EVM వద్దు.. బ్యాలెట్ పేపర్ తీసుకురావాలి: మాయావతి

‘EVM వద్దు.. బ్యాలెట్ పేపర్ తీసుకురావాలి’ అంటూ BSP జాతీయ అధ్యక్షురాలు, UP మాజీ CM, MP మాయావతి ఒక ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. దేశంలో ఈవీఎంల ద్వారా జరుగుతున్న మోసాలు, గందరగోళాలపై ఆమె రియాక్ట్ అయ్యారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిన ఓటు హక్కును ఎన్నికల కమిషన్ రక్షించాలని చెప్పారు. ఎన్నికలు న్యాయంగా జరగాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ EVMలను వ్యతిరేకించిందని, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక EVMలను కొనసాగించిందని నోట్‌లో పేర్కొన్నారు.


