Latest

మహిళా రిజర్వేషన్ అమలు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్
Politics· 17 Apr 2026

మహిళా రిజర్వేషన్ అమలు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే నారీశక్తి వందన్ అధియన్ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఏప్రిల్ 16 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చినట్టుగా కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2029 నుంచి రిజర్వేషన్ల అమలు, డీలిమిటేషన్ పై చర్చ జరుగుతున్న వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సాంకేతిక కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ చట్టం ప్రకారం తదుపరి జనగణన తర్వాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి.

పదో యుద్ధం ఆపా ః ట్రంప్
World· 17 Apr 2026

పదో యుద్ధం ఆపా ః ట్రంప్

ఇజ్రాయెల్ ,లెబనాన్ మధ్య పదిరోజుల తాత్కాలిక సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. శాంతి ఏర్పాటు కోసం రెండు దేశాలు ఒప్పుకున్నాయన్నారు. ఈ చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ పై పెట్టినట్లు చెప్పారు. దాదాపు 34 ఏళ్ల తర్వాత ఇరు దేశాల ప్రతినిధులు తొలిసారి భేటీ అయ్యారన్నారు. ఇరు దేశాధ్యక్షులతోనూ తాను మాట్లాడానని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో ఎనౌన్స్ చేశారు. దీంతో కలిపి ఇప్పటి వరకూ పది యుద్ధాలు ఆపానన్నారు.

  ఆ ఫ్లైట్స్ లో స్లీపర్ సీట్స్ !1
World· 17 Apr 2026

ఆ ఫ్లైట్స్ లో స్లీపర్ సీట్స్ !1

బస్సులు, రైళ్లే కాదు.. లాంగ్ జర్నీస్ చేసే ప్లైట్స్ లోనూ స్లీపర్ సీట్స్, బెడ్స్ వచ్చేస్తున్నాయి. ఎయిర్ న్యూజీలాండ్ విమాన సర్వీసుల్లో17 గంటల పాటు జర్నీ చేయాల్సి వస్తే స్కైనెస్ట్ పాడ్స్ పేరుతో ఈ ఫెసిలిటీ కల్పిస్తారు. ఈనవంబర్ నుంచి న్యూయార్క్, ఆక్లాండ్ సర్వీసుల్లో ఇవి అందుబాటులో ఉంటాయ్. ఇందులో ఒకేసారి ఆరుగురు నిద్రపోవచ్చు. 4 గంటల తర్వాత ఇతర ప్రయాణికులు దీనిని ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ సర్వీస్ ను ముందుగానే ఆప్ట్ చేయాలి.

బాబోయ్ ఎండలు 6 రోజులు బయటకి రావొద్దు
Local· 17 Apr 2026

బాబోయ్ ఎండలు 6 రోజులు బయటకి రావొద్దు

తెలంగాణ నిప్పుల కొలిమిలా మారింది. ఎండల తీవ్రతతో పాటు వడగాలులు నమోదయ్యాయి. మరో 6 రోజులు ఎండలు దంచికొడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటలవరకు వేడి గాలులు వీచే అవకాశం ఉందని, ఆ సమయంలో బయటకు రావడం మంచిది కాదని సూచించింది. బయటకు వెళ్లాల్సి వస్తే చెవుల్లోకి వేడి గాలులు వెళ్లకుండా తలకి రుమాలు ధరించి, నల్ల కళ్లద్దాలు పెట్టుకోవాలని, డీ హైడ్రేషన్ అవకుండా అరగంటకోసారి మంచినీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో  రమావత్ మధు అరెస్ట్ !!
Crime· 17 Apr 2026

మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో రమావత్ మధు అరెస్ట్ !!

సింగర్ మంగ్లీకి చెందిన మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు రమావత్ మధును అరెస్టు చేశారు. ఈ బిజినెస్ పేరిట దాదాపు 150కోట్ల వరకూ మధు టీమ్ అరెస్టు చేసినట్లు ఆరోపణలున్నాయి. సైబరాబాద్ పీఎస్ లో ఇప్పటికే మధుపై అనేక కేసులున్నాయి. ఈ కేసు వెలుగు చూసిన దగ్గరనుంచి మధు అజ్ఞాతంలోకి వెళిపోగా సింగర్ మంగ్లీ తనను అనవసరంగా ఈ కేసులోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల అడ్వకేట్ సుబ్బారావు, మంగ్లీ పరస్పరం కేసులు పెట్టుకున్నారు.

చార్లీ చాప్లిన్ సందేశం
Motivational· 16 Apr 2026

చార్లీ చాప్లిన్ సందేశం

దూరానికి ఆనందంగానూ, దగ్గరకి విషాదంగానూ కనిపించేదే జీవితం

రైల్వే స్టేషన్‌లో రచ్చ: టికెట్ ఇవ్వమంటే Ludo ఆడుతున్నారు?▶
Politics· 16 Apr 2026

రైల్వే స్టేషన్‌లో రచ్చ: టికెట్ ఇవ్వమంటే Ludo ఆడుతున్నారు?

రైల్వే స్టేషన్‌లో టికెట్ బుకింగ్ సమయంలో ఒక ప్రయాణికుడికి, రైల్వే క్లర్క్‌కు మధ్య పెద్ద గొడవ జరిగింది. టికెట్ కోసం వెళ్తే OT మరియు Payment పేరుతో తనను గంటల తరబడి నిలపెట్టారని ఆ ప్రయాణికుడు ఆరోపించారు. చివరకు టికెట్ ఇవ్వడానికి కూడా ఆ మేడమ్ నిరాకరించారని ఆయన మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం Social Mediaలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రైల్వే వ్యవస్థ పనితీరుపై రకరకాలుగా స్పందిస్తున్నారు.

జాబ్ వద్దు.. అడుక్కోవడమే ముద్దు!▶
Local· 16 Apr 2026

జాబ్ వద్దు.. అడుక్కోవడమే ముద్దు!

సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన అడుక్కుంటున్న మహిళలను ఒక యువతి నిలదీసింది. వారికి నెలకు 5,000 వేల రూపాయల జీతంతో జాబ్ ఇస్తానని ఆఫర్ చేసింది. కానీ, ఆ మహిళలు ఆ పనిని నిరాకరించి తిరిగి అడుక్కోవడమే మొదలుపెట్టారు.

డబ్బులిస్తే MLA పదవికి రాజీనామా చేస్తాం: చంద్రబాబుకు ఆఫర్!
Politics· 16 Apr 2026

డబ్బులిస్తే MLA పదవికి రాజీనామా చేస్తాం: చంద్రబాబుకు ఆఫర్!

గత ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బు తిరిగి ఇస్తే, తన తండ్రి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ఆదిమూలం కుమారుడు సుమన్ TDPకి సంచలన ప్రతిపాదన చేశారు. SC నియోజకవర్గంలో అగ్రవర్ణ వ్యక్తిని ఇన్‌చార్జ్‌గా నియమించడంపై ఆయన మండిపడ్డారు. దళిత ఎమ్మెల్యేను వేధిస్తున్నారని, తమపై పార్టీ సభ్యులే కుట్ర పన్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని, తమకు గౌరవం లేని చోట ఉండలేమని స్పష్టం చేశారు.

ఏపిలో 38, తెలంగాణలో  26 ఎంపీ సీట్లు ః అమిత్ షా
Politics· 16 Apr 2026

ఏపిలో 38, తెలంగాణలో 26 ఎంపీ సీట్లు ః అమిత్ షా

దక్షిణాదికి జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతాయని హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో చెప్పారు. విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. డీలిమిటేషన్ బిల్లు ప్రకారం ఏపీకి 25నుంచి 38కి, తెలంగాణకు 17నుంచి 26కి ఎంపీ సీట్లు పెరుగుతాయి.కర్ణాటకలో 28నుంచి 42,తమిళనాడులో 39 నుంచి 59కి, కేరళలో 20నుంచి 30కి సీట్లు పెరుగుతాయి. డీలిమిటేషన్ పై జరిగిన చర్చ సందర్భంగా షా ఈ డీటైల్స్ తెలిపారు.

జననాయగన్ లీకేజ్ కేసులో ఆరు అరెస్టులు !!
Politics· 16 Apr 2026

జననాయగన్ లీకేజ్ కేసులో ఆరు అరెస్టులు !!

తలపతి విజయ్ జననాయగన్ మూవీ ఆన్ లైన్ లీక్ కేసులో ఆరుగురిని చెన్నై సైబర్ క్రైమ్ వింగ్ అరెస్టు చేసింది. దీనిలో లీకేజికి అసలు కారకులైన ప్రధాన నిందితులు ముగ్గురిని విచారిస్తున్నారు. మూవీ రీల్స్ ను దొంగిలించిన వ్యక్తి మరో మూవీకి ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేస్తున్నాడు. మూవీ ఎడిటింగ్ స్టూడియోకి ఆథరైజ్డ్ యాక్సెస్ లేకపోయినా దానిని దొంగగా యాక్సెస్ చేసి ఆ రీల్స్ ను మూవీ రీల్స్ లా కన్వర్ట్ చేసి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశాడు.

రెస్పెక్ట్  నేషన్ ఫస్ట్ః ఒమర్
Politics· 16 Apr 2026

రెస్పెక్ట్ నేషన్ ఫస్ట్ః ఒమర్

జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ ఫరూక్ రీసెంట్ గా సోల్ ఫుల్ కశ్మీర్ పేరిట హ్యాట్ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఓ హ్యాండీ క్రాఫ్ట్స్ మేళా కి వెళ్లారు. అక్కడ ఓ వింత జరిగింది.మువ్వన్నెల పతాకం రంగుల్లో ఉన్న ఓ రిబ్బన్ కట్ చేయాల్సి వచ్చింది.ఒమర్ వెంటనే రిబ్బన్ కటింగ్ మానుకున్నారు. ఆ రిబ్బన్ ను జాగ్రత్తగా విప్పి మడిచి ప్యాక్ చేశారు. ఒమర్ చర్యని నెటిజన్లు ప్రశంసిస్తుంటే రైట్ వింగ్ వారు మాత్రం మూడు రంగులంటే గిట్టదా అని సెటైర్లు వేస్తున్నారు.

రాఘవ్ చద్దాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ !!
Politics· 16 Apr 2026

రాఘవ్ చద్దాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ !!

రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు, ఆప్ పార్టీకి మధ్య గ్యాప్ మరింత పెరుగుతోంది. రీసెంట్ గా చద్దా టాప్ బీజేపి లీడర్స్ ను మీట్ అయ్యారని, తొందరలో బీజేపిలో చేరతారని తమకు ఇన్ఫర్మేషన్ ఉందన్న ఆప్ ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీని తొలగించింది. చిత్రంగా ఆ వెంటనే కేంద్రం ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. రాఘవ్ చద్దాకు త్రెట్ ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయని అందుకే సెక్యూరిటీ కల్పిస్తున్నామంటోంది కేంద్రం. చద్దా ఆప్ పార్టీ కో ఫౌండర్ కూడా .

ఆశాజీకి పాక్ అభిమానుల నివాళులు !!
Politics· 16 Apr 2026

ఆశాజీకి పాక్ అభిమానుల నివాళులు !!

లెజెండరీ సింగర్ ఆశా భోస్లే స్మృతికి నివాళుల పోస్టర్లు పాకిస్థాన్లో అక్కడక్కడా వెలవడం ఇప్పుడు వైరల్ అయింది. 2018 నుంచి భారత కంటెంట్ పై పాకిస్థానీ మీడియాలో బ్యాన్ ఉంది. అయినప్పటికీ ఆశాజీ అభిమానులు దీన్ని లెక్క చేయడం లేదు. లాహోర్ యూనివర్సిటీ బయట ఆశాజీకి నివాళులర్పిస్తూ వేసిన పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు అక్కడక్కడా ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. షేధాన్ని సైతం లెక్క చేయకుండా ఆ గాన కోకిలకు ఆమె అభిమానులు నివాళులర్పించడం చూస్తే మ్యూజిక్ కి హద్దులు లేవు అనిపిస్తుంది.

చేతులు లేకపోయినా తగ్గేదేలే! ఈ చిన్నారి నవ్వు చూస్తే మీ బాధలన్నీ మర్చిపోతారు!▶
Entertainment· 16 Apr 2026

చేతులు లేకపోయినా తగ్గేదేలే! ఈ చిన్నారి నవ్వు చూస్తే మీ బాధలన్నీ మర్చిపోతారు!

వైకల్యం ఆ చిన్నారి ఉత్సాహాన్ని ఆపలేకపోయింది. రెండు చేతులు లేకపోయినా, తన కాళ్లతోనే తోటి పిల్లలతో ఆడుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ చిన్నారి ముఖంలోని నిష్కల్మషమైన చిరునవ్వు ప్రస్తుతం Social Mediaలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

 ఏఐ టెక్నాలజీతో  ఇరాన్, ఇజ్రాయెల్ వార్  అప్డేట్స్
World· 16 Apr 2026

ఏఐ టెక్నాలజీతో ఇరాన్, ఇజ్రాయెల్ వార్ అప్డేట్స్

ఇరాన్, ఇజ్రాయెల్ వార్ ను జనం టీవీలు, బ్రేకింగ్ న్యూస్ లు చూసి తెలుసుకునే రోజలు పోయాయ్. ఇప్పుడు వార్ ను సైతం ఎఐ టెక్నాలజీతో చూసే ఫెసిలిటీ వచ్చేసింది. ఏ ఐ పవర్డ్ డ్యాష్ బోర్డులు, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టూల్స్, రియల్ టైమ్ ఇంటర్నెట్ వార్ రూమ్స్ ఇప్పుడు వచ్చేశాయి. ఈ ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ శాటిలైట్ టెక్నాలజీ, ఏవియేషన్ ట్రాకర్స్, సోషల్ మీడియా ఫీడ్స్,ఫైనాన్సియల్ సిగ్నల్స్, న్యూస్ ఎలర్ట్స్ అన్నింటిని ఒక ఇంటర్ ఫేస్ పై చూడొచ్చు

తమన్నా vs పవర్ సోప్స్: తమన్నా పిటిషన్ కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు..
Business· 16 Apr 2026

తమన్నా vs పవర్ సోప్స్: తమన్నా పిటిషన్ కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు..

హీరోయిన్ తమన్నా ‘పవర్ సోప్స్’ కంపెనీ తన ఫోటోలను అనధికారికంగా 2008లో జరిగిన అగ్రీమెంట్ గడువు ముగిసినా తన ఇమేజ్‌లను వాడుకుందని, అందుకు ఆ కంపెనీ నుండి కోటి రూపాయలు నష్టపరిహారం డిమాండ్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే, ఈ ఆరోపణలకు తగిన సాక్ష్యాలు లేవని కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పునే ద్విసభ్య ధర్మాసనం సమర్థించింది.

స్నేహితులు దాడి.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య!
Crime· 16 Apr 2026

స్నేహితులు దాడి.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య!

విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకల కోసం వెళ్లిన 27ఏళ్ల శాంతికుమారి అనే యువతి తన ఫ్రెండ్స్ దాడి చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. Birthday పార్టీ లో ఆల్కహాల్ తాగిన తర్వాత జరిగిన గొడవలో తన ఫ్రెండ్స్ ఆమె మీద దాడి చేసారు. ఈ అవమానం తట్టుకోలేక లాడ్జి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అరగంటలో వస్తానన్న కూతురు శవమై కనిపించడంతో తల్లి కన్నీరుమున్నీరవుతోంది.

నాలుగేళ్ల బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని
Politics· 16 Apr 2026

నాలుగేళ్ల బాలుడికి యాసిడ్ తాగించిన పిన్ని

కుటుంబ కలహాలు నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలపై దాడికి దారి తీశాయి. మేడ్చల్ మల్కాజ్ గిరిలో తన కొడుకును చిన్న చూపు చూస్తున్నారన్న కారణంగా తోటికోడలి కొడుకుకు యాసిడ్ ను డ్రింక్ గా నమ్మించి తాగించింది ఓ ఇల్లాలు. చాక్లెట్ కు ఆశ పడి ఆ బాలుడు యాసిడ్ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలుడికి ప్రత్యేక చికిత్స జరుగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లి కంప్లయింట్ తో విషయం వెలుగు చూసింది.

కసాయి తండ్రి: ఆస్తి కోసం కన్న కొడుకులను చంపాలని ప్లాన్!
Crime· 16 Apr 2026

కసాయి తండ్రి: ఆస్తి కోసం కన్న కొడుకులను చంపాలని ప్లాన్!

జనగామ జిల్లాలో రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బడితండా గ్రామంలో ఆస్తి కోసం కన్న కొడుకులను చంపాలనుకున్నాడు ఒక తండ్రి. 20 గుంటల భూమి కోసం శ్రీనివాస్ అనే వ్యక్తి తన రెండో భార్యతో కలిసి ఇద్దరు కుమారులకు బిస్కెట్లలో విషం కలిపి చంపాలని ప్లాన్ వేశాడు. ఇందుకోసం ఒకరికి డబ్బు కూడా ఇచ్చాడు. అయితే, ఆ వ్యక్తి భయపడి గ్రామస్తులకు చెప్పడంతో విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులకు 14 రోజులు Remand విధించారు. ఈ ఘోరం స్థానికంగా Sensationగా మారింది.

డీలిమిటేషన్ తో దక్షిణాదికి అన్యాయం జరగదు - ప్రధాని మోదీ
Politics· 16 Apr 2026

డీలిమిటేషన్ తో దక్షిణాదికి అన్యాయం జరగదు - ప్రధాని మోదీ

డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్ సభలో ప్రకటించారు. ఇండియా మొత్తాన్ని తాము ఒక్కటిగా చూస్తామే తప్ప విడి విడిగా చూడమని అన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు వీలు కల్పించే బిల్లుల్ని లోక్ సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజనతో ఎవరికీ అన్యాయం జరగదని అన్నారు. ఈ బిల్లును రాజకీయంగా చూడవద్దని, జాతి ప్రయోజనాల కోణంలో చూడాలని ప్రధాని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.