ప్రియాంక ఘటనపై హైటెన్షన్.. విద్యాసంస్థలు బంద్
AP: రాజమహేంద్రవరం మెడికో ప్రియాంక ఘటనలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు రాజమండ్రిలో విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు మాజీ MP మార్గాని భరత్ తెలిపారు. ప్రియాంకను కారు ఢీకొట్టిన ఘటన తర్వాత నిందితులపై కేసు నమోదు విషయంలో పోలీసులు ఆలస్యం చేశారని ఆరోపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్‌కల్యాణ్, ఇతరులెవరూ పరామర్శించలేదని విమర్శించారు. నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు చేశారు. ఆమె కాసేపటి క్రితమే చికిత్స పొందుతూ <a href="https://www.theclearcutnews.com/n/Bs69Rid">మృతి</a> చెందిన విషయం తెలిసిందే.



