గుంతల రోడ్డుతో గ్రామస్తుల అవస్థలు

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలోని కాసర్లపాడు–కొమ్మాల గ్రామాల లింక్ రోడ్డు గుంతలమయంగా మారింది. రెండేళ్ల క్రితం నిర్మించిన రహదారి నాసిరకం పనుల కారణంగా దెబ్బతిన్నదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల వర్షాలతో పరిస్థితి మరింత అధ్వానంగా మారిందని, ప్రయాణం ప్రమాదకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందన లేదని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.





