← Back to news

వేట కొడవళ్లు, బీర్ బాటిళ్లు.. ఎందుకిలా?

By Krishna· 1h ago· X

కడపలో YCP మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఇంటిపై అర్ధరాత్రి జరిగిన దాడి తీవ్ర కలకలం రేపుతోంది. సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాహనాల్లో వచ్చి ఆమె ఇంటిపై మద్యం బాటిళ్లు విసిరారు. ఇంటి అద్దాలు, కిటికీలు ధ్వంసమయ్యాయి. ఒక వేట కొడవలిని అక్కడ వదిలారు. ఇది TDP కుట్ర అనే ఆరోపణలు వస్తున్నాయి. కడప 1 టౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ ఘటన రాజకీయ ఉద్రిక్తతలను పెంచుతూ.. ఎన్నికల నిర్వహణపై ఆందోళన కలిగిస్తోంది.

More in AP