"మమ్మల్ని అరెస్ట్ చేస్తారు" అభిజీత్ దీప్కే

CJP కో-కన్వీనర్ అశుతోష్ రంకాను అసోం, గౌహతి పోలీసులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఏ కారణంతో డిటైన్ చేశారో చెప్పలేదని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే అన్నారు. అశుతోష్‌ని రిలీజ్ చెయ్యకపోతే, ఇతర CJP సభ్యులతో కలిసి తాను అసోం వెళ్తానని చెప్పిన దీప్కే.. CM హిమంత బిశ్వ శర్మ అందర్నీ అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని అన్నారు. అసోంలో "స్కూల్స్ పరిస్థితి, కజిరంగాలో హక్కుల ఉల్లంఘన, భూములను కార్పొరేట్లకు అప్పగించడం వంటి అంశాలపై CJP పోరాడుతోంది.

