Latest

 ముంచుకొస్తున్న ఏటీఎఫ్ కొరత.. ఇక నో ఫ్లైట్ సర్వీస్..
World· 22 Apr 2026

ముంచుకొస్తున్న ఏటీఎఫ్ కొరత.. ఇక నో ఫ్లైట్ సర్వీస్..

ఇరాన్, అమెరికా మధ్య వార్ రవాణా విమాన సర్వీసులపై కూడా పడుతోంది. హర్ముజ్ జలసంధి దగ్గర సీన్ ఇలా కొన్నాళ్లు కొనసాగితే పలు దేశాల్లో విమాన సర్వీసులు ఆగిపోతాయి. ఇప్పటికే అనేక ఎయిర్ లైన్స్ సంస్థలు తమ సర్వీసులను బాగా కుదించేశాయి. చమురు రవాణాను యుద్ధం దెబ్బతీయడంతో విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కొరత పెరుగుతోంది. యూరప్ అయితే మరీ ఐదు వారాలకు సరిపడ నిల్వలు మాత్రమే ఉండటంతో టెన్షన్ పడుతోంది.

తమిళనాడు' లో ..  రూ.1200 కోట్లకు పైగా .. సొమ్ము 'సీజ్'.
Crime· 22 Apr 2026

తమిళనాడు' లో .. రూ.1200 కోట్లకు పైగా .. సొమ్ము 'సీజ్'.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ... అధికారులు తనిఖీలను మరింత కఠినతరం చేశారు. రేపు జరగనున్న పోలింగ్‌కు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా ... భారీ స్థాయిలో నగదు, బంగారం, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు పట్టుబడిన నగదు, వస్తువుల మొత్తం విలువ ... రూ.1200 కోట్లను దాటిందని అధికారులు వెల్లడించారు. ఎన్నికల పర్యవేక్షణ బృందాలు ... నేరుగా రూ.500 కోట్లకు పైగా విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి.

నౌకలపై ఇరాన్ కాల్పులకు కారణాలివి !!
World· 22 Apr 2026

నౌకలపై ఇరాన్ కాల్పులకు కారణాలివి !!

హర్ముజ్ దగ్గర ఇరాన్ ఇవాళ ఫైరింగ్ జరిపిన షిప్పులలో ఒకటి పనామా జెండాతో ప్రయాణిస్తున్న కంటైనర్ షిప్ కాగా మరొకటి లైబీరియా జెండాతో దుబాయ్ నుంచి గుజరాత్ కు వస్తున్న మన దేశానికి చెందిన కార్గో షిప్. ఇవి జీపీఎస్ తారు మారు చేసి తప్పుదోవ పట్టించి, అనుమతులు లేకుండా ట్రావెల్ చేస్తున్నాయని ఇరాన్ ఆరోపించింది. ఆ రెండు షిప్పులను ఇరాన్ తీరానికి తరలించింది. ట్రంప్ సీజ్ ఫైర్ పొడిగించినా ఇరాన్ మాత్రం దాడులు చేస్తూనే ఉంది.

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. 30 ఏళ్లకే యువ నటి మృతి!
Local· 22 Apr 2026

చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. 30 ఏళ్లకే యువ నటి మృతి!

యువ నటి దివ్యాంక సిరోహి కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఉత్తర ప్రదేశ్‌లోని తన ఇంట్లో ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చింది. హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ఆమె చనిపోయింది. TikTok వీడియోలతో పాపులర్ అయిన దివ్యాంక, ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. కేవలం 30 ఏళ్ల వయసులోనే ఆమె మరణించడం పట్ల సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మూడు వేల కోసం  పెహల్గాం ఉగ్రవాదులకు ఆశ్రయం !
Crime· 22 Apr 2026

మూడు వేల కోసం పెహల్గాం ఉగ్రవాదులకు ఆశ్రయం !

పెహల్గాం దాడి గురించి స్థానికులు ఇద్దరికి ముందే తెలిసినా పోలీసులకు చెప్పలేదనే చేదు నిజం బయటపడింది. స్థానికులు బషీర్ అహ్మద్, పర్వేజ్ అహ్మద్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారని దర్యాప్తులో తేలింది.ఆయుధాలతో వచ్చిన టెర్రరిస్టులు ఐదు గంటల పాటు వీరి ఇళ్లలో ఉండి ఆపై వెళిపోయారని తేలింది. వారు పంజాబీ, హిందీ భాషలు కలగలిపి మాట్లాడారని, ఆశ్రయం ఇచ్చినందుకు మూడు వేలు ఇచ్చారని అధికారులు తెలిపారు.మరుసటి రోజు పెహల్గాంలో పొదల మాటున దాక్కుని టూరిస్టులను టార్గెట్ చేసారని అధికారులు తెలిపారు.

ఓడిపోయే పక్షం షరతులు పెట్టరాదు ః ఇరాన్
World· 22 Apr 2026

ఓడిపోయే పక్షం షరతులు పెట్టరాదు ః ఇరాన్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీజ్ ఫైర్ పొడిగింపును ఇరాన్ తోసిపుచ్చింది. ఇది ఒక "మీనింగ్ లెస్ కుట్ర"గా అభివర్ణించింది. ప్రస్తుత దిగ్బంధం బాంబు దాడులతో సమానమని, ఓడిపోయే పక్షం షరతులు విధించలేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ సలహాదారు మహదీ మొహ మ్మదీ అన్నారు. దీనికి సైనికపరంగానే ఆన్సర్ ఇస్తామని హెచ్చరిస్తూ, ఇది కేవలం సమయం కోసం ట్రంప్ ఆడుతున్న డ్రామా అని విమర్శించారు.

3 నెలల పసికందును బంధించిన కోతి..▶
Local· 22 Apr 2026

3 నెలల పసికందును బంధించిన కోతి..

ఉత్తర ప్రదేశ్‌లో ఒక వింత ఘటన జరిగింది. తన బిడ్డను కోల్పోయిన ఒక కోతి, మంచంపై పడుకున్న 3 మంత్స్ బేబీ ని బంధించింది. దీంతో కుటుంబ సభ్యులు భయంతో కేకలు వేసినా, సుమారు 2 గంటల పాటు ఆ బిడ్డను వదల్లేదు. చివరికి అనిమల్ రెస్క్యూ టీమ్ వచ్చి చాకచక్యంగా పసికందును క్షేమంగా కాపాడారు. దీనికి సంబంధించిన వీడియొ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సకల జనుల సమ్మెగా మారుస్తాం ః టీజీ ఆర్టీసీ ఎంప్లాయీస్
Politics· 22 Apr 2026

సకల జనుల సమ్మెగా మారుస్తాం ః టీజీ ఆర్టీసీ ఎంప్లాయీస్

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారని , దీనిని సకల జనుల సమ్మె గా మారుస్తామని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు.ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాలయాపన కోసమే ప్రభుత్వం కమిటీ వేసిందని విమర్శించారు. చర్చలు జరుగుతుండగా సమ్మె ప్రకటించడం చట్ట విరుద్ధమని, తక్షణం ఉద్యోగులు విధుల్లో చేరాలని తెలంగాణ ఆర్టీసీ ఎండీ పిలుపునిచ్చారు.

ఎంగేజ్మెంట్ అయ్యాక షాకింగ్ ట్విస్ట్.. యువతి ఆత్మహత్య!
Crime· 22 Apr 2026

ఎంగేజ్మెంట్ అయ్యాక షాకింగ్ ట్విస్ట్.. యువతి ఆత్మహత్య!

కడపకు చెందిన 26 ఏళ్ల రెహనా ఎమ్మెస్సీ పూర్తిచేసింది. గవర్నర్ చేతుల మీదుగా ఇటీవల పట్టా కూడా అందుకుంది. ఈమెకు బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్న ప్రొద్దుటూరుకు చెందిన షాజహాన్‌తో ఫిబ్రవరి 15న ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే, కొద్దిరోజులుగా అతను నువ్వంటే ఇష్టం లేదు, నాకు ఇప్పటికే నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటూ వేధించేవాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని suicide చేసుకుంది. చనిపోయే ముందు 12 పేజీల లెటర్ రాసింది. పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

హర్ముజ్ దగ్గర మళ్లీ ఫైరింగ్.. కమర్షియల్ వెస్సల్స్ పై ఇరాన్ టార్గెట్
World· 22 Apr 2026

హర్ముజ్ దగ్గర మళ్లీ ఫైరింగ్.. కమర్షియల్ వెస్సల్స్ పై ఇరాన్ టార్గెట్

హర్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ వాణిజ్య నౌకలపై ఫైరింగ్ కు పాల్పడుతోంది. మూడు కమర్షియల్ వెస్సల్స్ పై ఫైరింగ్ చేసి రెండింటిని ఇరాన్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీజ్ ఫైర్ పొడిగించినా, ఇరాన్ తన దూకుడును కొనసాగిస్తోంది.. బ్రిటీష్ సైన్యం (UKMTO) ప్రకారం, ఈ నౌకలపై వరుస దాడులు జరిగాయి. ఇరాన్ చర్యలతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా నిత్యావసరాల సరఫరాపై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది.

డైట్ కోక్స్ కి వార్ ఎఫెక్ట్..క్యాన్స్ లేక ఆర్డర్లు నిలిపివేత
World· 22 Apr 2026

డైట్ కోక్స్ కి వార్ ఎఫెక్ట్..క్యాన్స్ లేక ఆర్డర్లు నిలిపివేత

అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా డైట్ కోక్ (Diet Coke) అమ్మకాలు పడిపోయాయి. ప్రపంచ అల్యూమినియం ఉత్పత్తిలో 9% వాటా కలిగిన గల్ఫ్ ప్రాంతం నుండి సరఫరా నిలిచిపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇరాన్ హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించడంతో అల్యూమినియం క్యాన్ల కొరత ఏర్పడింది. భారతదేశంలో డైట్ కోక్ కేవలం క్యాన్లలోనే లభిస్తుంది కాబట్టి, స్టాక్ లేక పంపిణీదారులు ఆర్డర్లను నిలిపివేస్తున్నారు.

 మమత తీరుపై సుప్రీం ఆక్షేపణ
Politics· 22 Apr 2026

మమత తీరుపై సుప్రీం ఆక్షేపణ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (ED) సోదాలు నిర్వహిస్తున్న సమయంలో స్వయంగా జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేయడమేనని కోర్టు వ్యాఖ్యానించింది. I-PAC కార్యాలయంలో దర్యాప్తుకు ఆటంకం కలిగించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది కేవలం రాష్ట్ర-కేంద్రాల మధ్య వివాదం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఒక ముఖ్యమంత్రి దర్యాప్తులో నేరుగా పాల్గొనడం ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పింది.

సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన గుజరాత్‌ స్టార్ బౌలర్!▶
Sports· 22 Apr 2026

సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన గుజరాత్‌ స్టార్ బౌలర్!

గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ కగిసో రబాడ వివాదంలో చిక్కుకున్నాడు. ఐపీఎల్ 2026 ఆడుతున్న అతను, ఒక హోటల్ దగ్గర స్మోకింగ్ చేస్తూ కెమెరాకు దొరికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. గతంలో రబాడపై డోపింగ్ ఆరోపణలు ఉండటంతో, అతను వాడింది కేవలం సిగరెట్టేనా లేక ఏదైనా నిషేధిత పదార్థమా అని BCCI అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం రబాడ 6 మ్యాచ్‌ల్లో 10 వికెట్లతో మంచి ఫామ్‌లో ఉన్నాడు. గుజరాత్ తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 24న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది.

నోయిడాలో పెళ్లి ఇంట్లో ఘరానా దొంగ   చోరీ !▶
Crime· 22 Apr 2026

నోయిడాలో పెళ్లి ఇంట్లో ఘరానా దొంగ చోరీ !

వినోదం సినిమాలో బ్రహ్మానందం కామెడీ గుర్తుందా? సేమ్ టు సేమ్ అదే తరహాలో ఢిల్లీలో ఓ దొంగ డాబుగా సూటు, బూటు వేసుకుని ఓ పెళ్లికి వచ్చేశాడు. అక్కడ ఎవరూ తెలిసిన వారు లేరు. పిలవని పెళ్లికి అలా వచ్చాడన్న మాట. అందరూ ఎవరి పనిలో వారు ఉండగా అటూ ఇటూ చూసి ఈ దొంగ రూ. 5 లక్షల బ్యాగ్ నొక్కేశాడు. ఢిల్లీ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. ఎంత లాఘవంగా చోరీ చేశాడో మీరూ చూడండి..

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల పనులు వచ్చే నెలలో  !
Health· 22 Apr 2026

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల పనులు వచ్చే నెలలో !

రాష్ట్రంలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముందుగా ఫేజ్ 1లోని 4 మెడికల్ కాలేజీలు మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని పనులు మొదలు పెట్టాలని స్పష్టం చేశారు. అలాగే ఫేజ్ 2లో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
Local· 22 Apr 2026

ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

🔴 రాగల మూడు గంటల్లో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం 🟡 కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం 40-60కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఇంట్లోనే గంజాయి సాగు.. హైదరాబాద్ టెక్కీ నిర్వాకం
Crime· 22 Apr 2026

ఇంట్లోనే గంజాయి సాగు.. హైదరాబాద్ టెక్కీ నిర్వాకం

హైదరాబాద్‌లోని నాచారంలో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చేసిన పని ఇప్పుడు కలకలం రేపుతోంది. గంజాయికి బానిసైన శశిధర్ అనే టెక్కీ, తన జీతమంతా దానికే ఖర్చు చేసేవాడు. ఖర్చు తడిసి మోపెడవుతుండటంతో, బయట కొనడం మానేసి ఏకంగా తన ఇంట్లోనే గంజాయి మొక్కల సాగు (Cannabis Cultivation) మొదలుపెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా గదిలో ప్రత్యేక లైటింగ్, వాతావరణాన్ని ఏర్పాటు చేసి మరీ పెంచుతున్నాడు. పోలీసులు నాచారంలోని అతడి నివాసంపై దాడి చేయడంతో ఈ 'హోమ్ మేడ్' గంజాయి సాగు బట్టబయలైంది. మేడిపల్లిలో కూడా కొందరు టెక్కీలు ఇదే పని చేస్తూ ఉండడంతో వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత
Local· 22 Apr 2026

నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. ఆయన వయసు 90 ఏళ్లు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కొద్ది రోజులుగా ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. 1984లో అప్పటి సీఎం ఎన్టీఆర్ హార్ట్ సర్జరీకి అమెరికా వెళ్లినప్పుడు సీఎంగా గద్దెనెక్కారు. కేవలం నెల రోజులు మాత్రమే ఆయన ఆ పదవిలో ఉన్నారు. జనసేన నేత, ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయన కుమారుడే.

ఆర్టీసీలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు అవకాశం
Local· 22 Apr 2026

ఆర్టీసీలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు అవకాశం

ఆర్టీసీ సమ్మెతో తెలంగాణ ప్రభుత్వం అద్దె బస్సుల్ని నడిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో కండక్టర్లు లేకుండా వాటిని తిప్పుతోంది. మరోవైపు తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్లు, కండక్టర్లను నియమించడానికి సిద్ధమవుతోంది. పదో తరగతి సర్టిఫికెట్, ఆధార్ కార్డు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు ఎవరైనా ఆర్టీసీ డిపోల్లో సంప్రదిస్తే టెంపరరీ డ్రైవర్లగా నియమిస్తున్నారు.

కర్ణాటకలో ఘోరం.. అమెరికన్ మహిళా టూరిస్టుపై అత్యాచారం !
Local· 22 Apr 2026

కర్ణాటకలో ఘోరం.. అమెరికన్ మహిళా టూరిస్టుపై అత్యాచారం !

విదేశాల్లో భారత్‌ ప్రతిష్టని దిగజార్చే మరో అత్యాచార ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. కూర్గ్‌కు విహారయాత్రకు వచ్చిన ఒక అమెరికన్ మహిళపై హోమ్‌ స్టే యజమాని వృజేష్ కుమార్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఎవరికీ ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు మూడు రోజుల పాటు వైఫై (WiFi) కనెక్షన్‌ను కట్ చేసి బాధితురాలిని బంధించాడు. అతి కష్టమ్మీద తప్పించుకున్న ఆ టూరిస్ట్ ఫిర్యాదు మేరకు పోలీసులు వృజేష్ కుమార్, అతని అసిస్టెంట్ ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

గంటల్లోనే సీన్ రివర్స్..  హర్మూజ్ లో నౌకపై ఇరాన్ కాల్పులు
World· 22 Apr 2026

గంటల్లోనే సీన్ రివర్స్.. హర్మూజ్ లో నౌకపై ఇరాన్ కాల్పులు

అమెరికా కాల్పుల విరమణ ప్రకటించి ప్రపంచం ఊపిరి పీల్చుకునే లోపే ఇరాన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ట్రంప్ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌లో ప్రయాణిస్తున్న ఒక నౌకపై ఇరాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఆ నౌకను ధ్వంసం చేశాయి. హార్మూజ్ పై తాము పట్టు కోల్పోలేదన్న సంకేతాలు ఇవ్వడానికే ఇరాన్ ఈ పని చేసింది. దీంతో శాంతి చర్చలు మొదలవ్వకముందే మళ్ళీ ఉద్రిక్తతలు పీక్స్‌కు చేరాయి. ఎప్పుడు ఏం జరుగుతుందా అన్న టెన్షన్ ప్రపంచ దేశాల్లో నెలకొంది.