విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. కంట్రోల్‌రూమ్ ఏర్పాటు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం గురించి పూర్తి సమాచారం ప్రజలకు, సంబంధిత సంస్థలకు చేరవేసేందుకు జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తన కార్యాలయంలో 24x7 కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశారు. గాయపడిన వారికి సంబంధించిన వివరాల కోసం కంట్రోల్‌రూమ్ ఫోన్ నెంబరు 08912590100, 08912590102కి కాల్ చెయ్యవచ్చు. స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో తొమ్మిదిమంది మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.



