అందుకే అది 'సింగపూర్' అయ్యింది!

సింగపూర్‌లో లాండ్ తక్కువ. చెత్తను కాల్చి 90 శాతం వరకు తగ్గించి, ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేస్తారు. మిగతా బూడిదను సముద్రంలో సెమకావ్ ల్యాండ్‌ఫిల్‌కు తీసుకెళ్తారు. ఇది 350 హెక్టార్ల విస్తీర్ణంతో 2 చిన్న దీవుల మధ్య స్టోన్ వాల్‌తో నిర్మించిన, ప్రపంచంలోనే మొదటి సముద్ర ల్యాండ్‌ఫిల్. 1999లో ప్రారంభమైంది. 2035 వరకు యూజ్ అవుతుంది. ఇక్కడ మాంగ్రోవ్‌లు, పగడాలు, సముద్ర గడ్డి డెవలప్ అయ్యి, యానిమల్ కింగ్‌డమ్‌లా మారింది. ఇప్పుడు బూడిదను కన్‌స్ట్రక్షన్ మెటీరియల్‌గా రీసైకిల్ చేసే రీసెర్చ్ జరుగుతోంది.



