Latest

మెడ నొప్పి మెదడుపై ప్రభావం చూపుతుందా?
Health· 16 Apr 2026

మెడ నొప్పి మెదడుపై ప్రభావం చూపుతుందా?

ప్రెసెంట్ లైఫ్ స్టైల్ వల్ల మెడ నొప్పి కామన్ అయింది. మెడలోని నరాలపై ఒత్తిడి పడటం వల్ల రెగ్యులర్ గా తలనొప్పి లేదా తల తిరగడం వంటివి జరుగుతాయి. అయితే, మెడ నొప్పి వల్ల నేరుగా మెదడు దెబ్బతినదు. కానీ దీనిని నెగ్లెక్ట్ చేస్తే Migraine లేదా నరాల సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ప్రతిరోజూ తేలికపాటి మెడ వ్యాయామాలు చేయాలి, విటమిన్ D, B12 లెవల్స్ చెక్ చేసుకోవడం, స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడం ద్వారా ఈ ప్రాబ్లం ని తగ్గించుకోవచ్చు.

కోతిని తరమబోయి… సజీవ దహనం▶
Crime· 16 Apr 2026

కోతిని తరమబోయి… సజీవ దహనం

మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్‌లో ఒక రిసార్ట్ లో విషాదం చోటు చేసుకుంది. రిసార్ట్‌పై కప్పు మీదకి వచ్చిన కోతిని తరమడానికి అక్కడే పని చేస్తున్న ఉద్యోగి ఇనపరాడ్ ఉపయోగించాడు. ఆ రాడ్ హైటెన్షన్ విద్యుత్ తీగకు తగలడంతో మంటలు చెలరేగి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయి వైరల్ గా మారింది.

స్టార్ బౌలర్ రిటైర్మెంట్: 16 ఏళ్ల కెరీర్‌కు ఎండ్ కార్డ్!
Sports· 16 Apr 2026

స్టార్ బౌలర్ రిటైర్మెంట్: 16 ఏళ్ల కెరీర్‌కు ఎండ్ కార్డ్!

బంగ్లాదేశ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ రూబెల్ హుస్సేన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 16 ఏళ్ల తన కెరీర్ లో 159 మ్యాచ్‌లు ఆడి 193 వికెట్లు తీశాడు. ముఖ్యంగా 2015 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌ను ఓడించడంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. యార్కర్లు వేయడంలో దిట్ట అయిన రూబెల్, ఇకపై Domestic క్రికెట్ ఆడుతూ యువ ఆటగాళ్లకు సలహాలు ఇస్తానని తెలిపాడు. విరాట్ కోహ్లీతో గ్రౌండ్ లో గొడవ అప్పట్లో పెద్ద Sensation.

Cocktail-2 BTS షేర్ చేసిన రష్మిక▶
Entertainment· 16 Apr 2026

Cocktail-2 BTS షేర్ చేసిన రష్మిక

షాహిద్ కపూర్, రష్మిక మందన్నా, కృతి సనన్ నటిస్తున్న కాక్ టైల్ 2 మూవీ ఈ నెల 19న రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఇటలీలో షూటింగ్ జరుపుకున్న ఒక పాటకు సంబంధించిన బిహైండ్ ది సీన్స్ BTS క్లిప్స్ ని సోషల్ మీడియాలో రష్మిక షేర్ చేశారు.

అవురా అమ్మకచెల్లా రీ క్రియేట్: మళ్ళీ అదే స్టెప్పులతో అదరగొట్టిన హీరోయిన్!▶
Entertainment· 16 Apr 2026

అవురా అమ్మకచెల్లా రీ క్రియేట్: మళ్ళీ అదే స్టెప్పులతో అదరగొట్టిన హీరోయిన్!

'ఆపద్బాంధవుడు' హీరోయిన్ మీనాక్షి శేషాద్రికి ఇప్పుడు 62 ఏళ్లు. ఈ వయసులో కూడా ఆమె తన పాత పాటని రీ క్రియేట్ చేసింది, ఇప్పుడు కూడా అదే Expressions తో, అంత ఎనర్జీతో డ్యాన్స్ చేయడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో Social Mediaలో వైరల్ అవుతోంది. అప్పటికి ఇప్పటికీ ఆమె డాన్స్ లో ఏమాత్రం మార్పు రాలేదని ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు.

పాకిస్థాన్ లా ఏపీ విభజన : బీజేపీ ఎంపీ తేజస్వి ▶
Politics· 16 Apr 2026

పాకిస్థాన్ లా ఏపీ విభజన : బీజేపీ ఎంపీ తేజస్వి

లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా నుంచి పాకిస్థాన్ ను ఎంత అశాస్త్రీయంగా విడదీశారో, ఏపీ విభజన అంతకంటే దారుణంగా జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసే విభజన రాజకీయాలు అలాగే ఉంటాయని మండిపడ్డారు.

LeT కో ఫౌండర్ హమ్జాపై లాహోర్ లో కాల్పులు
Local· 16 Apr 2026

LeT కో ఫౌండర్ హమ్జాపై లాహోర్ లో కాల్పులు

లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థ కో ఫౌండర్ అమీర్ హమ్జాపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో హమ్జా తీవ్రంగా గాయపడితే అతనిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయ్యద్‌కు హమ్జా అత్యంత సన్నిహితుడు. భారత్ పై జరిగిన పలు ఉగ్రవాదుల దాడుల్లో హమ్జా హస్తం ఉంది.

డీలిమిటేషన్ బిల్లుపై విపక్షాల్లో చర్చ: ఎంపీలందరూ రావాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి!
Politics· 16 Apr 2026

డీలిమిటేషన్ బిల్లుపై విపక్షాల్లో చర్చ: ఎంపీలందరూ రావాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి!

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై విపక్షాల మధ్య భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. బెంగాల్ ఎన్నికల వల్ల TMC ఎంపీలు రాలేమని చెప్పగా, రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఎంపీలు రాకపోతే అది ప్రభుత్వానికి సపోర్ట్ చేసినట్లేనని హెచ్చరించారు. అటు తమిళనాడులో ఎన్నికలు ఉన్నా.. DMK ఎంపీలు మాత్రం హాజరవుతారని టీఆర్.బాలు స్పష్టం చేశారు. విపక్షాల ఐక్యతకు ఇది పెద్ద Testగా మారింది.

కిడ్నీ స్టోన్ కోసం వెళ్తే.. రెండు కిడ్నీలు తీసేశారు!▶
Crime· 16 Apr 2026

కిడ్నీ స్టోన్ కోసం వెళ్తే.. రెండు కిడ్నీలు తీసేశారు!

మధ్యప్రదేశ్‌లోని సత్నాలో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఘోరం జరిగింది. కిడ్నీలో రాళ్ల తొలగింపు కోసం ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్లిన రవిరాజ్ అనే వ్యక్తికి, డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల రెండు కిడ్నీలను తొలగించారు. పరిస్థితి విషమించి ఇన్ఫెక్షన్ సోకడంతో ట్రీట్మెంట్ మద్యలోనే అతను చనిపోయాడు. డాక్టర్ తన తప్పు ఒప్పుకోవడంతో స్థానికులు భారీగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అక్కడ పెద్ద Sensation అయ్యింది.

విజయ్‌ రోడ్‌షోకు పోటెత్తిన జనం!
Politics· 16 Apr 2026

విజయ్‌ రోడ్‌షోకు పోటెత్తిన జనం!

అసెంబ్లీ ఎలెక్షన్స్ ప్రచారంలో భాగంగా TVK అధినేత విజయ్ చెన్నైలో గ్రాండ్ రోడ్‌షో నిర్వహించారు. తన పార్టీ అభ్యర్థులకు మద్దతుగా 'Whistle' గుర్తుకు ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు. టి.నగర్, ఎగ్మూర్ ప్రాంతాల్లో జరిగిన ఈ ప్రోగ్రామ్‌కు అభిమానులు, యూత్ భారీగా తరలివచ్చారు. ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు రాకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణ కులాల లెక్కలు: ఏ వర్గం ఎంతో తెలుసా?
Politics· 16 Apr 2026

తెలంగాణ కులాల లెక్కలు: ఏ వర్గం ఎంతో తెలుసా?

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని కులాల పూర్తి వివరాలను రిలీస్ చేసింది. మొత్తం జనాభాలో BCలు 56.33% ఇందులో 10.08 శాతం వెనకబడిన ముస్లింలు ఉన్నారు, SCలు 17.43%, STలు 10.45%, మరియు OCలు 15.79% ఉన్నట్లు ఈ Data చెబుతోంది. OC కేటగిరీలో జనాభా మరియు భూముల పరంగా Reddy సామాజిక వర్గం ముందుంది. ఆ తర్వాత యాదవ, లంబాడ, ముదిరాజ్ వంటి వర్గాల దగ్గర ఎక్కువ భూములు ఉన్నాయి. ఏ కులం ఎంత Develop అయిందో ఈ Report క్లియర్‌గా చూపిస్తోంది.

పాస్ చేయమని ఇంటర్ బోర్డుకు స్టూడెంట్ ఫోన్!
Local· 16 Apr 2026

పాస్ చేయమని ఇంటర్ బోర్డుకు స్టూడెంట్ ఫోన్!

విశాఖకు చెందిన ఓ ఇంటర్ స్టూడెంట్ రిసల్ట్స్ కి ముందే బోర్డు ఆఫీసర్స్ కి ఫోన్ చేసి, తనను పాస్ చేయాలని కోరాడు. ఎక్సామ్ లో ఏం రాక Question Paperనే మూడుసార్లు రాశానని, ఆన్సర్ షీట్‌లో డబ్బులు కూడా పెట్టానని చెప్పడంతో ఆఫీసర్స్ షాకయ్యారు. పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసి, అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. సప్లిమెంటరీ ఏక్షామ్స్ బాగా రాయమని చెప్పారు. ఆ స్టూడెంట్ ఫైవ్ సబ్జెక్టుల్లో Fail అయ్యాడు.

131వ రాజ్యాంగ సవరణ సహా లోక్ సభలో 3 కీలక బిల్లులు
Politics· 16 Apr 2026

131వ రాజ్యాంగ సవరణ సహా లోక్ సభలో 3 కీలక బిల్లులు

దేశంలో ఒక చరిత్రాత్మక మార్పుకి పార్లమెంటు ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవగానే చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు వీలు కల్పించే మూడు హిస్టారిక్ బిల్లుల్ని కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టింది. నియోజకవర్గాల పునర్విభజన కోసం 131 రాజ్యాంగ చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాలా ప్రవేశపెట్టారు. మిగిలిన బిల్లుల్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు.

డీలిమిటేషన్ పత్రాలు దగ్ధం చేసిన స్టాలిన్
Politics· 16 Apr 2026

డీలిమిటేషన్ పత్రాలు దగ్ధం చేసిన స్టాలిన్

నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం జరుగుతూ ఉండడంతో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఫైర్ అయ్యారు. డీలిమిటేషన్ ప్రతుల్ని తగుల బెట్టి తన నిరసన తెలిపారు. గతంలో తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమ జ్వాలలు ఢిల్లీని తాకాయని, ఇప్పుడు ఈ బిల్లు ప్రతుల్ని దహనం చేసి మరో జ్వాలను రగిలించానని చెప్పారు.

డీలిమిటేషన్ బిల్లు గట్టెక్కేనా ?
Politics· 16 Apr 2026

డీలిమిటేషన్ బిల్లు గట్టెక్కేనా ?

వచ్చే ఎలక్షన్స్ నుంచి మహిళా రిజర్వేషన్ల అమలుకు వీలు కల్పించే 3 బిల్లుల్ని కేంద్రం ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్ సభలో ప్రవేశపెట్టనుంది. లోక్ సభ సీట్లు 850కి పెంపు, 2011 సెన్సస్ ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, మరో రెండు బిల్లులు ఉన్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లుకి రెండింట మూడో వంతు మెజార్టీ అవసరం. ప్రతిపక్ష కాంగ్రెస్ డీలిమిటేషన్ బిల్లుకి మద్దతు ఇవ్వబోమని ప్రకటించడంతో ఇదెలా గట్టెక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. 540 మంది సభ్యుల్లో ఎన్డీయేకి 292 సభ్యుల మద్దతు ఉంది. మరో 68 మంది మద్దతు అవసరం

మంత్రాలయం దగ్గర రోడ్డు ప్రమాదం 8 మంది మృతి
Crime· 16 Apr 2026

మంత్రాలయం దగ్గర రోడ్డు ప్రమాదం 8 మంది మృతి

కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలడోన వద్ద బొలెరో వాహనం, లారీ ఢీకొన్న ఘటనలో 8 మంది మరణించారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. కర్ణాటకలోని చిక్ మంగళూరుకు చెందిన భక్తులు శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

క్రిమినల్సే  బాధితులమని కంప్లైంట్లు ః మంగ్లీ
Crime· 16 Apr 2026

క్రిమినల్సే బాధితులమని కంప్లైంట్లు ః మంగ్లీ

స్కాం చేసిన వాళ్లే మీడియా ముందుకొచ్చి బాధితులమంటున్నారు. సుభాక్షేత్ర బిజినెస్ అనే పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి మధు అనే వ్యక్తి ఎండీగా ఉన్నాడు. మీడియా ముందు బాధితుడుగా మాట్లాడుతున్న హిమాకాంత్ రెడ్డి ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్. నేరం వారు చేసి నన్ను నా కుటుంబాన్ని ఇందులోకి లాగుతున్నారు. చాలా డీప్ గా దర్యాప్తు జరపండి అంటూ పోలీసులను కోరారు సింగర్ మంగ్లీ. తనకు సంబంధం లేని ఈ వివాదంలో నలిగిపోతూ రికార్డింగులు, ప్రోగ్రాములు వదులుకుంటున్నానని బాధపడుతోందామె..

స్టాండప్ కమెడియన్ అనుదీప్ డిటెన్షన్
Crime· 16 Apr 2026

స్టాండప్ కమెడియన్ అనుదీప్ డిటెన్షన్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నీహారిక, నరేష్ ల పెళ్లిళ్లపై సెటైరికల్ జోక్స్ వేసిన స్టాండప్ కమెడియన్ కటికల అనుదీప్ ను ప్రయాగ్ రాజ్ లో కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేరెంట్స్ ను కలవడానికి ప్రయాగ్ రాజ్ వెళ్లిన అనుదీప్ ను నిన్న సాయంత్రం 7 గం. కి డిటైన్ చేశారు. అతని పేరెంట్స్ తో కలిపి ట్రైన్ లో కాకినాడ తీసుకొస్తున్నారు. అనుదీప్ ఆన్ లైన్ వీడియోపై కాకినాడలో ఒక జనసేన నేత కంప్లైంట్ తో ఈ యాక్షన్ తీసుకున్నారు.

 ఇక మీకొ దండం ః ట్రంప్ తో సౌదీ
World· 16 Apr 2026

ఇక మీకొ దండం ః ట్రంప్ తో సౌదీ

ఇన్నాళ్లూ భరించాం. ఇక మీకో దండం అంటోంది సౌదీ అరేబియా. ఇరాన్ విషయంలో యూఎస్ వైఖరిని ఎట్టకేలకు గల్ఫ్ దేశాలు తప్పుబడుతున్నాయి. ఇక ఎంత మాత్రం ట్రంప్ ను సపోర్ట్ చేయలేం. ట్రంప్ ముందు తనను తాను సేవ్ చేసుకుంటే చాలు. ఆ తర్వాత మా సంగతి అని సౌదీ మంత్రి కామెంట్ చేశారు. 80 ఏళ్లలో సౌదీ అరేబియా అమెరికాకు ఎదురు తిరగడం ఇదే మొదలు. సో గల్ఫ్ లో సీన్ మారుతోంది. ట్రంప్ దారికొస్తారా?

2011 సెన్సస్ తో దక్షిణాదికి అన్యాయమే..
Politics· 15 Apr 2026

2011 సెన్సస్ తో దక్షిణాదికి అన్యాయమే..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం ఎంపీ సీట్లు జనాభా బట్టి సమానంగా ఉండాలి.‌తాజా సవరణ ద్వారా 'జనాభా' నిర్వచనాన్ని పార్లమెంటు తన ఇష్టానుసారం నిర్ణయించేలా మార్పులు ప్రతిపాదించారు. దీనివల్ల రాష్ట్రాల మధ్య సీట్ల కేటాయింపులో పార్లమెంటుకు మరిన్ని అధికారాలు దక్కుతాయి. ఇది నియోజకవర్గాల విస్తీర్ణంపై ప్రభావం చూపుతుంది. కేంద్రం ఎవరికీ అన్యాయం జరగదని, దక్షిణాదికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని అంటోంది. 2011 సెన్సెస్ ను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటోంది. దీనివల్ల దక్షిణాదికి దెబ్బే.. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న జనగణన చాలా టైమ్ పట్టేలా కనిపిస్తోంది.

నీ పిల్లివల్లే... మా పిల్లికి పిల్లలు
Entertainment· 15 Apr 2026

నీ పిల్లివల్లే... మా పిల్లికి పిల్లలు

బెంగళూరులో పిల్లి పిల్లల కోసం ఇద్దరు యజమానులు గొడవపడటం హాట్‌టాపిక్‌గా మారింది. ఒకరి ఆడపిల్లికి నాలుగు పిల్లలు పుట్టగా, దానికి పక్క ఇంట్లోని మగపిల్లే కారణమని ఆ యజమాని గొడవకు దిగాడు. ఆ పిల్లలను మీరే పెంచాలంటూ వారి ఇంట్లో వదిలేశాడు. ఈ వింత గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. చివరకు పోలీసులు కలగచేసుకుని, ఇద్దరికీ రెండేసి పిల్లి పిల్లలను ఇచ్చి ఈ క్యాట్ వార్ ని సెటిల్ చేశారు.