Latest

డీ లిమిటేషన్ బిల్లు ఉపసంహరణ
డీ లిమిటేషన్ బిల్లును కేంద్రం విత్ డ్రా చేసుకుంది. బిల్లుపై జరిగిన ఓటింగ్ లో అనుకూలంగా 298 ఓట్లు, ప్రతికూలంగా 230 ఓట్లు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డీలిమిటేషన్ కు అనుకూలంగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఓటింగ్ కు పెట్టినప్పుడు మూడింటా రెండొంతుల మెజారిటీ సాధించలేకపోయింది. దాంతో బిల్లు సవరణకు ఆమోదం లభించలేదని స్పీకర్ ఓం ప్రకాష్ బిల్లా ప్రకటించారు. లోక్ సభ రేపటికి వాయిదా పడింది.

ప్రపంచానికి ఇరాన్ గుడ్ న్యూస్
ప్రపంచ దేశాలు ఇంక ఊపిరి పీల్చుకోవచ్చు. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్టు ఇరాన్ ప్రకటించింది. చమురు రవాణా నౌకల రాకపోకల్ని అడ్డుకోబోమని తెలిపింది. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. కాల్పుల విరమణ అమల్లో ఉన్నన్నాళ్లూ జలసంధిని తెరిచే ఉంచుతామని స్పష్టం చేసింది.
కంగనా రనౌత్: రాహుల్ గాంధీ స్పీచ్ తలనొప్పిలా అనిపించింది!
పార్లమెంటులో రాహుల్ గాంధీ స్పీచ్ పై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మీడియా ముందు ఘాటుగా స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడకుండా, రాహుల్ తన వ్యక్తిగత విషయాలు చెప్పడం తలనొప్పిలా అనిపించిందని విమర్శించారు. ఆయన మాటలు ఒక న్యూసెన్స్ లా ఉన్నాయని, పార్లమెంటు గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయని మండిపడ్డారు.
మమతా బెనర్జీని భయపెట్టిన అభిమాని.. అసలేం జరిగిందంటే?
జల్పాయ్గురి పాదయాత్రలో సిఎం మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. ఒక అభిమాని ఒక్కసారిగా సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని ఆమె కాళ్లపై పడబోయాడు. ఈ ఊహించని పరిణామంతో మమత తీవ్రంగా భయపడి వెనక్కి పరుగెత్తారు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిని పక్కకు లాగేశారు. ఈ ఇన్సిడెంట్ వల్ల ఆమె కొద్దిసేపు పాదయాత్రను ఆపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

రాహుల్ గాంధీపై ఎఫ్ ఐ ఆర్
డ్యుయల్ సిటిజన్ షిప్ ( ద్వంద్వ పౌరసత్వం) కేసులో రాహుల్ గాంధీ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని యూపీ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఓ బిజెపి కార్యకర్త వేసిన పిటిషన్ ఆధారంగా కోర్టు ఈ డెసిషన్ తీసుకుంది. రాహుల్ గాంధీ కి బ్రిటన్ సిటిజన్ షిప్, ఇండియన్ సిటిజన్ షిప్ రెండూ ఉన్నాయని కాబట్టి ఆయన లోక్ సభ సభ్యుడుగా, చట్టబద్ధ పదవులకు అర్హుడు కాదంటూ పిటిషనర్ వాదించాడు. ఆధారాలు చూసిన హైకోర్టు రాహుల్ పై ఎఫ్ ఐఆర్ కు ఆదేశించింది.
పాస్టర్ ఇంట్లో కోట్లల్లో నోట్ల కట్టలు
నరసాపురం లక్ష్మణేశ్వరంలోని పాస్టర్ జాన్ బాబు ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయట పడ్డాయి. మనీ అంటే అంతా ఇంతా కాదు, ఏకంగా ₹2.27 కోట్లు దొరికాయి. ఇంత Heavy cash చూసి ఐటీ అధికారులు షాక్ అయ్యి రంగంలోకి దిగారు. ఆ నిధుల మూలం ఏంటి, అది చట్టబద్ధమైనదేనా కాదా అని Documents కోసం గాలిస్తున్నారు. మొత్తానికి ఈ Money ఇంత మొత్తంలో ఎక్కడ నుంచి ఎలా వచ్చింది అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్!
నేను బతికే ఉన్నాను బాబోయ్! శవ వస్త్రంతో కలెక్టర్ ఆఫీసుకి..
రెవెన్యూ రికార్డుల్లో తనను చనిపోయినట్లు చూపించడంతో, ఇషాక్ అలీ అనే వ్యక్తి శవంపై కప్పే గుడ్డ కప్పుకుని కలెక్టర్ ఆఫీసుకి వచ్చారు. 2012లోనే ఒక క్లర్క్ ఇతన్ని చనిపోయినట్లు రికార్డు చేసి, తన ఆస్తిని వేరే మహిళ పేరు మీదకు మార్చేశారు. తాను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి ఇషాక్ గత 7 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇది చూసి అధికారులు షాక్ అయ్యారు.

ఉప్పల్ మెట్రోలో బాంబుల కలకలం !!
ఉప్పల్ మెట్రో డస్ట్బిన్లో ఏవో అనుమానాస్పద వస్తువులు కనిపించేసరికి అందరూ Bomb అనుకుని Panic అయ్యారు. వెంటనే పోలీసులు ఎంట్రీ ఇచ్చి చెక్ చేస్తే, అవి జస్ట్ సెలబ్రేషన్ టపాకాయలని తేలింది. దాంతో అందరూ Huge relief ఫీలయ్యారు. మొత్తానికి ఆ False alarm తో కాసేపు అందరికీ టెన్షన్ హై రేంజ్లో పెరిగిపోయింది. తీరా అవి మామూలు టపాసులని తేలాక కూల్ బ్రో అనుకున్నారంతా...

నెక్స్ట్ ఎగ్జిట్ హరీష్ యేనా?
బీఆర్ ఎస్ లో అంతా బానే ఉందా? పైకి బానే ఉన్నా లోపల ఇంటర్నల్ వార్ చాలా తీవ్రంగా ఉందని పొలిటికల్ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. కేసీఆర్ మౌనం మరో వైపు కేటీఆర్, హరీష్ మధ్య పైకి కనపడని ఆధిపత్య పోరు నడుస్తోందని పార్టీని వీడుతున్న వారు ఆప్ ది రికార్డుగా చెబుతున్న మాట. దీనికి తోడు పార్టీనుంచి వేటు పడిన కవిత చేస్తున్న ఆరోపణలు కూడా బాగా ఇబ్బందిపెడుతున్నాయి. అతి త్వరలో హరీష్ రావ్ ని పార్టీనుంచి బయటకు పంపనున్నారంటూ ఓ వర్గం కోడై కూస్తోంది... ఇదంతా చూస్తుంటే దాల్ మే కుచ్ కాలా హై.. అనిపిస్తోంది..

బుమ్రా ఫామ్లోకి రావాలంటే ఇది ఒక్కటే మార్గం!
ఐపీఎల్ 2026లో బుమ్రా వికెట్లు తీయలేకపోవడానికి కారణం అతడి Bowling Speed తగ్గడమే అని ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ప్రస్తుతం బుమ్రా సగటున 130 kmph వేగంతోనే బౌలింగ్ చేస్తున్నాడని, దాదాపు 44% స్లో బాల్స్ వేస్తున్నాడని పఠాన్ విశ్లేషించారు. స్లో బాల్స్ తగ్గించి, మళ్ళీ పాత వేగంతో బౌలింగ్ చేస్తేనే వికెట్లు వస్తాయని, ఇది చాలా సింపుల్ సొల్యూషన్స్ అని బుమ్రాకు సూచించారు.
డిపాజిట్ స్లిప్ రాస్తూ అక్కడే కుప్పకూలి!!
బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చి డిపాజిట్ స్లిప్ లో వివరాలు రాస్తూ అలాగే కూర్చున్న చోట నుండి కిందపడిపోయి మృతి చెందారు..! నాచారంలో రిటైర్డు ఉద్యోగి లక్ష్మీనారాయణ బుధవారం హబ్సిగూడలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చి హార్ట్ ఎటాక్ రావడంతో కుప్పకూలి పోయారు.. బ్యాంక్ సిబ్బంది హాస్పిటల్ కు తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు చెప్పారు..! ఎండాకాలం పెద్దవాళ్లని సాధ్యమైనంతవరకు బయటకు వెళ్లనీయకపోవడమే మంచిది..!
నాకు, ప్రధానికి భార్యల ఇష్యూ లేదు - రాహుల్
మహిళా రిజర్వేషన్ల అమలుపై లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. మహిళా సాధికారతో ముసుగులో దేశ రాజకీయ చిత్ర పటాన్ని మార్చే ప్రయత్నం కేంద్రం చేస్తోందని ఆరోపించారు. కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రమే అయితే తాము మద్దతునిస్తామన్నారు. ఈ సభలో ఉన్న వాళ్లందరూ మహిళల నుంచి ఎంతో కొంత ప్రభావితం అయ్యే ఉంటారన్నారు. తల్లి, చెల్లి, భార్య ఇలా అందరి దగ్గర నుంచి నేర్చుకుంటామన్నారు. అలా అంటూనే ప్రధానికి, తనకి భార్యల ఇష్యూ లేదని కామెంట్ చేసి సభలో నవ్వులు పూయించారు.

ఫస్ట్ ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ సిద్ధం
ప్రపంచంలోనే మొట్ట మొదటి ఎయిర్ టాక్సీ స్టేషన్ దుబాయ్ లో రెడీ అయింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నిర్మించిన ఈ స్టేషన్ నుంచి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీలు రన్ అవుతాయి. కారులో ప్రయాణిస్తే 45 నిముషాల్లో పట్టే దూరాన్ని ఈ ఎయిర్ టాక్సీల్లో కేవలం 10 నిముషాల్లో చేరుకోవచ్చు. ఏడాది చివర్లో ఇది అందుబాటులోకి వస్తుంది. దీంతో ట్రాఫిక్ జామ్ కష్టాలు తీరిపోతాయి. ఏడాదికి లక్షా 70 వేల మంది ప్రయాణించడానికి సదుపాయాలు కల్పిస్తున్నారు.

తేజస్వి సూర్య కామెంట్స్ పై టీ-కాంగ్రెస్ ఎంపీల నిరసన
రాష్ట్ర విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు. పార్లమెంటు ఆవరణలో నిరసనలకు దిగిన వారు తేజస్వి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ఓం బిర్లాను కలిసి విభజనపై వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. భారత్, పాక్ విభజన కంటే అన్యాయంగా ఏపీ విభజన జరిగిందని తేజస్వి కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

ఆసియాలో అపర కుబేరుడు అదానీ
గౌతమ్ అదానీ ఇప్పుడు ఆసియాలోనే రిచెస్ట్ పర్సన్. ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి మరీ ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అదానీ రికార్డులకెక్కారు. బ్లూమ్ బర్గ్ బిలయనీర్ ఇండెక్స్ ప్రకారం అదాని సంపద 92.6 బిలియన్ డాలర్లకు చేరుకోగా, అంబానీ సంపద 90.8 బిలియన్ డాలర్లుగా ఉంది. గత కొన్ని రోజుల్లో అదాని గ్రూప్ షేర్లు బాగా పెరగడం వల్ల ఇది సాధ్యమైంది.

ధురంధర్ 2లో దావూద్ పాత్ర సరిగా లేదు : ఆర్జీవీ
బ్లాక్బస్టర్ మూవీ ధురంధర్ 2పై మూవీ టేకింగ్ ను ఓ రేంజ్ లో పొగిడేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అందులో వాస్తవాలు చూపించలేదన్నారు. అండర్ వరల్డ్ మూవీస్ కి పెట్టింది పేరైన ఆర్జీవీ ధురంధర్ లో దావూద్ ఇబ్రహీం పాత్రను సరిగా చిత్రీకరించలేదన్నారు. సినిమాలో చూపించినట్లుగా ఆయన ఇప్పటికీ నెట్వర్క్ను నడిపిస్తున్నాడనేది వాస్తవం కాదన్నారు. దావూద్ 20 ఏళ్ల క్రితమే నేర ప్రపంచం నుండి రిటైర్ అయ్యాడని అన్నారు.

భారత ఉపగ్రహాలకు 1.5 లక్షల ప్రమాద హెచ్చరికలు
అంతరిక్షంలో పెరుగుతున్న వ్యర్థాలు (Space Debris) ఉపగ్రహాల సంఖ్య భారత్కు అతి పెద్ద సవాల్ గా మారాయి. 2025లో Indian Space Assetsకి ఇతర వస్తువుల వల్ల ప్రమాదం కలగవచ్చని ఏకంగా 1.5 లక్షల కంటే ఎక్కువ “కొలిజన్ అలర్ట్స్” ఉపగ్రహాలను ఢీకొనే ప్రమాద హెచ్చరికలు అందాయి. దీనివల్ల ఇస్రో ఉపగ్రహాలను రక్షించుకోవడానికి అనేకసార్లు వాటి కక్ష్యలను మార్చాల్సి వచ్చింది. అంతరిక్షంలో ట్రాఫిక్ అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలకు ముప్పుగా మారింది.

ట్రంప్ వన్నీ పగటి కలలు - ఇరాన్
ఇరాన్ తో శాంతి ఒప్పందం రేపో మాపో కుదురుతుందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల్ని ఇరాన్ కొట్టిపారేసింది. ట్రంప్ గాల్లో మేడలు కడుతున్నారని ఎద్దేవా చేసింది. ఒంటె పత్తి గింజల కలలు కంటోంది The camel dreams of cottonseed అనే పర్షియన్ సామెతతో ట్రంప్ ని ట్రోల్ చేసింది. అంటే ట్రంప్ వన్నీ పగటికలలేనని అంటోంది. ఇరాన్ కామెంట్స్ తో పశ్చిమాసియాలో శాంతిస్థాపన ఎప్పుడు జరుగుతుందోనన్న ఆందోళన మొదలైంది.
రామాయణాన్ని అవమానించిన ప్రకాశ్ రాజ్, కేసు నమోదు
నటుడు ప్రకాష్ రాజ్ కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో రామాయణాన్ని అపహాస్యం చేస్తూ వివాదాన్ని రేపారు. రాముడు నార్త్ ఇండియన్ అని , రావణుడు దక్షిణాదికి చెందిన గిరిజన రాజు అని చెప్పారు. రామ లక్ష్మణులు రావణుడికి చెందిన పొలంలో పళ్లు దొంగతనం చేయడం వల్లే యుద్ధం జరిగిందంటూ రామాయణాన్ని వక్రీకరించారు. ప్రకాశ్ రాజ్ హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా ప్రాంతీయ విభేదాలు రేపారంటూ ఢిల్లీ అడ్వకేట్ అమితా సచ్ దేవ ఆయనపై కేసు పెట్టారు.
అల్లరి చేస్తోందని కట్టేసి ఎండలో !!
అల్లరి చేస్తోందని కాళ్లు చేతులు కట్టేసి ఎండలో నేలపై బోర్లా పడుకోబెట్టి గేటుకు కట్టేసింది పంజాబ్ లో ఓ ASI . మండుటెండకు ఆ చిన్నారి ఒళ్లు కాలి విల విల ఏడుస్తున్నా పట్టించుకోలేదు. చివరికి పక్కింటి వారు జాలితో విడిపించడానికి వస్తే ఆమెను అలాగే లోపలికి తీసుకెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సొంత మనమరాలి పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించిన ఆ ASI ని చివరకు డిపార్టుమెంటు సస్పెండ్ చేసింది.

ఇరాన్ పై ట్రంప్ అతి పెద్ద ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. ఇరాన్ తన వద్ద ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం మొత్తాన్ని అప్పగించేందుకు అంగీకరించిందని వెల్లడించారు. అమెరికా ఆంక్షలు, ఒత్తిడి నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ డీల్ అమల్లోకి వస్తే ఇరాన్ అణ్వాయుధాల తయారీని అడ్డుకోవచ్చునని అమెరికా భావిస్తుంది. దీంతో పశ్చిమాసియాలో శాంతి నెలకొనడంతో పాటు ప్రపంచ దేశాల చమురు కష్టాలు తీరిపోతాయి. అయితే దీనిపై ఇరాన్ నుంచి అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.