ నుండి కింద పడబోతున్న ఒక చిన్నారిని కోతి కాపాడిన Viral Video నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కొందరు దీనిని AI-generated లేదా ఎడిట్ చేసిన వీడియో అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద Debateకు దారితీసింది. నిజం ఏదైనా, ఈ దృశ్యం మాత్రం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

విజయ్ దేవరకొండ కొత్త సినిమాల అప్డేట్..
Entertainment· 18 Apr 2026

విజయ్ దేవరకొండ కొత్త సినిమాల అప్డేట్..

విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాని డైరెక్టర్ శౌర్యవ్‌తో అనౌన్స్ చేశారు. ఇది ఒక Action-based లవ్ స్టోరీ. ఇందులో హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అండ్ హేషమ్ అబ్దుల్ మ్యూజిక్ అందిస్తున్నారు. దీనితో పాటు రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో 'Ranabali' సెప్టెంబర్ 11న రిలీజ్ కానుంది. అలాగే రవికిరణ్ కోలా డైరెక్షన్‌లో కీర్తి సురేశ్‌తో కలిసి రౌడీ జనార్ధన్ అనే మరో సినిమాలోనూ విజయ్ నటిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
Local· 18 Apr 2026

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2 శాతం డీఏ పెంచాలని నిర్ణయించింది. కేంద్ర కేబినెట్ దీనికి ఆమోద ముద్ర వేసింది. ఆరు నెలలకి ఒకసారి ప్రభుత్వం డీఏని సవరిస్తుంది. ప్రతీ ఏడాది జనవరి, జులైలో ఈ పెంపు ఉంటుంది. ఈ సారి జనవరిలో పెంపు ప్రకటన రాకపోవడంతో ఇప్పటికే ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

ఆకాశంలో గ్రహాల పెరేడ్ ..!
Technology· 18 Apr 2026

ఆకాశంలో గ్రహాల పెరేడ్ ..!

స్పేస్ లవర్స్‌ ..గెట్ రెడీ! ఆకాశంలో నాలుగు గ్రహాలు మెర్క్యూరీ, మార్స్, శని, నెప్ట్యూన్ ఒక లైన్‌లో అలైన్ అవుతున్నాయి. ఈ నాలుగు గ్రహాలు ఒక పెరేడ్ లా వరసగా కనిపిస్తాయి. ఏప్రిల్ 18 అంటే ఇవాళ్టి నుంచి 20 తేదీ వరకు దీనిని చూడొచ్చు. ఏ రోజైనా సూర్యోదయానికి 30 నుంచి 40 నిముషాల ముందు ఆకాశం క్లియర్ గా ఉంటే తూర్పు దిక్కుగా ఈ గ్రహాల పెరేడ్ కనిపిస్తుంది. మెర్క్యురీ, మార్స్, శని గ్రహాలను నేరుగానే చూడొచ్చు. నెప్ట్యూన్ ని చూడాలంటే మాత్రం బైనాక్యులర్స్ ఉండాలి. సూర్యుడు చుట్టూ తిరిగే క్రమంలో గ్రహాలు ఇలా ఒకటే లైన్ లో రావడం అరుదుగా జరుగుతుంది.

అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం
World· 18 Apr 2026

అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం

ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరిచిందన్న ఆనందం ప్రపంచ దేశాలకు ఒక్క రోజు కూడా మిగల్లేదు. అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. బుధవారం లోపు ఇరాన్ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోకపోతే ఆ దేశంపై బాంబుల కురిపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనికి కౌంటర్ గా ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ మీద ఆంక్షలు పెట్టినా, బాంబులు పడినా మళ్లీ హార్మూజ్ జలసంధిని మూసేస్తామన్నారు. ఈ రూట్ బ్లాక్ అయితే ప్రపంచానికి ఆయిల్ సప్లై ఆగిపోతుంది. దీంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది.

మెటాలో మళ్లీ లేఆఫ్ లు
Business· 18 Apr 2026

మెటాలో మళ్లీ లేఆఫ్ లు

టెక్కీలకు ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా మళ్లీ భారీ షాక్ ఇవ్వబోతోంది. మే 20 కల్లా దాదాపు 8,000 మంది ఎంప్లాయీస్ ని తొలగించడానికి సంస్థ సిద్ధమవుతున్నట్టు ఇంటర్నేషనల్ మీడియా కథనాలు రాస్తోంది. మార్క్ జుకర్‌బర్గ్ ఫోకస్ మొత్తం ఇప్పుడు 'AI' మీదకి షిఫ్ట్ అవ్వడమే దీనికి మెయిన్ రీజన్ . ఇన్వెస్ట్‌మెంట్స్ ఏఐకి మళ్లించి, ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డారట. ఇదే కనుక జరిగితే వేలాది మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారబోతోంది.

మంటల్లో ఏసీ బస్సు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం▶
Local· 18 Apr 2026

మంటల్లో ఏసీ బస్సు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం

హైదరాబాద్ లో ఘోర బస్సు ప్రమాదం నుంచి 18 మంది ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. శ్రీ దుర్గా మహేశ్వరి ట్రావెల్స్ కి చెందిన ఏసీ బస్సు KPHB దగ్గర మంటల్లో చిక్కుకుంది. మియాపూర్ నుంచి పాలకొల్లు వెళుతుండగా శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సిబ్బంది వెంటనే స్పందించి అందులో ఉన్న 18 మంది ప్రయాణికుల్ని దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉంది.

మీరేం తింటారు ? అన్నమా, జొన్నలా
Local· 18 Apr 2026

మీరేం తింటారు ? అన్నమా, జొన్నలా

కేంద్రం చేపట్టిన జనాభా లెక్కల్లో ఈ ప్రశ్న కూడా అడుగుతున్నారు. ప్రజల ఆహార అలవాట్లు కూడా తెలుసుకుంటున్నారు. వరి అన్నం, గోధుమ రొట్టెలు కాకుండా జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలేమైనా తింటున్నారా అన్న ప్రశ్న కూడా సెన్సస్ లెక్కల్లో ఉంది. ఇలా ప్రజల ఆహారపు అలవాట్లను తెలుసుకొని వాటి ఆధారంగా రేషన్ కార్డుల్ని పంపిణీ చేయాలన్నదే కేంద్రం ఆలోచనగా ఉంది. రేషన్ కార్డులపై ఇప్పటివరకు బియ్యం, గోధుమలే సరఫరా చేస్తున్నారు. ఇకపై చిరు ధాన్యాలు కూడా పంపిణీ చేయడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో పడిపోయిన భారత్ స్థానం
World· 18 Apr 2026

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో పడిపోయిన భారత్ స్థానం

ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ తన స్థానాన్ని కోల్పోయింది. గత మేలో జపాన్ ను దాటేసి 4వ స్థానానికి చేరుకున్న మన దేశం IMF తాజా ర్యాంకింగ్స్ లో ఆరోస్థానానికి పడిపోయింది. జపాన్, బ్రిటన్ తర్వాత స్థానంలో భారత్ ఉంది. అమెరికా, ఇరాన్ వార్, రుపీ వాల్యూ దారుణంగా పడిపోవడమే దీనికి రీజన్స్. ప్రభుత్వం మాత్రం వచ్చే ఏడాదికి మళ్లీ నాలుగో స్థానానికి వెళ్లిపోతామని ధీమాగా చెబుతోంది.

 డీ లిమిటేషన్ బిల్లు  ఉపసంహరణ
Politics· 17 Apr 2026

డీ లిమిటేషన్ బిల్లు ఉపసంహరణ

డీ లిమిటేషన్ బిల్లును కేంద్రం విత్ డ్రా చేసుకుంది. బిల్లుపై జరిగిన ఓటింగ్ లో అనుకూలంగా 298 ఓట్లు, ప్రతికూలంగా 230 ఓట్లు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డీలిమిటేషన్ కు అనుకూలంగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఓటింగ్ కు పెట్టినప్పుడు మూడింటా రెండొంతుల మెజారిటీ సాధించలేకపోయింది. దాంతో బిల్లు సవరణకు ఆమోదం లభించలేదని స్పీకర్ ఓం ప్రకాష్ బిల్లా ప్రకటించారు. లోక్ సభ రేపటికి వాయిదా పడింది.

ప్రపంచానికి ఇరాన్ గుడ్ న్యూస్
World· 17 Apr 2026

ప్రపంచానికి ఇరాన్ గుడ్ న్యూస్

ప్రపంచ దేశాలు ఇంక ఊపిరి పీల్చుకోవచ్చు. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్టు ఇరాన్ ప్రకటించింది. చమురు రవాణా నౌకల రాకపోకల్ని అడ్డుకోబోమని తెలిపింది. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. కాల్పుల విరమణ అమల్లో ఉన్నన్నాళ్లూ జలసంధిని తెరిచే ఉంచుతామని స్పష్టం చేసింది.