కేసీఆర్ పాటలతో నాట్యం.. దేవీ నిమజ్జనం
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అంతర్గావ్ గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు జరిగాయి. నిమజ్జనం చివరి రోజు మహిళలు మాజీ సీఎం కేసీఆర్ను గుర్తు చేసుకున్నారు. కరోనా సమయంలోనూ రైతులకు అండగా నిలిచిన నేత మళ్లీ రావాలని దుర్గమ్మను వేడుకున్నారు. అంతర్గావ్ మహిళలు కేసీఆర్ పాటలతో నాట్యం చేస్తూ భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు.



