ఆంధ్రా పేపర్ మిల్‌పై చర్యలు తీసుకోవాలి: పవన్

AP: రాజమహేంద్రవరం గోదావరి కాలుష్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి కాలుష్యంలో ఆంధ్రా పేపర్ లిమిటెడ్ పరిశ్రమదే సగం ఉందని ఆరోపిస్తూ, వెంటనే సమన్లు జారీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. గత మూడు నెలలుగా పరిశ్రమ యాజమాన్యానికి తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినా స్పందించలేదన్నారు. పన్నులు చెల్లించడంలోనూ నిర్లక్ష్యం చేస్తున్నారని ఫైరయ్యారు. ఇకపై ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు.



