ప్రైవేట్ జెట్‌లో క్రికెట్ ఆడిన సచిన్!
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రైవేట్ జెట్‌లో ఫ్యామిలీతో కలిసి క్రికెట్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఫ్లైట్‌లో కోడలు సానియా చందోక్ బౌలింగ్ చేయగా.. సచిన్ బ్యాటింగ్ చేశారు. కూతురు సారా ఫీల్డింగ్ చేస్తూ సచిన్‌ను సూపర్ క్యాచ్‌తో ఔట్ చేసింది. "ఎంత ఎత్తులో ఉన్నా నా ఆటిట్యూడ్ మారదు" అంటూ సచిన్ పెట్టిన క్యాప్షన్ క్రేజీగా ఉంది. రిటైర్ అయినా క్రికెట్‌పై ఆయనకున్న లవ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.



