← Back to news

అమర్ నాథ్ యాత్ర- బయల్దేరిన తొలి బ్యాచ్

By DS· 3 Jul 2026· jammu
అమర్ నాథ్ యాత్ర- బయల్దేరిన తొలి బ్యాచ్

పుణ్యక్షేత్రం అమర్‌నాథ్ యాత్ర గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుండి 4,822 మంది భక్తులతో కూడిన ఫస్ట్ బ్యాచ్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. 259 వెహికల్స్ కాన్వాయ్‌లో బయలుదేరిన ఈ యాత్రికులకు కాశ్మీర్ వ్యాలీ ఎంట్రెన్స్ వద్ద ఘన స్వాగతం లభించింది. ఈ 57 రోజుల యాత్ర ఆగస్టు 28 వరకు కొనసాగ నుంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం మల్టీ-టియర్ సెక్యూరిటీ గ్రిడ్‌ను ఏర్పాటు చేసింది. 670 కంపెనీల అడిషనల్ పారామిలటరీ ఫోర్సెస్, స్నైపర్స్, డ్రోన్స్, మరియు 24x7 ఆర్ఎఫ్ఐడి ట్రాకింగ్ సిస్టమ్‌తో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

More in News