చెరువులే లేకపోతే వరదలు తప్పవు: రంగనాథ్

TG: చెరువులు కనుమరుగవడం, ఆక్రమణలకు గురికావడమే నగరాల్లో వరదలకు ప్రధాన కారణమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైదరాబాద్‌లో కేవలం 3, 4 సెంటీమీటర్ల వర్షానికే రహదారులపైకి నీరు చేరుతున్న పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. చెరువుల ఆక్రమణలతోపాటు ఇన్‌లెట్లు సక్రమంగా లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తోందన్నారు. హైడ్రాను అడ్డుకునేందుకు ల్యాండ్ మాఫియా ప్రయత్నాలు చేస్తున్నా ప్రజాప్రయోజనాల కోసం ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.



