చంద్రబాబుపై జుబైర్ సెటైర్
AP: YCP డబుల్ స్టాండర్ట్స్ పాటిస్తోందని CM చంద్రబాబు నిన్న చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. "ఈ మాటలు ఎవరు అంటున్నారో చూడండి" అని ఫ్యాక్ట్ చెకర్ మహ్మద్ జుబైర్ సెటైర్ వేశారు. "ఒకప్పుడు CECని సపోర్ట్ చేసిన YCP ఇప్పుడు ఆయన నచ్చలేదంటోంది" అని చంద్రబాబు అన్నారు. మరి చంద్రబాబు కూడా ఒకప్పుడు మోదీని తీవ్రంగా విమర్శించి.. ఇప్పుడు అదే మోదీని తెగ మెచ్చుకోవట్లేదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు? కామెంట్ చెయ్యండి.


