← Back to news

అద్దె ఇంటి బోర్డుపై 'కుల వివక్ష' కలకలం

By Bala· 6h ago· TG
అద్దె ఇంటి బోర్డుపై 'కుల వివక్ష' కలకలం

TG: మహబూబ్‌నగర్ పట్టణం న్యూ బాలాజీనగర్‌లో ఇంటి అద్దె విషయంలో కుల వివక్షకు సంబంధించిన బోర్డు కలకలం రేపింది. రాఘవేందర్ బాబు తన ఇంటి ముందు బంజారా వర్గానికి ఇల్లు రెంట్ ఇవ్వడం లేదని బోర్డు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బంజారా సేవాదళ్, గిరిజన సంఘాల నాయకులు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భారత రాజ్యాంగ సమానత్వానికి ఇది విరుద్ధమని అన్నారు. ఫిర్యదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More in TG