కోర్టు కాంపౌండ్‌లో స్కూటర్‌కు మంటలు!
చెన్నైలోని మద్రాస్ హైకోర్టు కాంపౌండ్‌లో నిన్న స్కూటర్‌లో సడన్‌గా మంటలు వచ్చాయి. ఇండియన్ బ్యాంక్ దగ్గరలో పార్క్ చేసిన స్కూటర్ నుంచి మంటలు రావడంతో అక్కడ డ్యూటీలో ఉన్న CISF స్టాఫ్ డి. మన్నా వెంటనే అలర్ట్ అయ్యారు. ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌తో మంటలను కంట్రోల్ చేశారు. దీంతో మంటలు పక్కనే ఉన్న వెహికల్స్, కోర్టు బిల్డింగ్స్‌కు ఫైర్ స్ప్రెడ్ కాకుండా అడ్డుకున్నారు. CISF స్టాఫ్ టైమ్‌కు రెస్పాండ్ అవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది.



