వెయ్యి స్తంభాల గుడికి పూర్వ వైభవం:ASI

Archaeological Survey of India(ASI) హైదరాబాద్ సర్కిల్ హనుమకొండలోని వెయ్యి స్తంభాల గుడిలో ద్వారపాలకుల విగ్రహాల పునరుద్ధరణ, పరిరక్షణ పనులను ప్రారంభించింది. విగ్రహాల అసలు ఆకృతి, నిష్పత్తులు, శిల్పశైలి దెబ్బతినకుండా సంప్రదాయ పద్ధతుల్లో పనులు చేస్తున్నారు. అవసరమైన చోట అదే రంగు, నాణ్యత కలిగిన రాతిని ఉపయోగిస్తున్నారు. గుడి చుట్టూ లాన్, మొక్కలు, దారుల అభివృద్ధి వంటి పనులు జరుగుతున్నాయి. ASI చెన్నై మాస్టర్ శిల్పి కనియప్పన్ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.

