3 నెలల పసికందును బంధించిన కోతి..
ఉత్తర ప్రదేశ్‌లో ఒక వింత ఘటన జరిగింది. తన బిడ్డను కోల్పోయిన ఒక కోతి, మంచంపై పడుకున్న 3 మంత్స్ బేబీ ని బంధించింది. దీంతో కుటుంబ సభ్యులు భయంతో కేకలు వేసినా, సుమారు 2 గంటల పాటు ఆ బిడ్డను వదల్లేదు. చివరికి అనిమల్ రెస్క్యూ టీమ్ వచ్చి చాకచక్యంగా పసికందును క్షేమంగా కాపాడారు. దీనికి సంబంధించిన వీడియొ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

