← Back to news

పదో యుద్ధం ఆపా ః ట్రంప్

By DS· 17 Apr 2026· Telugu Report· visakhapatnam
పదో యుద్ధం ఆపా ః ట్రంప్

ఇజ్రాయెల్ ,లెబనాన్ మధ్య పదిరోజుల తాత్కాలిక సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. శాంతి ఏర్పాటు కోసం రెండు దేశాలు ఒప్పుకున్నాయన్నారు. ఈ చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ పై పెట్టినట్లు చెప్పారు. దాదాపు 34 ఏళ్ల తర్వాత ఇరు దేశాల ప్రతినిధులు తొలిసారి భేటీ అయ్యారన్నారు. ఇరు దేశాధ్యక్షులతోనూ తాను మాట్లాడానని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో ఎనౌన్స్ చేశారు. దీంతో కలిపి ఇప్పటి వరకూ పది యుద్ధాలు ఆపానన్నారు.

More in World