← Back to news

ఇండియా చైనాతో మళ్లీ దగ్గరవుతోందా..? 👀

By Nani· 7 Aug 2026
ఇండియా చైనాతో మళ్లీ దగ్గరవుతోందా..? 👀

భారత్–చైనా మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయి.. కానీ బోర్డర్ విషయంలో ఇంకా జాగ్రత్త తప్పదా? న్యూఢిల్లీలో రెండు దేశాల అధికారులు 36వ రౌండ్ సరిహద్దు చర్చలు నిర్వహించారు. సరిహద్దులో శాంతి, స్థిరత్వం కొనసాగితేనే రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత ముందుకు వెళ్తాయని భారత్ స్పష్టం చేసింది. ఈ సమావేశంలో బౌండరీ సమస్యలు, బోర్డర్ మేనేజ్‌మెంట్, రెండు దేశాల మధ్య కోఆర్డినేషన్ వంటి అంశాలపై చర్చించారు. భారత్–చైనా సంబంధాలు మళ్లీ మెరుగవుతున్న సమయంలో బోర్డర్‌లో పరిస్థితిని ప్రశాంతంగా ఉంచడమే ఇప్పుడు కీలకంగా మారింది.

More in Politics